17, ఏప్రిల్ 2013, బుధవారం

సమస్యాపూరణం – 1026 (దూఱలేదని యర్ధాంగి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
దూఱలేదని యర్ధాంగి దూఱెఁ బతిని.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.

15 కామెంట్‌లు:

  1. అద్దె నీయరు నెనెలా యడుగలేవు
    ఖాళి జేయగ చెప్పవు గట్టిగాను
    యెదురు తిరిగెడు వారినే యెందుకీవు
    దూఱలేదని యర్ధాంగి దూఱెఁ బతిని.

    రిప్లయితొలగించండి
  2. ఏల నాడు నన్నటుల నిందించి తీవు ?
    యనుచు జగడ మాడగ భర్త యాలి తోడ
    ఎన్నడు నటుల నిన్ను దూషించలేదు
    దూఱలేదని యర్ధాంగి దూఱె పతిని

    రిప్లయితొలగించండి
  3. తప్ప తాగిన యొక్కడు తలుపు తట్టి
    ఇంటి లోనికి జొఱబడి ఇంతి గూర్చి
    పలువి ధములుగ బూతులు బలుక ,నతని
    దూ ఱ లేదని యర్ధాంగి దూఱె పతిని

    రిప్లయితొలగించండి
  4. శాస్త్రి గారు ! నమస్కారములు

    మొదటి పాదములో " నెలనెలా " అని ఉండాలేమో అండి

    రిప్లయితొలగించండి
  5. నిజమేనండీ సుబ్బారావు గారూ ! ఒక ' లా ' పడ లేదు. ధన్యవాదములు.

    అద్దె నీయరు నెలనెలా యడుగలేవు
    ఖాళి జేయగ చెప్పవు గట్టిగాను
    యెదురు తిరిగెడు వారినే యెందుకీవు
    దూఱలేదని యర్ధాంగి దూఱెఁ బతిని.

    రిప్లయితొలగించండి
  6. పత్ని పతితోడ నడచుచు పట్టణమున
    పోవుచుండగా నపుడొక పోకిరతడు
    త్రాగి గట్టిగా భార్యను దాకె , వాన్ని
    దూఱలేదని యర్ధాంగి దూఱె పతిని

    రిప్లయితొలగించండి
  7. ఈ సమస్య చూస్తుంటే చిన్నప్పుడు నే చూసిన దంపతులు గుర్తుకొస్తోంది. ఆ మొగుడూ పెళ్ళాలు పగలంతా తెగ తిట్టుకొనేవాళ్ళు కొండొకచో కొట్టుకొనేవాళ్ళు." ఎప్పుడైనా మొగుడు సైలెంట్ గా కూర్చుని పనిచేసుకొంటుంటే "ఏం ఈరోజు అయ్యగారి నోరు పడిపోయిందే" అని ఆవిడ తిట్ల పంచాంగం ఎత్తుకోనేది. దాంతో మళ్ళా యుద్ధం మొదలు. ఇలా కొన్నేళ్ళు చూశాను. గోలి వారికి కూడా ఇలాంటి అనుభవం ఏదో అయిందేమో:-)

    రిప్లయితొలగించండి
  8. ఔర మిక్కిలి సౌమ్యు లయ్యాలుమగలు
    కలిసి మెలసి యుందురు తమ కాపురమున
    బంధు లరుదెంచ వారిని బంపబూని
    దూఱ లేదని యర్ధాంగి దూఱె బతిని

    రిప్లయితొలగించండి
  9. భాగ పంపక మందున బావ గారు
    మంచి యాస్తుల తనకేమొ పంచు కొనిన
    నోరు మెదపక కూర్చుండి వారి నసలు
    దూఱ లేదని యర్థాంగి దూఱెఁ బతిని

    రిప్లయితొలగించండి
  10. నీదు హృదయంబున సిరిని నేను నిలువ
    భృగువు వచ్చి తన్నె యెదను వింత గొలుప
    మూర్ఖుడై ప్రవర్తించిన మునిని నీవు
    దూఱలేదని యర్ధాంగి దూఱెఁ బతిని!!

    రిప్లయితొలగించండి
  11. ఇల్లు వాకిలు బట్టక నింటి సుఖము
    బారు బీరుల వెంబడి తిరిగి తిరిగి
    బాగు కోరని హితులను భోగ మనుచు
    దూఱ లేదని యర్ద్ధాంగి దూఱెఁ బతిని

    రిప్లయితొలగించండి
  12. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
    ప్రణామములు!

    దైవసములైన మాతృపితరుల సేవ
    మాని వేర్వడఁ గోరె దుర్మార్గుఁ డొకఁడు
    “దంపతుల కనర్హ; మఘము దానియట్టి
    దూఱ లే” దని యర్ధాంగి దూఱెఁ బతిని.

    దంపతులకు+అనర్హము = గృహస్థులకు అనుచితమైన, దానియట్టిది = తల్లిదండ్రులను విడువగోరు అటువంటి, అఘము = పాపమును, ఊఱ లేదని = పోలునది లేదని, అర్ధాంగి పతిని నిందించెను.

    ఊఱు = సరిపోలు.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  13. వలువ లొలిచిన చెదరని పతులు మీరు
    సతిని చెఱ బట్టి యీడ్చిన హితము గాను
    జూద మందున పణమిడు సూరు లనగ
    దూఱ లేదని యర్ద్ధాంగి దూఱెఁ బతిని

    రిప్లయితొలగించండి
  14. నిన్నటి సమస్య అశ్లీలార్థాన్ని స్ఫురింపజేస్తుందేమో అని సందేహిస్తూనే ఇచ్చాను. అప్పటికీ సుబ్బారావు గారు ఫోన్ చేసి అడగనే అడిగారు. అయినా సంస్కార హృదయులైన కవిమిత్రులు చక్కని పూరణ లందించారు.
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    సుబ్బారావు గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    పండిత నేమాని వారికి,
    సహదేవుడు గారికి,
    జిగురు సత్యనారాయణ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    ఏల్చూరి మురళీధర రావు గారికి,
    అభనందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి