మాలిమి తోడ నన్నుఁ గని మాయలలోకమునందు వైచినన్,మేలిమి ప్రీతిఁజూపు; నను మిన్నగ గాచెడు రామచంద్రుడే,లీలగ నేలు, రామునికి లెస్సగఁ జేతును వందనమ్ము; నాపాలిటి కష్టమెల్ల నిక బాపెను దా, నభయంపు హస్తమై.
వెల్గె కైలాస శిఖరమ్ము నాల్గు దిశల మ్రోగ ఢమరుక ధ్వనులంత ముజ్జగముల నటన మాడెను నటరాజు జటలు కదలఅభయ హస్త మభినయపు హస్తమయ్యె
విశ్వ గురుడగు సాయిని వేడు కొనినకనిక రించుచు దప్పక గరుణ తోడఅభయ హస్తము జూపును నాక్ష ణ మునబాధ తొలగును నిజమను భవ ము నాది .
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కలిమి బలిమి యొసగు కలియుగదైవంబువేంకటేశ్వరుండు విశ్వమునకునభయహస్త మెప్పు డందించుచుండంగభయము నందనేల? భక్తకోటి.
కోపము తాపమున్ తగని కోరిక బొంకును దూకుడున్ పటా టోపము మోసమున్ సుజన దూషణ యీ ర్ష్య లసూయలాదిగా లోపములన్ని నామనము లోనికి జేరగనీయ బోకుమా యాపద లార్పగా నభయ హస్తము నీయవె వేంకటేశ్వరా !!!
కరుణ గురిపించు గలువల కన్నులందు, నభయమిచ్చును దక్షిణహస్తమందు, వరదముద్రను బట్టెను వామహస్త మందు నాయంబికామాత యదియె కనుమ.
అభయ హస్తమ్మ మాది మాదని పలువురుపాద యాత్రలఁ జేయుచు పలుకు చుండకాచునెవరో? తమను పట్టి దోచు నెవరొ?మారి భస్మాసురుల వలె మాడ్చు నెవరొ?దిక్కు తోచక జనులకు తిక్క రేగిదిమ్మతిరిగెడు తీర్పీయ తేల్చిరేమొ?
భయమును బడుచును మరి ' నిర్భయలా ' మన పడుచు లెల్ల బాధల బడకన్నభయపు ' హస్తము' తో నిర్భయులై తిరుగాడు రోజు వచ్చే దెపుడో !
వెఱ్ఱి శివుడిచ్చె వరమంచు విఱ్ఱ వీగి అభయ హస్తము నిక్కమౌ విభవ మెంచ తెలుసు కొనగోరి యసురుడు తెలివి యనుచు తనదు కరమును శిరముపై తాకి మలిగె !
‘అభయహస్త’మన్న అంశంపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....లక్ష్మీదేవి గారికి, నాగరాజు రవీందర్ గారికి, సుబ్బారావు గారికి, హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి, మంద పీతాంబర్ గారికి,కమనీయం గారికి, సహదేవుడు గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, నేదునూరి రాజేశ్వరి అక్కయ్యకుఅభినందనలు, ధన్యవాదాలు.
మాలిమి తోడ నన్నుఁ గని మాయలలోకమునందు వైచినన్,
రిప్లయితొలగించండిమేలిమి ప్రీతిఁజూపు; నను మిన్నగ గాచెడు రామచంద్రుడే,
లీలగ నేలు, రామునికి లెస్సగఁ జేతును వందనమ్ము; నా
పాలిటి కష్టమెల్ల నిక బాపెను దా, నభయంపు హస్తమై.
వెల్గె కైలాస శిఖరమ్ము నాల్గు దిశల
రిప్లయితొలగించండిమ్రోగ ఢమరుక ధ్వనులంత ముజ్జగముల
నటన మాడెను నటరాజు జటలు కదల
అభయ హస్త మభినయపు హస్తమయ్యె
విశ్వ గురుడగు సాయిని వేడు కొనిన
రిప్లయితొలగించండికనిక రించుచు దప్పక గరుణ తోడ
అభయ హస్తము జూపును నాక్ష ణ మున
బాధ తొలగును నిజమను భవ ము నాది .
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికలిమి బలిమి యొసగు కలియుగదైవంబు
రిప్లయితొలగించండివేంకటేశ్వరుండు విశ్వమునకు
నభయహస్త మెప్పు డందించుచుండంగ
భయము నందనేల? భక్తకోటి.
కోపము తాపమున్ తగని కోరిక బొంకును దూకుడున్ పటా
రిప్లయితొలగించండిటోపము మోసమున్ సుజన దూషణ యీ ర్ష్య లసూయలాదిగా
లోపములన్ని నామనము లోనికి జేరగనీయ బోకుమా
యాపద లార్పగా నభయ హస్తము నీయవె వేంకటేశ్వరా !!!
రిప్లయితొలగించండికరుణ గురిపించు గలువల కన్నులందు,
నభయమిచ్చును దక్షిణహస్తమందు,
వరదముద్రను బట్టెను వామహస్త
మందు నాయంబికామాత యదియె కనుమ.
అభయ హస్తమ్మ మాది మాదని పలువురు
రిప్లయితొలగించండిపాద యాత్రలఁ జేయుచు పలుకు చుండ
కాచునెవరో? తమను పట్టి దోచు నెవరొ?
మారి భస్మాసురుల వలె మాడ్చు నెవరొ?
దిక్కు తోచక జనులకు తిక్క రేగి
దిమ్మతిరిగెడు తీర్పీయ తేల్చిరేమొ?
భయమును బడుచును మరి ' ని
రిప్లయితొలగించండిర్భయలా ' మన పడుచు లెల్ల బాధల బడక
న్నభయపు ' హస్తము' తో ని
ర్భయులై తిరుగాడు రోజు వచ్చే దెపుడో !
వెఱ్ఱి శివుడిచ్చె వరమంచు విఱ్ఱ వీగి
రిప్లయితొలగించండిఅభయ హస్తము నిక్కమౌ విభవ మెంచ
తెలుసు కొనగోరి యసురుడు తెలివి యనుచు
తనదు కరమును శిరముపై తాకి మలిగె !
‘అభయహస్త’మన్న అంశంపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిలక్ష్మీదేవి గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
సుబ్బారావు గారికి,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
మంద పీతాంబర్ గారికి,
కమనీయం గారికి,
సహదేవుడు గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
నేదునూరి రాజేశ్వరి అక్కయ్యకు
అభినందనలు, ధన్యవాదాలు.