శ్రీనేమాని పండితులకు, శ్రీ ఏల్చూరి మహోదయులకు శ్రీశంకారార్యులకు మిత్రులకు ప్రణామములతో శ్రీశంకరార్య గురువుల పరోక్షమున ఈ సాహసము చేయుచున్నాను. *గోలి హనుమచ్ఛాస్త్రిగారూ! వ్యాసభారతం ప్రకారం అర్జునుని ఏమికావాలో కోరుకొమ్మన్నా అతను వలదంటే శ్రీకృష్ణుని సలహా పై మయుడు నిర్మించినది. జగన్నాటక సూత్రధారికదా! సకల వినాశనమునకు సూత్రమైనది మయసభ అని అందంగా చెప్పిన మీకు అభినందనలు.
*లక్ష్మీదేవి అక్కయ్యగారూ! మయుడను అసురుని కాపాడడం ద్వారా అర్జునుడు పొందిన మయసభపై చెప్పిన మీకు అభినందనలు.
*పింగళి శశిధర్ గారూ! కర్మేంద్రియములనుండి గ్రహించినదంతయూ మంచీ కాదు చెడూ కాదు, చిత్తభ్రమలను విచిత్రముగా మయసభకు ముడిపెట్టి చెప్పిన మీ పూరణ నిత్య సత్యము. అభినందనలు.
*పోచిరాజు సుబ్బారావుగార్కి నమస్సులు. ఉన్నది లేనట్లు లేనిది యున్నట్లు గా కనిపించే మాయాసభ మయసభ యన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*హరి వెం స న మూర్తి గారూ! కవిసార్వభౌముని సీసాన్ని గుర్తుచేసారు. అద్భుతమైన పూరణ. మిక్కిలి అభినందనలు.
*సహదేవుడుగారూ! రారాజు అంతటి వానికే మతిపోగొట్టిన మయసభపై బాగున్నది మీ పూరణ. అభినందనలు.
**సరస్వతీ పుత్రులు, మహామహోపాధ్యాయ శ్రీ ఏల్చూరి మురళీధరరావుగార్కి ప్రణామములు. సూర్యునికి దివిటీ చూపడంలాంటి నేచేయు పని. మీ పద్యకవిత్వంపై విశ్లేషణ చేయ సామర్ధ్యం చాలకున్నవాడను. మయసభా ప్రవేశానంతరం అందున్న మనిషి స్థితిని చాల అద్భుతముగా చిత్రీకరించుచూ (PICTURAISATION) చెప్పిన పూరణ ప్రశస్తము. మీకు మిక్కిలి అభినందనలు.
*రాజేశ్వరి అక్కయ్యగారూ! మీపూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో యతి భంగము. ఏ అనే అచ్చుకి నే అనే హల్లుమీది ఏ కిని యతి కుదరదు. అచ్చుకి అచ్చుతోనే చెప్పండి.
పై వ్రాతలోని గుణములన్నియూ పెద్దల ఆశీస్సులు. దోషములన్నియూ నావిగా భావించి మన్నింప ప్రార్థన. బుధజనవిధేయుడు, మీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ.
‘శంకరాభరణం’ బ్లాగుకు ఒక్కరోజు కూడా ఆటకం రాకూడదనే సదాశయంతో ముందుకు వచ్చి, నిన్నటి సమస్యను, పద్యరచనా శీర్షికను పోస్ట్ చేయడమే కాక, మిత్రుల పూరణలను పద్యాలను సహృదయంతో సమీక్షించిన శ్రీ తొపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలు. వారి నిర్వహణాసామర్థ్యం ప్రశంసనీయం. సహకరించిన కవిమిత్రులందరికీ ధన్యవాదాలు.
మయ సభయే కాదది చి
రిప్లయితొలగించండిన్మయుడే కథ నడుప నిడిన మాయా సభయే
మయ సభ లో రభసయె గద
క్షయ మగుగా నట్లు జేసె క్షమ భారంబున్.
రిప్లయితొలగించండిచిన్నకుమారుడు కుంతికి,
నెన్నగ కాపాడగ మయుని, సభనొకటి దా
మన్ననతోడన్ పొందెన్,
కన్నుల పండుగ గొలిపెడు ఘనమౌ దానిన్.
గురుతుల్యులైన పెద్దలకు, తోటి కవిమిత్రులకు నమస్కరిస్తూ...
రిప్లయితొలగించండి--------
ఎంచి చూచినదంతయు మంచికాదు
చెడ్డదనుకొన్న దొకసారి చేయుమేలు
కర్మ ఫలములు మనచేత కలవె చెపుమ!
బ్రతుకు నిత్యంబు మయసభై భ్రమలు గొలుపు!
తోపెల్ల వంశ తిలకుడ!
రిప్లయితొలగించండిచీ పుగ గొట్టేసి యీ వు సింహా సనమున్
మా పాలిట గురు వైతివి
ఏపుణ్య ము జేసినామొ యీ శున కె ఱు కన్ .
చదివితిని దెలుగు కోర్సును
చదివెను మీ నాన్న కూడ చదువులు నచట న్
ముదమున మోడే కు ఱ్ఱు న
అదియే మా స్నే హ మునకు నాధా ర మయ్యెన్ .
పద్మ నాభుని పుత్రుడ ! బాల .... శర్మ !
మీ దు మిక్కిలి మిత్రుడు నీ దు తండ్రి
తండ్రి మించిన కొడుకువు తలచి జూడ
అందు కొనుమయ్య ! ఆ శీ స్సు లందు కొనుము .
మయుని సభ జూడ కనులార , మతిని జె ఱచు
రిప్లయితొలగించండిమాయ లోకము , వింతలు మహిమ లుండె
ఉన్న దంతయు గనబడు లేని వోలె
లేని దున్నట్లు గనబడి హీ న బఱచు.
ఏసభాభవనంబు వాసిగన్నది చూడ
రిప్లయితొలగించండిసౌందర్యరాశియౌ మందిరముగ,
ఏసభాభవనంబు భాసిల్లుచుండెను
కమనీయసత్కళాఖండ మట్లు,
ఏసభాభవనమం దాసుయోధను డప్పు
డవమానమును బొందె ననుపమముగ
ఏసభాస్థలముతా నిమ్మహి పాండవ
కౌరవకలహాల కారణంబు,
అదియె మయుడను శిల్పితా నతికుశలత
రచన మొనరించి యా ధర్మరాజు కపుడు
నిండు మనమున నర్పించి యుండె నాడు
లేని దున్నట్లు కన్పించు దానిలోన.
చూపుల కందకఁ దోచుచుఁ!
రిప్లయితొలగించండిచూపుల కందియు ననుభవ శూన్యంబగుచున్!
బాపురె! రారాజుకు మతి
బాపెను మయసభఁ గన నగుబాటై వగచన్!
శ్రీ గురువులకు, పెద్దలందరికి
రిప్లయితొలగించండిప్రణామములు!
అపరంజి గోడల యభిరామశుభధామ
వలయంబు వలఁగొని తలను దాఁక
హరినీలమణిజాలకరచాలనము లీలఁ
గళుకుఁగూటువలు చీఁకటులఁ జిమ్మఁ
దమ్మికెంపుల పంజు దరి సంౙకెంపులు
కంటఁ గెంపులు నింపి కంటగింప
నీరు దోఁపని వింత నీరాకరము పొంతఁ
గీలువడిన యోరఁ గాలుజాఱఁ
బరిహసించిన పాండవ పట్టమహిషి
నవ్వుతెఱ మాఱుమ్రోఁతలు నొవ్వుఁగొలుప
నీసు రోసంబు లొక్కట గాసివెట్ట
మయసభను గ్రాలె రారాజు మానధనుఁడు.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
రిప్లయితొలగించండిఖాండవ దహనాన పాండవమధ్యముం
………. డర్జునరక్షణ నంది మయుడు
ప్రత్యుపకృతికిన్ సభాభవనంబద్భు
………. తంబుగా నిర్మించె తపనతోడ
చిత్రవిచిత్రపు చిత్ర కుడ్యంబుల
………. గోచరాగోచర గుప్తరీతి
కాన్పించునొక చోట కాన్పింపదొక చోట
………. కామ్చినదంతయు కల్ల యగుచు
వజ్ర వైఢూర్య మాణిక్య ప్రస్తరముల
పద్మ సరస్సు మధ్యన వాసి యిచ్చి
ధర్మనందను కీర్తిని దళము కొలుప
మత్సరంబున రారాజు మదిని కుమిలె.
మాయా జాలము మయసభ
రిప్లయితొలగించండిఏయుగమున గాంచనంత నేర్పుగ మలచెన్ !
తోయజ మణిమయ మెరుపుల
సోయగ ముల వింత లెన్నొ సొగసులు విరియన్ !
శ్రీనేమాని పండితులకు, శ్రీ ఏల్చూరి మహోదయులకు శ్రీశంకారార్యులకు మిత్రులకు ప్రణామములతో శ్రీశంకరార్య గురువుల పరోక్షమున ఈ సాహసము చేయుచున్నాను.
రిప్లయితొలగించండి*గోలి హనుమచ్ఛాస్త్రిగారూ! వ్యాసభారతం ప్రకారం అర్జునుని ఏమికావాలో కోరుకొమ్మన్నా అతను వలదంటే శ్రీకృష్ణుని సలహా పై మయుడు నిర్మించినది. జగన్నాటక సూత్రధారికదా! సకల వినాశనమునకు సూత్రమైనది మయసభ అని అందంగా చెప్పిన మీకు అభినందనలు.
*లక్ష్మీదేవి అక్కయ్యగారూ! మయుడను అసురుని కాపాడడం ద్వారా అర్జునుడు పొందిన మయసభపై చెప్పిన మీకు అభినందనలు.
*పింగళి శశిధర్ గారూ! కర్మేంద్రియములనుండి గ్రహించినదంతయూ మంచీ కాదు చెడూ కాదు, చిత్తభ్రమలను విచిత్రముగా మయసభకు ముడిపెట్టి చెప్పిన మీ పూరణ నిత్య సత్యము. అభినందనలు.
*పోచిరాజు సుబ్బారావుగార్కి నమస్సులు. ఉన్నది లేనట్లు లేనిది యున్నట్లు గా కనిపించే మాయాసభ మయసభ యన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*హరి వెం స న మూర్తి గారూ! కవిసార్వభౌముని సీసాన్ని గుర్తుచేసారు. అద్భుతమైన పూరణ. మిక్కిలి అభినందనలు.
*సహదేవుడుగారూ! రారాజు అంతటి వానికే మతిపోగొట్టిన మయసభపై బాగున్నది మీ పూరణ. అభినందనలు.
**సరస్వతీ పుత్రులు, మహామహోపాధ్యాయ శ్రీ ఏల్చూరి మురళీధరరావుగార్కి ప్రణామములు. సూర్యునికి దివిటీ చూపడంలాంటి నేచేయు పని. మీ పద్యకవిత్వంపై విశ్లేషణ చేయ సామర్ధ్యం చాలకున్నవాడను.
మయసభా ప్రవేశానంతరం అందున్న మనిషి స్థితిని చాల అద్భుతముగా చిత్రీకరించుచూ (PICTURAISATION) చెప్పిన పూరణ ప్రశస్తము. మీకు మిక్కిలి అభినందనలు.
*రాజేశ్వరి అక్కయ్యగారూ! మీపూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో యతి భంగము. ఏ అనే అచ్చుకి నే అనే హల్లుమీది ఏ కిని యతి కుదరదు. అచ్చుకి అచ్చుతోనే చెప్పండి.
పై వ్రాతలోని గుణములన్నియూ పెద్దల ఆశీస్సులు. దోషములన్నియూ నావిగా భావించి మన్నింప ప్రార్థన.
బుధజనవిధేయుడు,
మీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ.
భూములుమాయమాయెగదభూరిగ సెజ్జులపేరుతో ,పరం
రిప్లయితొలగించండిధామునిసొమ్ములున్ కరిగెధర్మముతప్పెనుదారి నాయక
స్వాముల చేష్టతో ఖనిజసంపద గాలినగల్సెజూడగా
యేమనిజెప్పుదున్ మయసభేర్పడెరాష్ట్రమునందుసోదరా !
‘శంకరాభరణం’ బ్లాగుకు ఒక్కరోజు కూడా ఆటకం రాకూడదనే సదాశయంతో ముందుకు వచ్చి, నిన్నటి సమస్యను, పద్యరచనా శీర్షికను పోస్ట్ చేయడమే కాక, మిత్రుల పూరణలను పద్యాలను సహృదయంతో సమీక్షించిన శ్రీ తొపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలు. వారి నిర్వహణాసామర్థ్యం ప్రశంసనీయం. సహకరించిన కవిమిత్రులందరికీ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి