16, ఏప్రిల్ 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1025 (సంసారము దుర్భరమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సంసారము దుర్భరమ్ము సత్పురుషులకున్.

24 కామెంట్‌లు:

 1. దుఃఖ నిలయమ్ము విపరీత దురితమయము
  దుస్తరమ్ము సంసారము దుర్భరమ్ము
  సత్పురుషులకున్ నిరత ప్రశాంతి సౌఖ్య
  కరమయిన మోక్షధామమే గమ్యమగును

  రిప్లయితొలగించండి
 2. హింసను ప్రేరేపించెడి
  సంసారము గూల్చు నట్టి సారా నే వి
  ధ్వంసము చేయక చేయు ర
  సం, సారము దుర్భరమ్ము సత్పురషులకున్.

  రిప్లయితొలగించండి
 3. సంసర్గ మాలు బిడ్డల
  సంసారము నడుపు టన్న జటిలము గాదే !
  సంసిద్ది గోరు వానికి
  సంసారము దుర్భరమగు సత్పురుషునకున్

  రిప్లయితొలగించండి
 4. కలరనేకులు మహాకావ్య నిర్మాతలు
  ....బ్లాగు మా శంకరాభరణమందు
  కలరనేకులు రసజ్ఞప్రభా భాసురుల్
  ....బ్లాగు మా శంకరాభరణమందు
  కలరనేకులు చిత్ర కల్పనా చతురులు
  ....బ్లాగు మా శంకరాభరణమందు
  కలరనేకులు భావ గాంభీర్యశాలురు
  ....బ్లాగు మా శంకరాభరణమందు
  సభ్య బృందమునకు మహాసారథి యయి
  సద్గతుల జేర్చు శ్రీ కంది శంకరయ్య
  సభ్య బృందమునకు ప్రశంసలను గూర్తు
  ఆదరమ్మున శంకరు నభినుతింతు

  రిప్లయితొలగించండి
 5. కుచేలుని భార్య కుచేలుడిని తమ దారిద్ర్య నివారణకు కృష్ణుని ఆశ్రయించమని చెప్పిన పలుకులు.

  సంసారిని సంతతితో
  హింసించెడి పేదరికము హితుడే బాపున్
  కంసారిని వేడనిచో
  సంసారము దుర్భరమ్ము సత్పురషులకున్.

  రిప్లయితొలగించండి
 6. సంసార సాగ రంబును
  కంసారికి గష్ట మయ్యె గడపగ నపుడున్
  హింసలు జరుగుట గతన న
  సంసారము దుర్భరమ్ము సత్పురు షులకున్ .

  రిప్లయితొలగించండి
 7. సంసారము సాగరమను
  శంసయు వినియుండ లేదొ? శంభో! కృపతో
  ధ్వంసము చేయుము మోహము,
  సంసారము దుర్భరమ్ము సత్పురుషులకున్.


  రిప్లయితొలగించండి
 8. కంసాదుల తలదన్నుచు
  హింసా మార్గమున నడుచు హీనుల వలనన్
  ధ్వంసంబగుధర్మమిలను
  సంసారముదుర్భరమ్ము సత్పురషులకున్!!!

  రిప్లయితొలగించండి
 9. శ్రీ మతి లక్ష్మీదేవి గారికి
  నమస్కారం!

  దయతో నిన్న మీరు చేసిన సూచనకు ఒకపాటి సమాధానం:

  1) “మాపితాయాః సువిదితాయాః మాతామహ్యాః మహతి పితరి” అనే అర్థంలో “మాపితామహుని = తనయొక్క తండ్రిగారి క్షేమార్థం మాతామహి పరమేశ్వరుని నిన్ను పూజిస్తే మేలు” అని చెప్పనా? - అని;

  2) మా = లక్ష్మీదేవి బ్రహ్మమానసపుత్త్రుడైన భృగుమహర్షి ధర్మపత్ని ఖ్యాతికి జన్మించి శ్రీ మహావిష్ణుస్వరూపుడైన సూర్యనారాయణుని పెండ్లాడింది కాబట్టి “మా” యొక్క పితామహుడు బ్రహ్మ. ప్రసూతి, దక్షప్రజాపతి ఖ్యాతియొక్క తల్లిదండ్రులు కనుక “మా” యొక్క మాతామహి ప్రసూతి. ప్రసూతి పుత్త్రసంతానార్థం పరమేశ్వరుడైన బ్రహ్మను (పరమేష్ఠిని దత్ప్రణతా, మరు – అంటే ఇంకా సులువు) పూజించింది కాబట్టి పద్యం ఉన్నదున్నట్లు అన్వయిస్తుంది అని చెప్పనా? - అని;

  3) లేదా, మా (లక్ష్మీదేవి యొక్క) పితామహుని, పరమేశ్వరుని, ప్రణతామరుని బ్రహ్మను బ్రహ్మాయువు కోసం మాతామహి పూజించటం మేలు అని చెప్పనా? – అని;

  4) “వరమొసఁగెడి దేవరవని, యొరిగ లొసగి తదపితామహుని సేమముకై, పరమేశ్వరుఁ దత్ప్రణతా, మరు నిన్ బూజింప మేలు మాతామహికిన్.” అని దిద్దితే పద్యం (తత్ + ఆపితామహుని, పరమేశ్వరుని, ప్రణతామరుని) విఘ్నేశ్వరునికి అన్వయిస్తుంది. (“మాతామహమహాశైలం మహ స్త దపితామహమ్, జగతః కారణం వన్దే కణ్ఠాదుపరి వారణమ్.”) అని చెప్పనా? – అని;

  5) ఇవి నాలుగూ కాక, జీవించి ఉన్న మా పితామహుని క్షేమస్థేమార్థం మాతామహి పూజిస్తే అదేమన్నా తప్పవుతుందా? అని
  ఆలోచించాను.

  ఇవి అయిదూ కేవలం సమర్థనలు మాత్రమే అవుతాయి కాబట్టి పద్యాన్ని

  “వరమొసఁగెడి దేవరవని
  యొరిగల ననుగతమహామహుని సేమముకై
  పరమేశ్వరుఁ దత్ప్రణతా
  మరునిం బూజింప మేలు మాతామహికిన్.”

  అనుగత మహామహుని = యజ్ఞస్వరూపుని అని, తనను సేవించిన యజ్ఞము కలవానిని = శివుని అని (ఒకప్పుడు యజ్ఞం మృగరూపాన్ని ధరించి పాఱిపోగా వెన్నంటి తెచ్చినవాడు – “మృగానుసారిణం సాక్షాత్ పశ్యామీవ పినాకినమ్” అభిజ్ఞాన శాకుంతలం) అని సవరించుకొన్నాను. మహము = యజ్ఞము.

  ఈ సుదీర్ఘలేఖకు క్షమార్పణలు; మీ సూచనకు నా ధన్యవాదాలు.

  సవినయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 10. అయ్యా,
  మన్నించగలరు. మీరు తెలియక వ్రాసి ఉంటారని నేనేమాత్రం అనుకోలేదు. కానీ అంతరార్థం మాకూ తెలియదు. ఒకవేళ చిన్న పొరబాటేమైనా జరిగి ఉండవచ్చని చెప్పినాను. కాకున్నా ఏమైనా గొప్ప అర్థం ఉంటే తెలుస్తుందనీ ఆశించినాను. మన్నించమని మరియొకమారు ప్రార్థిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 11. మరొక ప్రయత్నము:
  మధుర కందము:

  హంసోహము ధ్యానమూని యచ్చపు మదిలో
  హింసాదుల వీడి లెస్స యీశు గొలుచుచో
  సంసిద్ధి లభించు నట్టి సాధన సుఖమౌ
  సంసారము దుర్భరమ్ము సత్పురుషులకున్

  రిప్లయితొలగించండి
 12. శుకుడు తండ్రి వ్యాసునితో

  కంసారిని స్మరియించుచు
  సంసిద్ధిని పొందువాడ క్షమియింపు మయా!
  హింసానురాగ బద్ధము
  సంసారము దుర్భరమ్ము సత్పురుషులకున్

  రిప్లయితొలగించండి
 13. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
  ప్రణామములు!

  శంసితశీల; యుభయకుల
  సంసేవానిరత; పుణ్యసంతతిజని; ప్రా
  క్సంసృతిసహచరి లేకయు
  సంసారము దుర్భరమ్ము సత్పురుషులకున్.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 14. హింసోఘ్ర వాదు లిలపై
  హింసే మా వృత్తి యనుచు హీనత్వముతో
  ధ్వంసము కొనసాగించిన
  సంసారము దుర్భరమ్ము సత్పురుషులకున్

  రిప్లయితొలగించండి
 15. హింసలు నిండిన జగతిని
  సంసారము దుర్బ రమ్ము సత్పురుషుల కున్ !
  కంసారిని వేడెద నని
  సంసారము వీడి మారె సన్యాసిగనే !

  రిప్లయితొలగించండి
 16. సంసారమ్మును నశ్వర
  సంసర్గమనుచును ముక్తి సాధన పరులై
  సంసిద్ధిని కోరిన యెడ
  సంసారము దుర్భరమ్ము సత్పురుషులకున్.

  రిప్లయితొలగించండి
 17. శ్రీ కంది శంకరయ్య పండితారాధ్యులు, శంకరాభరణ సమస్యా పూరణ బ్లాగ్ రూపకర్తగారు సుమారు మూడు సంత్సరాలనుండి
  దిగ్విజయంగా నడిపిస్తూ ఎందరో కవుల కలములకు పదునుపెట్టించిన మహోన్నతులకు హృదయపూర్వక అక్షర కనుక .

  " చేకొని యక్షర సేధ్యము
  మా కందించితివి పద్య మాధుర్యంబుల్
  నీకే తగు నీ కార్యము
  మా కంటికి వెలుగువీవె మహిత కవీంద్రా!

  పద్య సేధ్యములో నున్న పలురకాల
  కలుపు మొక్కల నేరేసి క్రమము తెలిపి
  మార్గ దర్శన మొనరించు మాకు గొప్ప
  గురు సమానులు సౌరభ విరులు మీరు.

  బాధలె న్నున్న భాషకై పాటు పడుచు
  శంకరా భరణమ్మును శ్రద్ధ తోడ
  నలుపెరుంగక నడిపినావయ్య మీకు
  శత నమస్సులు శ్రీ కంది శంక రార్య!

  రిప్లయితొలగించండి
 18. పండిత నేమాని వారూ,
  కందపాదాన్ని తేటగీతిలో ఇమిడ్చిన మొదటి పూరణ, మధురకందంలో రెండవ పూరణ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
  ‘శంకరాభరణ’ సభ్యబృందాన్ని ప్రశంసించిన మీ పద్యానికి ధన్యవాదాలు. అందుకు వారందరూ సంపూర్ణార్హత కలవారే.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం.
  కాని ‘రసం’ అని వ్యావహారిక పదప్రయోగం చేసారు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గన్నవరపు నరసింహమూర్తి గారూ,
  ‘కార్యకారణసంబంధాన్ని’ వివరిస్తున్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  ఏల్చూరి మురళీధర రావు గారూ,
  నిన్నటి పూరణను సమర్థించుకొనడానికి నాలుగు అవకాశాలున్నా లక్ష్మీదేవి గారి అభిప్రాయాన్ని మన్నించిన మీ సంస్కారహృదయానికి నమోవాకాలు. నిజమైన ‘వాగ్భూషణం’ కలవారు మీరు.
  ఇక మీ నేటి సమస్యకు పూరణ...
  సహచరి లేని సంసారం దుర్భరమే.. అయితే ఆమెకు ఎటువంటి గుణాలుండాలో చక్కగా నిరూపించారు మీ పూరణలో. బాగుంది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  చక్కని పూరణ నందించారు. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  అయితే మీరు ‘ప్రపంచం’ అనే అర్థంలో సంసార శబ్దాన్ని గ్రహించినట్టున్నారు. కేవలం హిందీలో మాత్రమే ‘సంసార్’ శబ్దానికి లోకం, ప్రపంచం అనే అర్థాలున్నాయి. తెలుగులో కుటుంబం, పుట్టుక అని మాత్రమే అర్థాలున్నాయి.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 20. గురువుగారు చెప్పింది అక్షర సత్యం.
  డా. ఏల్చూరి మురళీధర రావు గారికి వాగ్భూషణమే భూషణం.

  రిప్లయితొలగించండి
 21. హింసించకు నన్ననియెను
  కంసలి మిత్రుడు వణకుచు గణపతి వ్రతమున్
  "మాంసము మత్స్యము కరవగు
  సంసారము దుర్భరమ్ము సత్పురుషులకున్"

  రిప్లయితొలగించండి
 22. ధ్వంసము జేయుచు క్షుదనున్
  మాంసము మీనములు వండి మగనికి నిడకే
  హింసించు వంగ కోమలి
  సంసారము దుర్భరమ్ము సత్పురుషులకున్

  రిప్లయితొలగించండి