2, ఏప్రిల్ 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1012 (కలకాలము బ్రతుకువాఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కలకాలము బ్రతుకువాఁడు కామాతురుఁడే.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:


 1. నా ఎరుకల యవ కాలమున
  నిదుర పోయి, తేలి పోవు
  గాలికల లో విహరించి 'కల '
  కాలము బతుకువాడు కామాతురుడే !


  చీర్స్
  జిలేబి.

  రిప్లయితొలగించండి
 2. ఇల కామములను వీడక
  బలమాయువు నీయ మనుచు భగవంతునితో
  పలుమార్లు వేడి కాకిగ
  కలకాలము బతుకువాడు కామాతురుడే


  రిప్లయితొలగించండి
 3. శాస్త్రిగారు! కలికాలపు కాముక కాకుల రీతి చాల బాగ చెప్పినారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి


 4. తలపండిన దినములలో
  వలపుల దా తివిరి, తివిరె ! ప్రభువై యుండిన్
  పలువనితల పెనుతలపుల
  కలకాలము బ్రతుకువాఁడు కామాతురుఁడే !

  ( అందుకే ఆయన్ని తివారి అన్నారు )

  రిప్లయితొలగించండి
 5. ఇల కామమె కారణమగు
  పలు జన్మమ్ములకు కామ వర్జన సుఖమౌ
  తలపక భవ లక్ష్యంబును
  కల కాలము బ్రతుకు వాడు కామాతురుడే

  రిప్లయితొలగించండి
 6. కలియుగ మందున కాముని
  దలపున నున్నట్టి వాం ఛ తలపున నే యౌన్
  వలపులు దీ రున దనుకను
  కలకాలము బ్రదుకు వాడు , కామాతురుడే

  రిప్లయితొలగించండి
 7. వలదంచు వావి వరుసలు
  తలచిన ప్రతి నారి తోడి దాహముఁదీరన్
  కులుకగ, లోకుల నాల్కల
  కలకాలము బ్రతుకు వాడు కామాతురుడే!

  రిప్లయితొలగించండి
 8. కలలోనైనను దేవుని
  దలపక యిల్లాలు, సుతులు, తనవారనుచున్
  పలుతెరగుల స్వార్థంబున
  కలకాలము బ్రతుకువాడు కామాతురుడే.

  రిప్లయితొలగించండి
 9. పండిత శ్రీనేమాని గురువులకు నమస్సులతో

  కలియుగ మందున చెలియల
  వలపుల దగులం బడచుచు వారి దలచుచున్
  తలపుల వలలను చిక్కుచు
  కలకాలము బ్రతుకువాఁడు కామాతురుఁడే.

  రిప్లయితొలగించండి
 10. ఫలమేమి జన్మమెత్తియు
  తలువుమనంతు మరు జన్మ తప్పక దొలుగున్
  దెలియక సంభవ హేతువు
  కలకాలము బ్రతుకు వాడు కామాతురుడే.

  రిప్లయితొలగించండి
 11. పండిత శ్రీనేమాని గురువులకు నమస్సులతో
  తలబోడి యగుచున్నను
  తలపుల బోడా యనుచును తరుణుల తిరుగన్
  కులకాంతను కాదనుచును
  కలకాలము బ్రతుకువాఁడు కామాతురుఁడే.

  రిప్లయితొలగించండి
 12. చలియించెడు మనమందున
  తలయెత్తు వివిధ రకముల తామస వాంఛల్
  పలు తెరగుల తీర్చుకొనుచు
  కలకాలము బ్రతుకువాఁడు కామాతురుఁడే.

  రిప్లయితొలగించండి
 13. వలవేసి పట్టి వనితల
  విల విల బాధించి మదిని వేడుక నొందన్ !
  కలకలమును సృష్టిం చుచు
  కలకాలము బ్రతుకు వాఁ డు కామాతురుఁ డే !

  రిప్లయితొలగించండి
 14. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ పండిత నేమాని గురువర్యులకు పాదాభివందనములతో
  =======*============
  విలువల వలువలు వీడిన
  ఖలులను కీర్తించు నరుడు,కర్షక జాతిన్
  కలుషిత కడలిని ముంచియె
  కలకాలము బతుకువాడు కామాతురుడే

  రిప్లయితొలగించండి
 15. తలుప నిది ధర్మ కామము
  జలజాక్షా! నీ పదమ్మె చాలు నితరముల్
  వలదని వేడుచు మాటికి
  కలకాలము బతుకువాడు కామాతురుడే!

  రిప్లయితొలగించండి
 16. అలనాటి యాంజనేయుడు
  నిల లోనే మసలునంట యినకుల స్వామిన్
  దలచిన దారస పడునట
  కలకాలము బ్రతుకు వాడు కామాతురుడే

  రిప్లయితొలగించండి
 17. తమ్ముడు చి. డా. నరసింహమూర్తి పద్యములో యడాగమమును తొలగించుచు, ఆ పద్యమును ఇలా ప్రారంభించుదాము:

  అలనాటి ఆంజనేయుం
  డిలలోనే....................
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 18. అన్నయ్య గారికి ప్రణామములు.ధన్యవాదములు. ఆంజనేయునికి యడాగమ మాపాదించడములో నెనూ యిబ్బంది పడ్డాను.

  అలనాటి ఆంజనేయుం
  డిల లోనే మసలునంట యినకుల స్వామిన్
  దలచిన దారస పడునట
  కలకాలము బ్రతుకు వాడు కామాతురుడే

  రిప్లయితొలగించండి
 19. కవిమిత్రులకు నమస్కృతులు.
  నిన్న హైదరాబాద్ వెళ్ళి వచ్చిన కారణంగా పూరణలను, పద్యాలను సమీక్షించే అవకాశం లేకపోయింది. మన్నించడి.
  మంచి మంచి పూరణల నందించిన....
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
  పండిత నేమాని వారికి,
  సుబ్బారావు గారికి,
  సహదేవుడు గారికి,
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
  గండూరి లక్ష్మినారాయణ గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  వరప్రసాద్ గారికి,
  మిస్సన్న గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 20. కలలో నిద్దుర లోనున్
  మెలకువ లోనున్న హరిని మెరిపించక కొం
  డలపై గుడిలో వెదకుచు
  కలకాలము బ్రతుకువాఁడు కామాతురుఁడే

  రిప్లయితొలగించండి
 21. కలలో మెలకువ లోనన్
  చలిలో వేడిమిని యందు చావున బ్రతుకున్
  పలు తెరగుల జీవులలో
  కలకాలము బ్రతుకువాఁడు కామాతురుఁడే

  రిప్లయితొలగించండి