సాహితీవేత్తలకూ, కవిమిత్రులకూ ఒక ప్రశ్న - నేను పత్రికల ద్వారా గమనించిన దానిని బట్టి శ్రీరావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ పురస్కారం లభించటం అంతగా మెచ్చుకొన్నట్లని పించలేదు. వారి జీవితం, సాహితీ పాండిత్యం గురించి అంతర్జాలంలో ఎక్కువగా వివరాలు దొరకలేదు. మనబ్లాగులో విషయం తెలిసినవారి ద్వారా అభిప్రాయం వినాలని కుతూహలం.
ఈనాటి సమస్య వైవిధ్యభరితమైన చక్కని పూరణలకు అవకాశం ఇచ్చింది. సంతోషం! కాకుంటే కొందరు మిత్రులు వ్యావహారిక పదాలను, ఆంగ్ల పదాలను ఆశ్రయించారు. దుష్కర ప్రాస అయినందున తప్పదు మరి! * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘హైడ్రా’ అన్నది డాక్టర్ గారి పేరా? ఆ డాక్టర్ ఇచ్చిన మందు పేరా? ఆ శబ్దానికి ‘గ్రీకు పురాణాలలో అనేక తలలున్న కాలసర్పం’ అనే అర్థం ఉంది. * పండిత నేమాని వారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ, ధన్యవాదాలు. నేను చూసిన అవధాన విద్య పుస్తకంలో అది అవధాన సారము గ్రంధములోనికి అని మాత్రమే ఇచ్చారు. వివరాలు లేవు. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * చంద్రశేఖర్ గారూ, రావూరి వారికి అవార్డ్ వచ్చిన మరునాడే బ్లాగులో మిత్రులు అభినందనల వ్యాఖ్యలు వ్రాసారు. వారి గురించి పత్రికలూ, మీడియా, బ్లాగులు బాగానే వ్రాసాయి. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘చెప్పను + ఒక = చెప్పెనొక’ అవుతుంది. ‘ చెప్పెర యొక కథ / చెప్పిన దొక కథ’ అందాం. * మిస్సన్న గారూ, చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు. మిస్సన్నా! మీ ప్రజ్ఞను లెస్సనుచును చెప్పువాడె లేడు గదన్నా! లెస్సగ పూరణ లన్నియు మిస్సవకుండ లిఖియించు మేధావివిలే! * తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ, ఆంగ్ల పదాల సహాయం లేకుండా చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. * మంద పీతాంబర్ గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * సహదేవుడు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగుంది. అభినందనలు. * కమనీయం గారూ, మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
గొడ్రాలని జనులనగ వి
రిప్లయితొలగించండిరాడ్రూపుని వేడు కొనుచు వేవేవిధముల్
' హైడ్రా ' డాక్టరు మందిడ
గొడ్రాలికి కొడుకొకండు గొబ్బునఁ బుట్టెన్.
గొడ్రాలొక్కతి కనగ వి
రిప్లయితొలగించండిరాడ్రూపుని వేడు కొనగ వేవేవిధముల్
' హైడ్రా ' వైద్యుడు మందిడ
గొడ్రాలికి కొడుకొకండు గొబ్బునఁ బుట్టెన్.
(ఇందులో ప్రాస వేయుటే కొంచెము ఇబ్బంది పెట్టును).
రిప్లయితొలగించండిగొడ్రాలు పూర్వభవమున
వడ్రంగి కులాన బుట్టి భర్గుని కొలువన్
మెడ్రాసు నగరమున నా
గొడ్రాలికి కొడుకొకండు గొబ్బున బుట్టెన్
ఒక అజ్ఞాత కవి పూరణ....
రిప్లయితొలగించండివిడ్రాజి యలర దశరథ
రాడ్రత్నము మఖము చేసె, వ్రతఫలముగ స
మ్రాడ్రీతిని జిరకాలపు
గొడ్రాలికి కొడు కొకండు గొబ్బునఁ బుట్టెన్.
(విట్ + రాజి = విడ్రాజి = జనసమూహము)
(‘అవధాన విద్య’ గ్రంథమునుండి)
శంకరయ్య గారికి నమస్సులు
రిప్లయితొలగించండివిడ్రాజి యలర దశరథ
రాడ్రత్నము మఖము చేసె, వ్రతఫలముగ స
మ్రాడ్రీతిని జిరకాలపు
గొడ్రాలికి కొడు కొకండు గొబ్బునఁ బుట్టెన్.
ఈ పూరణ "అవధాన సారము" అను గ్రంథములోనిది.
గ్రంథకర్తలు రాజశేఖర వేంకటశేషకవులు(దుర్భాక రాజశేఖర శతావధాని, గడియారం వేంకట శేషశాస్త్రి)
చాలా క్లిష్టమయిన సమస్య. ధన్యవాదములు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిషడ్రుచుల మిళిత మౌషధి
రిప్లయితొలగించండినో డ్రాపును పాల యందు నొనరగ గలపన్
గుడ్రా !యనుచును మింగిన
గొడ్రాలికి కొడు కొకండు గొబ్బునఁ బుట్టెన్.
సాహితీవేత్తలకూ, కవిమిత్రులకూ ఒక ప్రశ్న - నేను పత్రికల ద్వారా గమనించిన దానిని బట్టి శ్రీరావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ పురస్కారం లభించటం అంతగా మెచ్చుకొన్నట్లని పించలేదు. వారి జీవితం, సాహితీ పాండిత్యం గురించి అంతర్జాలంలో ఎక్కువగా వివరాలు దొరకలేదు. మనబ్లాగులో విషయం తెలిసినవారి ద్వారా అభిప్రాయం వినాలని కుతూహలం.
రిప్లయితొలగించండిగె డ్రా జెప్పెను నొక కధ
రిప్లయితొలగించండిగొడ్రాలికి కొడుకొకండు గొబ్బున పుట్టెన్
మెడ్రాసు వైద్య మైనను
గొడ్రాల్ మ ఱి కనగ లేదు కొడుకును బుడమిన్ .
చూడ్రా! మన వాణి కొడుకు
రిప్లయితొలగించండివాడ్రా! మందీయ తనకు వైద్యు డొకడు పు-
ట్టేడ్రా! నిజమేరా యిది,
" గొడ్రాలికి కొడు కొకండు గొబ్బునఁ బుట్టెన్."
గురువుగారూ అజ్ఞాత కవి గారి పద్యం అద్భుతం.
రిప్లయితొలగించండిపండిత శ్రీనేమాని గురువులకు బ్లాగు మిత్రులకు
రిప్లయితొలగించండినమస్సులతో
గొడ్రాలని బంధుగులన
గొడ్రాలి పతికి కణములు గూర్పెడు మందుల్
షడ్రీతి వైద్యుడిడగన్
గొడ్రాలికి కొడుకొకండు గొబ్బునఁ బుట్టెన్.
తోపెల్ల వారు చితక్కొట్టేశారు చాలా కాలానికి.
రిప్లయితొలగించండిమూడ్రోజులారు పూటలు
రిప్లయితొలగించండిషడ్రుచులనుమేళవించి చ్యవనౌషదమున్
మాడ్రన్ వైద్యుండీయగ
గొడ్రాలికి కొడుకొకండు గొబ్బునఁ బుట్టెన్!!!
వాడ్రేవు యింటి కోడలు
రిప్లయితొలగించండిషడ్రీతిగ యోగ విద్య సాధన జేయన్
లేడ్రా యను నోర్మూయగ
గొడ్రాలికి కొడుకొకండు గొబ్బునఁబుట్టెన్!
గొడ్రాలని నింద బడిన
రిప్లయితొలగించండిగొడ్రాలికి కొడు కొకండు గొబ్బునఁ బుట్టెన్ !
ఎడ్రసు తెలియని వైద్యుడు
ఓడ్రము నందుండి దెచ్చె నొక యౌషద మున్ !
ఓడ్రము = ఒరిస్సా దేశము
రిప్లయితొలగించండిచూడ్రా,నవీన వైద్యం
బో డ్రామాలాగు నున్న దొక చిత్రంబౌ
మాడ్రన్ పద్ధతి వలనను
గొడ్రాలికి గొడుకొకండు గొబ్బున బుట్టెన్!
రండ్రా పరుగున ఇచటన్
రిప్లయితొలగించండివిడ్రా అయినట్టు ఏటియం నుంచి డబ్బు
చూడ్రా వైద్యుల ఘనతన్
గొడ్రాలికి కొడుకొకండు గొబ్బునఁ బుట్టెన్.
ఈనాటి సమస్య వైవిధ్యభరితమైన చక్కని పూరణలకు అవకాశం ఇచ్చింది. సంతోషం!
రిప్లయితొలగించండికాకుంటే కొందరు మిత్రులు వ్యావహారిక పదాలను, ఆంగ్ల పదాలను ఆశ్రయించారు. దుష్కర ప్రాస అయినందున తప్పదు మరి!
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘హైడ్రా’ అన్నది డాక్టర్ గారి పేరా? ఆ డాక్టర్ ఇచ్చిన మందు పేరా? ఆ శబ్దానికి ‘గ్రీకు పురాణాలలో అనేక తలలున్న కాలసర్పం’ అనే అర్థం ఉంది.
*
పండిత నేమాని వారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
ధన్యవాదాలు. నేను చూసిన అవధాన విద్య పుస్తకంలో అది అవధాన సారము గ్రంధములోనికి అని మాత్రమే ఇచ్చారు. వివరాలు లేవు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
చంద్రశేఖర్ గారూ,
రావూరి వారికి అవార్డ్ వచ్చిన మరునాడే బ్లాగులో మిత్రులు అభినందనల వ్యాఖ్యలు వ్రాసారు. వారి గురించి పత్రికలూ, మీడియా, బ్లాగులు బాగానే వ్రాసాయి.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘చెప్పను + ఒక = చెప్పెనొక’ అవుతుంది. ‘ చెప్పెర యొక కథ / చెప్పిన దొక కథ’ అందాం.
*
మిస్సన్న గారూ,
చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
మిస్సన్నా! మీ ప్రజ్ఞను
లెస్సనుచును చెప్పువాడె లేడు గదన్నా!
లెస్సగ పూరణ లన్నియు
మిస్సవకుండ లిఖియించు మేధావివిలే!
*
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
ఆంగ్ల పదాల సహాయం లేకుండా చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
కమనీయం గారూ,
మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
గొడ్రాలి పైన పూరణ
రిప్లయితొలగించండివాడ్రా వీడ్రా యటంచు వదరగ మెచ్చెన్
ఏడ్రా వేరొక గురువు-
న్నాడ్రా శంకరుల సాటి నాకున్ జెపుమా.
రుడ్రాభిషేకములతో
రిప్లయితొలగించండిచిడ్రూపము వలన లొసుగు ఛేడింపంగా
భడ్రాడ్రిరాము డయతో
గొడ్రాలికి కొడుకొకండు గొబ్బునఁ బుట్టెన్