13, ఏప్రిల్ 2013, శనివారం

పద్య రచన - 310 (పుట్టినిల్లు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“పుట్టినిల్లు”

13 కామెంట్‌లు:

  1. ఇందిరకును నిశిరేడగు
    చందురునికి పుట్టినిల్లు సంద్రము కనగా
    నందలి ముత్యములను మరి
    సౌందర్యపు పుట్టినిల్లు సత్యమె నిదియౌ.

    రిప్లయితొలగించండి
  2. పుట్టి నింటను మఱియును మెట్టి నింట
    మంచి యనిపించు కొనునట్టి మహిళ జూడ
    సంత సంబున జేతును శతపు నతులు
    అట్టి వారలన్ గనునుమా యాంధ్ర మాత .

    రిప్లయితొలగించండి
  3. కష్ట సుఖముఁ జెప్ప కలము మేమని బల్కు
    పుట్టి నిల్లు గోరుఁ బుడమి మహిళ
    దన్ను నీయ కున్న దాక్షాయణికి నాడు
    యజ్ఞ గుండ మదియె నాదరించె

    రిప్లయితొలగించండి
  4. ఎద్దాని గనినంత నీక్షణద్వయముతో
    హర్షాతిరేకంబు ననుభవింత
    మెద్దాని నామంబు నెపుడు విన్ననుగాని
    మమతానురాగంబు లమరుచుండు
    ఎద్దానిలో జేర నద్దిర! చూడంగ
    సకలసౌఖ్యంబులు ప్రకటమగును
    ఎద్దాని సారూప్య మిమ్మహీతలమందు
    కాంక్షించి వెతికిన కానరాదు
    సర్వజనముల కయ్యది సంతతంబు
    హర్షదాయక మన్నింట నద్భుతంబు
    శాంతియుతమింక శ్రేష్ఠంబు సత్త్వదంబు
    పుట్టినిల్లది నిక్కంబు భోగదంబు.

    రిప్లయితొలగించండి
  5. పడతి తాను పుట్టి వసియించు చుండును
    పుట్టినింట పిదప మెట్టినింట
    పురుడు బోసి కొనును మొదట పుట్టింటనే
    పుట్టినిల్లె తనకు చుట్టరికము

    రిప్లయితొలగించండి
  6. పుట్టింటి వారి పిలుపును
    పట్టించు కొనక వెడలిన పార్వతి వలెనే
    పుట్టెడు యవమానము లనుచే
    పట్టగ వలయు ననుట పాడియె ధరలో !

    రిప్లయితొలగించండి


  7. ఊరి దాపుకు జేర యురక లెత్తును మది!
    ...............బడి భవనమ్ములు పలకరించు!
    చెరువుగట్టును జూడ చిత్తమ్ము పొంగును!
    ..............గ్రామ దేవత గుడి క్షేమ మడుగు!
    సంతపాకలు గన సంతసమ్మొదవును
    ..............చావడి, కూడలి రావె యనును!
    పలకరింపు కుశల ప్రశ్నల తాకిడి
    .............ముసురుకొనగ నెంతొ మురియు మనసు!

    వీధి లోకి నేగ వేడుక ముంచెత్తు
    అల్లది గదె పుట్టి నిల్లు తనది
    బండి యాగి నంత వాకిట ముంగిట
    చెంగున దిగె నమ్మ చేటి గనుడు!


    చిట్టి తల్లీ రావె చిక్కిపోయే వేమి?
    ..............కన్నతల్లి పలుకు కడుపు నింపు!
    అమ్మలూ వచ్చేవ అల్లుడు కుశలమా?
    ..............నాన్న పలకరింపు వెన్న పూస!
    నను మరచే వేమొ నాకేమి తెచ్చేవు?
    .............తమ్ముడు గారాబు కమ్మదనము!
    ముందు దిష్టిని తియ్యి మురిపాలు తర్వాత!
    ............నాయనమ్మ సలహా హాయి నిచ్చు!

    తాత బోసినవ్వు! తలలూచు పొరుగులు!
    పుట్టినిల్లు వనిత పుణ్య భూమి!
    భర్త ప్రేమ తోడ పట్టమ్ము గట్టినన్
    దాని సాటి గలదె ధరణి లోన?

    ఇంటి ముంగిటిలోన యెప్పుడో పెట్టిన
    ..............పడి మీది ముగ్గులు పలకరించు!
    పెళ్లి ముందటి దాక పెరటిలో పెంచిన
    ..............గుబురు మల్లెల పొద కుశల మడుగు!
    బావియొద్దకు జేరి బాల్చితో తోడిన
    .............చల్లని నీరాన యుల్ల మలరు!
    వేప వృక్షము క్రింద చాపపై పడుకొని
    .............కూని రాగము తీయ కోర్కె గలుగు!

    నాటి జ్ఞాపకాల నవ్యానుభూతులు
    తడుము నెదను వెన్ను తట్టు నెపుడు!
    మెట్టి నిల్లు యెంత మిన్నదైనను గాని
    నాతి పుట్టినిల్లు నాకమె యగు!

    రిప్లయితొలగించండి
  8. మిస్సన్నగారూ మీకు అభినందనలు.
    పుట్టినింటి తీయని అనుభూతుల్ని కళ్ళకు కట్టినట్లు వ్రాసి తెలుగింటి ఆడపడచుల మనసుల్ని తట్టారు.

    రిప్లయితొలగించండి
  9. పుట్టినిల్లు అనగానే తాదాత్మ్యం చెంది లక్ష్మీదేవి గారో, రాజేశ్వరి అక్కయ్యో రెచ్చిపోయి పద్యాలు వ్రాస్తారని ఆశించాను. కానీ చిత్రంగా మిస్సన్న గారు కళ్ళకు కట్టినట్టి పుట్టినింటి స్మృతులనూ, మాధుర్యాన్నీ అద్భుతంగా పద్యరూపంలో సాక్షాత్కరింపజేసారు. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారు కూడా తక్కువ తినలేదు. వీరంతా తమ అర్ధాంగుల పుట్టింటిపై మమతను సహృదయంతో అవగాహన చేసుకున్నారనుకుంటాను. సంతోషం.
    చక్కని పద్యాలను అందించిన....
    లక్ష్మీదేవి గారికి,
    సుబ్బారావు గారికి,
    సహదేవుడు గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    మిస్సన్న గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. పుట్టింటి ప్రేమ విలువలు
    మెట్టింటికి వెడలు యింతి మేదిని యెరుగున్
    పుట్టింట నుండు 'వాడిది '
    పట్టించుకు మెలగవలయు భార్యకు హితుడై.

    రిప్లయితొలగించండి
  11. గురువుగారూ ధన్యవాదాలు.
    సహదేవుడుగారూ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి