18, ఏప్రిల్ 2013, గురువారం

పద్య రచన - 315 (తెలుగువారి వారసత్వము)

కవిమిత్రులారా,
నేడు ప్రపంచ వారసత్వ దినము.
నేటి పద్యరచనకు అంశము...
“తెలుగువారి వారసత్వము”

10 కామెంట్‌లు:

  1. డా. రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ అవార్డు వచ్చినట్లు ఇప్పుడే వార్త చదివి చాలా ఆనందించాను. జై తెలుగు తల్లీ!

    రిప్లయితొలగించండి
  2. చంద్ర శేఖర్ గారూ ! ఈ మధ్య తరగతులకు శెలవు పెడుతున్నారు.. రోజూ యేదో ఒకటి శెలవివ్వండీ....

    రిప్లయితొలగించండి
  3. శ్రీ శంకరయ్య మాస్టారు రెండో క్లాసునుంచి డిమోట్ చేసి ఒకటో క్లాసులో పడేశారు. మరలా ఓనమాలు దిద్దుకొని రమ్మన్నారు:-) అభ్యాసం చేస్తున్నాను శాస్త్రిగారూ!

    రిప్లయితొలగించండి
  4. జ్ఞాన పీఠాన్ని అధిరోహించిన శ్రీ రావూరి భరద్వాజ గారికి అబినందనలు.

    విశ్వనాథ కల్ప వృక్షమ్ము నందించి
    విన సినారె చూపి విశ్వ భరము
    భరత వ్యాసు (భరత వాసు) డేమొ పాకుడు రాళ్ళను
    జాగ్రతనుచు జెప్పి జ్ఞాన పీఠ

    మందె జయము జయము లందజేయుచు నీవు
    భరత భూమిలోన బాధ్యతెరిగి
    వారి సత్వమెరిగి వారసత్వముబొంది
    ' తెలుగు ' వెలుగ జేయి తెలుగు వాడ.

    రిప్లయితొలగించండి
  5. తెలుగు భాషకు మఱియును దెలుగు ప్రజల
    వారసత్వపు మనిషి గా వాసి కెక్కి
    జ్ఞాన పీ ఠ ము నొందిన జ్ఞాన మూ ర్తి !
    అందు కొనుమయ్య ! రావూరి ! వంద నములు .

    రిప్లయితొలగించండి
  6. జ్ఞాన పీఠ మందు ఘనులకు నెలవయ్యు
    సాంప్ర దాయ మదియు సాగుచుండ
    రాజ గౌర వమ్ము రావూరి యందగ
    తెలుగు వారసత్వ తేజ మలరె!

    రిప్లయితొలగించండి




  7. తెలుగు వారిది బహుకాల దీర్ఘమైన
    వారసత్వమ్ము ద్విసహస్ర వర్షములను
    సర్వకళల నారియు దేరి చరితకెక్కి
    ఘనతజెందిన దానిని గాచుకొనుడి.

    రిప్లయితొలగించండి
  8. రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠపు బహుమతి వచ్చినందువల్ల ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ తెలుగు వెలిగింది.
    వారికి , మనందరికీ ఇది శుభవేళ.

    తెలుగు రచనలయందున్న తేనె దాచి
    దాచి వారసులకునిచ్చు ధర్మమెఱిగి
    మెలగుటయె శుభమునుఁ గూర్చు మిత్రులార!
    గొప్ప వారసత్వము వారి కొసగ దగును.

    రిప్లయితొలగించండి
  9. తెలుగు వెలుగులు విరజిమ్ము దేశ మంత
    పూజ్య గురువులు నెలకొన్న పుణ్య భూమి.
    వరము లొందిన మును లంత వార సులుగ
    తెలుగు కవనము లలరించు తేజ మలర

    రిప్లయితొలగించండి
  10. చంద్రశేఖర్ గారూ,
    నాకు ప్రమోషన్ ఇవ్వడమే కాని, డిమోట్ చెయ్యడం అలవాటు లేదు.
    *
    జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకొని తెలుగు తేజాన్ని దశదిశలా ప్రసరింపజేసిన రావూరి భరద్వాజ గారిని అభినందించిన మిత్రులకు ధన్యవాదాలు.
    *
    మన వారసత్వంపై చక్కని పద్యాలను అందించిన కవిమిత్రులు...
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    సహదేవుడు గారికి,
    కమనీయం గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    సాహిత్యాభిమాని గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి