26, ఏప్రిల్ 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1035 (కలువలు వికసించెను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కలువలు వికసించెను దినకరుఁ డుదయించన్.

19 కామెంట్‌లు:

 1. నెలవంకను జూ డం గనె
  కలువలు వికసించెను , దినకరు డుద యించన్
  వెలుతురు నిండెను జగమున
  మెలమెల్లగ మేలుకొనిరి మేదిని జనముల్ .

  రిప్లయితొలగించండి
 2. తలపై శంకరు డొప్పుగ
  నెలవంకను దాల్చు దానినే గనుచున్ భ
  క్తుల కన్నులనెడి సొగసగు
  కలువలు వికసించెను, దినకరు డుదయించన్

  రిప్లయితొలగించండి
 3. మిలమిలలాడెడు రుచులన్
  కలువలు వికసించెను, దినకరుఁ డుదయించన్
  వెలవెలబోయిన ప్రభలన్
  కలిమినిఁ గోల్పోయి నిల్చె కాలగతమునన్.

  రుచి = కాంతి

  రిప్లయితొలగించండి
 4. చెలికానిఁ దలచి కనులను
  కలువలు వికసించెను దినకరుడుదయించన్
  కలువగ పరుగున దానే
  చెలికాడరుదెంచుననుచు సిగ్గులమొగ్గై..

  రిప్లయితొలగించండి
 5. కలువల రాయుని దివి గని
  కలువలు వికసించెను, దినకరుడు దయించన్
  నలువొందె సుప్రభాతము
  కిలకిల రావముల చేత క్షితి శోభిల్లెన్.

  రిప్లయితొలగించండి
 6. చలువల యెకిమీ డేగెను,
  కలువలు ముకుళించె, తారకలు చనె, గుడి గం-
  టలు మ్రోగె, సజ్జనుల కను-
  గలువలు వికసించెను దినకరు డుదయించన్

  రిప్లయితొలగించండి
 7. కలయో శంభుని మాయో
  కలవరమో కనులముందు కనిపించిన యా
  జలధరునేత్రధ్వయమున
  కలువలు వికసించెను దినకరుడుదయించన్!!!

  రిప్లయితొలగించండి
 8. - గణన యంత్రమాయజాలపు దృష్టిలో.

  కలనైనం గన రానివి
  యలవోకగ యంత్రమందు నమరుట కనమే?
  తలపగనటులీ యుగమున
  కలువలు వికసించెను దినకరు డుదయించన్  రిప్లయితొలగించండి
 9. తెలవారగ నొచ్చెదనని
  వలచిన యువరాజు నుడువ వధువై నిలువన్
  కలగను నెలతకు కన్నుల
  కలువలు వికసించెను దినకరు డుదయించన్!

  రిప్లయితొలగించండి
 10. చెలి విరహ తాప మందున
  పలుమారులు తొంగి జూచె పరి పరి విధముల్ !
  కల హంస పలుక రించగ
  కలువలు వికసించెను దినకరుఁ డుదయించెన్ !

  రిప్లయితొలగించండి
 11. వెలది యొకతి పవళించెను
  వెలుపలి భాగమున రాత్రి, వేకువ వేళన్
  మెలకువను పొందగ కనుల
  కలువలు వికసించెను దినకరుఁ డుదయించన్!!

  రిప్లయితొలగించండి
 12. చెలి కన్ను లలసి పోయెను
  కలలందున తేలిసోలి కలవర పడుచున్ !
  నెలరాజు పరవ శించగ
  కలువలు వికసించెను దినకరుఁ డుదయించెన్ !

  రిప్లయితొలగించండి
 13. చెలియా! చూడుము కొలనున
  కలువలు వికసించెను;...దినకరుఁ డుదయించన్
  తలుపులు మూయుము త్వరపడి
  పలువురు నా మెడ గ్రహించి బాదక ముందున్

  రిప్లయితొలగించండి