27, ఏప్రిల్ 2013, శనివారం

పద్య రచన - 324 (భుక్తి - ముక్తి)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“భుక్తి - ముక్తి”

5 కామెంట్‌లు:

  1. హనుమజ్జయంతి రోజున
    హనుమను బూ జించు నెడల హనుమయె యిచ్చున్
    అనిశము భుక్తియు ముక్తిని
    మననము నే జేయు మయ్య ! మంత్రము నెపుడున్ .

    రిప్లయితొలగించండి
  2. భుక్తికి పాటులఁ బడుచును
    ముక్తిని మరచితిని స్వామి, మోక్షమ్మొసగే
    శక్తియు గలవాడివయితి
    యుక్తినిఁ జెప్పగలవీవె యుద్ధరణకునై.

    రిప్లయితొలగించండి
  3. భుక్తి ప్రసాదించి ఆగొన్న వారిని ఆదరించిన
    ముక్తి యదియె కాదె ఉత్తమము,జనులెల్ల తా
    శక్తికి తోచిన విధమున ఆర్తులనాదరించిన
    భక్తి యదియె కాదె సర్వోత్తమమ,సత్కార్యమున్

    రిప్లయితొలగించండి
  4. భుక్తి గడువ వలయు భువిలోన నరు నకు
    ముక్తి గోర వలయు ముదిమి నాడు
    భుక్తి ముక్తి నడుమ భక్తియే యున్నచో
    నదియె జీవనంపు నదిని మించు.

    రిప్లయితొలగించండి
  5. వ్యాసు డరుదెంచి మరచెను కాశి యందు
    శివుని యభిమత మెన్నుట చేత గాక
    భుక్తి లేదని శపియించ ముక్తి మరచి
    అన్న పూర్ణయ వడ్డించె నభయ మిచ్చి !

    రిప్లయితొలగించండి