13, ఏప్రిల్ 2013, శనివారం

సమస్యాపూరణం – 1022 (కరి చెర విడిపించుమని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కరి చెర విడిపించుమని మకరి వేడె హరిన్.
(వరంగల్ శతావధానములో డా. రాపోలు సత్యనారాయణ గారిచ్చిన సమస్య)

25 కామెంట్‌లు:

 1. ధర నింద్రియ లోలత్వము
  సరి సాటియె లేని యొక్క శత్రువు వోలెన్
  పరమునుఁ జేరగ విడువదు.

  సరియగు రీతి మకరిపయి సాధన సలుపన్
  కరి జీవుండై మోక్షపు
  వరమిమ్మని దేవుని యెడ భక్తినిలుప నా
  తురతను మకరియె బలమగు
  కరి చెర విడిపించుమని మకరి వేడె హరిన్.

  రిప్లయితొలగించండి
 2. చరణము తిన్నగ లేదిది
  “ కరి చెర విడిపించుమని మకరి వేడె హరిన్ "
  చరణమ్మిది సరిపోవు "మ
  కరి చెర విడిపించు మనుచు కరి వేడె హరిన్"

  రిప్లయితొలగించండి
 3. తరుణు డు గోరెను విష్ణుని
  కరి చెర విడిపించుమ ని, మకరి వేడె హరిన్
  నిరతము సేవలు జేయుదు
  హరియించుచు పాప చయము హర! యీ ముక్తిన్ .

  రిప్లయితొలగించండి
 4. వరమొసగుమోయి మీదగు
  చరణంబులయందు భక్తి సాఫల్యమగున్,
  నిరతము చాంచల్య మనో
  కరి చెర విడిపింపు మని మకరి వేడె హరిన్.

  కరి = కోతి
  చాంచల్య కరి = అనిశ్చితమైన మనస్సనే కోతి

  రిప్లయితొలగించండి
 5. నిరతము నీరము నందున
  పర జీవుల ప్రాణ హరణ పాపము తోడన్
  తిరిగెడు కాయమ్ము దురిత
  కరి, చెర విడిపింపుమని మకరి వేడె హరిన్!

  రిప్లయితొలగించండి
 6. మిత్రులారా!
  శుభాశీస్సులు.

  భాగవతములో కరికి మకరి వలన గలిగిన బాధను తొలగించెను శ్రీహరి. అటులనే సంసారమనే భయంకరమైన స్థితి నుండి విముక్తినొందినది మకరి. దానినే పద్య రూపములో:

  భరమైనది సంసారము
  దురితములకు వలయ మమిత దుఃఖ నిలయమీ
  ధరపై భవమనెడు భయం
  కరి చెర విడిపించుమని మకరి వేడె హరిన్

  రిప్లయితొలగించండి
 7. నరుడిల విషయపు వాసన
  చెరలోఁ జిక్కిన తదుపరి శీఘ్రగతి దా
  మొరలిడ వాగింద్రియమై
  "కరి చెర విడిపించు"మని మకరి వేడె హరిన్ .

  నా మొదటిపూరణలో చెప్పిన భావాన్ని స్పష్టంగా చెప్పలేదేమోనని మరొక ప్రయత్నం చేసినాను.
  ఇంద్రియముల నుంచి జీవుని కాపాడమని వేడునదీ ఇంద్రియములే, వాటిని జీవుడు సరియగు రీతిని అదుపు చేయగలిగినచో నని నా ఉద్దేశ్యము.

  రిప్లయితొలగించండి
 8. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి, పెద్దలకు
  ప్రణామములు!

  “కరుణింపు! నను మకరి” కని
  కఱివేలుపు గరగరికను గరి వేఁడు తఱిన్;
  గఱకఱి నఱిముఱి సిరి యు
  క్కరి, “చెఱ విడిపించు” మని మకరి వేఁడె హరిన్.

  మకరికిన్ = మొసలి బాఱినుండి; ననున్ = నన్ను; కరుణింపుము = దయతో కాపాడుము; అని = అని దీనముగ పలుకుచు; కరి = ఏనుగు; గరగరికన్ = నిర్మలచిత్తముతో; కఱివేలుపున్ = నల్లనైన వేల్పు శ్రీ మహావిష్ణువును; వేఁడు = ప్రార్థించునట్టి; తఱిన్ = ఆ సమయమందే; భక్తుడైన కరిరాజు యొక్క కఱకఱిన్ = బాధ చేతను; అఱిముఱిన్ = కలఁత చేతను; ఉక్కు+అరి = గుండె దిటవును కోల్పోయి; మకరి = మకరికాపత్త్రకర్ణాభరణమును ధరించినదైన; సిరి = లక్ష్మీదేవి; చెఱన్ = భవబంధము నుండి; విడిపించుమని = ముక్తిని ప్రసాదింపుమని; హరిన్ = సర్వ పాపములను హరించు శ్రీహరిని; వేఁడెన్ = సంప్రార్థించెను.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 9. జంతు ప్రదర్శన శాలలో నున్న మకరపు ప్రార్థన .

  తరిగెనుకొలనునజలములు,
  చురచురమను మండుటెండ,చోద్యంబాయెన్
  నరులకు, త్వరపడదటతొల
  కరి,చెరవిడిపించుమని మకరి వేడెహరిన్!!!

  రిప్లయితొలగించండి
 10. చరియించు ప్రాణులెన్నియొ
  మరణించగ నోట జిక్కి మకరికి మేతై
  నరకము బోవుచు యమ కిం
  కరి చెర విడిపించుమని మకరి వేడె హరిన్

  రిప్లయితొలగించండి
 11. హరిణికు డొక్కడు దా నొక
  పరి చెఱువున నక్ర మొకటి బట్ట కఱకఱిన్
  బొరలుచు “శీఘ్రము యీ కఱ
  కరి చెర విడిపించు" మనుచు మకరి వేడె హరిన్ !

  హరిణికుడు = కిరాతుడు ; కఱకఱి = బాధ ; కఱకరి = క్రూరుడు.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ మిస్సన్న గారూ!
  మీ ఉగాది పద్యములో
  "గొంతును సవరించె కోయిలమ్మ" అన్నారు. గండు కోయిల కూయును కాని ఆడకోయిల కూయదు. ఆలాగుననే మగ నెమిలి నృత్యము చేయును కానీ ఆడు నెమిలి (మయూరి) నృత్యము చేయదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 13. దురితములు చేసి యుంటిని
  శరణా గతి కోరుచుంటి సారంగము వలెన్ !
  యిరువురి పోరాట మందున
  కరి చెర విడి పించు మని మకరి వేడె హరిన్ !

  రిప్లయితొలగించండి
 14. శ్రీ గురువర్యులకు ప్రణామములు!

  కోయిల అన్ని కాలాలలోనూ కూస్తుండటం సహజమైనప్ప్టటికీ ఒక్క వసంత కాలంలో మాత్రమే కూయటం మొదలుపెట్టినట్లు వర్ణించటం కవిసమయం. ఆలాగే, లోకవిరుద్ధమైనప్పటికీ పుంస్కోకిల కూజితంతోపాటు కోయిలమ్మ పాడినట్లే కవులందరూ వర్ణించారు.

  “భారతీయుల కళాప్రాభవమ్మొలికించి
  తీయగా పాడిన కోయిలమ్మ”

  – ఘంటసాల వారు సరోజినీదేవి గారిపై గానంచేసిన పద్యం.

  “బాలపల్లవగ్రాసకషాయకంఠ కలకంఠవధూ కలకాకలీధ్వనిన్” – నంది తిమ్మన.

  అలాగే, లోకవిరుద్ధమైనప్పటికీ ఆడునెమలి నృత్యాన్ని వర్ణించటం కూడా కవిసమయమే. శ్రీనాథుడు, కృష్ణదేవరాయలు మొదలుగా కవులందరూ ప్రయోగించినదే.

  “ఆడవే మయూరీ, నటనమాడవే మయూరీ” చెల్లెలి కాపురం చిత్రంలో డా. సి. నారాయణరెడ్డి గారు.

  లోకవిరుద్ధాలు కాబట్టే కవిసమయాలు ప్రాజ్ఞప్రతిజ్ఞాతాలు కాగలిగాయి. అందుకే ఆలంకారికులు “యథాస్మై రోచతే విశ్వమ్ తథేదం పరివర్తతే” అని అన్నారు.

  మనవి మాటలుగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 15. chEraga nI sannidhi nika
  mari thOchiye chEsinAda yapachAramu, nA
  shiramunu khandinchi vEga
  kari chera vidipinchumani makari vEde harin! ...rApOlu satyanArAyana

  రిప్లయితొలగించండి
 16. రాపోలు సత్యనారాయణ గారి పూరణ....

  చేరగ నీ సన్నిధి నిక
  మరి తోచియె చేసినాడ యపచారము, నా
  శిరమును ఖండించి వేగ
  కరి చెర విడిపించుమని మకరి వేడె హరిన్!

  రిప్లయితొలగించండి
 17. లక్ష్మీదేవి గారూ,
  రెండు పద్యాలతో ఒక పూరణ. బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మీ ద్వితీయ ప్రయత్నంలో సాఫల్యం చెందారని విశ్వసిస్తున్నాను.
  ‘శీఘ్రగతి దా’ అన్నచో గణదోషం. ‘శీఘ్రగతిని దా’ అన్నదానికి టైపాటా?
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణలోని చమత్కారం ప్రశంసనీయం. బాగుంది. అభినందనలు.
  మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘మనోకరి’ అనరాదు. ‘మనఃకరి’ అనడం సరి.
  *
  సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  ఏల్చూరి మురళీధర రావు గారూ,
  అద్భుతంగా ఉంది మీ పూరణ. వ్యాఖ్యానాన్ని జోడించినందుకు ధన్యవాదాలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ తొలకరి జల్లువలె ఆహ్లాదాన్నిచ్చింది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం.
  రెండవ పాదం చివర గణదోషం. ‘సారంగముగా’ అందాము.
  మూడవ పాదాదిని యడాగమం అవసరం లేదు. వాక్యప్రారంభం కనుక అచ్చుతోనే మొదలు పెట్టండి.
  మూడవ పాదం చివర గణదోషం. ‘పోరాటములో’ అనండి.
  *
  రాపోలు సత్యనారాయణ గారూ,
  ‘శంకరాభరణం’ బ్లాగు మీకు సంతోషంగా స్వాగతం పలుకుతున్నది.
  మీ ప్రయత్నం ప్రశంసింపదగింది. కాని కొన్ని లోపాలు....
  మొదటి పాదాన్ని గురువుతో ప్రారంభించారు. కందంలో మొదటి పాదాన్ని గురులఘువులలో దేనితో ప్రారంభిస్తామో మిగిలిన పాదాలనూ దానితోనే ప్రారంభించాలి కదా!
  రెండవ పాదంలో యతి తప్పింది.
  మూడవ పాదం చివర ‘చి వేగ’ అని జగణం వేసారు. ఆ పాదంలో బేసిగణంగా జగణం ఉండరాదు కదా!
  మీ పూరణను ఇలా సవరించాను....
  దరి జేరగ నీ సన్నిధి
  మరి తోచియె చేసినాడ మానక దొసగుల్
  శిరమును ఖండించియు నీ
  కరి చెర విడిపించుమని మకరి వేడె హరిన్!

  రిప్లయితొలగించండి
 18. చెరువు ఒడ్డుకు వచ్చిన ఒక మొసలిని ఒక యేనుగు తొండముతో బట్టి కాలితో త్రొక్కువేళ మకరి ప్రార్థన.

  కరి నాయుగమున బట్టెను
  మరినా వంశంబు వాడు మది నది తలచెన్
  మరి బైట బట్టె నిత్తరి
  కరి చెర విడిపించుమని మకరి వేడె హరిన్ !

  రిప్లయితొలగించండి
 19. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 21. గురువుగారూ, ధన్యవాదాలండి.
  అవును, అది టైపాటే.
  ఏల్చూరి వారి పూరణ పోతన గారి పద్యము "అడిగెదనని వడివడి జని" వలె ఎంతో బాగుంది.

  రిప్లయితొలగించండి
 22. హరి హరి! చీనులు నేడు మ
  కరి మాంసము తిన మరుగగ కష్టమ్మాయెన్
  పరుగిడి రారా! యీ ము
  ష్కరి చెర విడిపించుమని మకరి వేడె హరిన్

  రిప్లయితొలగించండి
 23. తరమిక కాదుర నావల
  పెరిగెను నాదౌ బడలిక పేరిమి క్రుంగెన్
  కరి కాలు మూసె గొంతును
  కరి చెర విడిపించుమని మకరి వేడె హరిన్

  (మకరి ప్రార్థన:
  "లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్
  ఠావుల్ దప్పెను మూర్చ వచ్చెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
  నీవే తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్
  రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా!")

  రిప్లయితొలగించండి