“రామపదాబ్జమే శరణందువురా?” అని రావణుఁడు, “రామపదాబ్జమే శరణందువురా?” అని మేఘనాదుఁడు [రావణస్య అపత్యం పుమాన్ రావణిః. తెలుగులో రావణుఁడు] దూతగా వచ్చిన హనుమంతుని గద్దించి అడిగారు.
ఆ మాటలకు, “ఓహో! రామునియొక్క పాదాబ్జమే శరణాగతి అని నమ్మి ఆ రాయని భక్తితో ప్రార్థించండి” అని అంటూ, రావణుండు = ఉచ్చైఃస్వరము కలవాఁడైన హనుమంతుఁడు “అహో = శోకమును [అహో (అవ్య.) శోకః – శబ్దార్థకల్పతరువు], రామ = ఉపశమింపఁజేయు శ్రీరామచంద్రునియొక్క, పద = చరణమనెడు, అబ్జమే = కల్పవృక్షము [అబ్జః కల్పతరౌ – శబ్దార్థకల్పతరువు] ఒక్కటే; శరణము = ఆశ్రయము” అని సమాధానం చెప్పాడు.
రాముని దూత వాయు సుతు రావణు సన్నిది జేరి "ధూర్త! శ్రీ రామ పదాబ్జమే శరణురా " యని పల్కెను , రావణుండహో ! రాముడు పిచ్చివానివలె రాత్రి బవల్ వనిలోన తిర్గుచున్ భూమిజ నెట్లు చేకొనును భూరి పరాక్రము నన్ను గెల్చియున్.
శ్రీ కామేశ్వర శర్మ గారికి నమస్సులు. అతడు, అతండు, ఆతడు, ఆతండు, అని కూడా అనవచ్చు. కానీ... మీరన్నట్టు ఇక్కడ ఆతనిన్ అన్నడే సరియైనదని నా భావన. అతను అన్నది ఏకవచనం, అగౌరవార్థంలో వినిపిస్తున్నది.. తమ్ముడు, పైగా కోపం. మీరన్న పదమే సమంజసం... ధన్యవాదాలు.
కామము రేగె నాకు పెను కారణమయ్యెను సీత దానికిన్ కోమలి రామ సక్కనిది కూరిమిఁ జూపినఁ జాలు నేడికన్ ధూమము లేని యగ్ని వలె తోచును తొయ్యలి చెన్నుఁ జూడనా రామ పదాబ్జమే శరణురా యని పల్కెను రావణుం డహో!!
సోమకళా విభూషణుడు, శుద్ధ సితాంగవిభాసురుండు. సు
రిప్లయితొలగించండిత్రామ గణార్చితుండు, ప్రమదంబున భక్తుల సేవలందుచున్
కామితమిచ్చునట్టి త్రిజగత్పతి గొల్తును, పార్వతీ హృదా
రామ పదాబ్జమే శరణురా యని పల్కెను రావణుం డహో!
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండి‘పార్వతీ హృదయారాముని’ గురించిన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
భూమిజఁ బట్టి, యిట్లు పరిపూతను సీతను క్షోభబెట్టుచో
రిప్లయితొలగించండినేమి ఫలంబు దక్కును? మహీశుని కూర్చ విభీషణుండు నా
రామ పదాబ్జమే శరణురా యని పల్కెను; రావణుం డహో!
"సోముని భక్తవజ్రి" నను జూడక పొమ్మని పంపెనాతడిన్!!
స్వామి కృపామయుండు క్షితిజాతను పంపుము నీకు మేలగున్
రిప్లయితొలగించండిరామపదాబ్జమే శరణురా యని పల్కెను, రావణుం డహో
యేమిర! రాక్షసోత్తమున కీవిధి చెప్పెదు వానరాధమా
క్షేమము చూడబోవనియె చిన్మయరూపుని తూలనాడుచున్.
అయ్యా రాంభట్ల వారూ, నాదో చిన్న సందేహం
రిప్లయితొలగించండిమీ పద్యం చివరి పాదంలో ఆతడిన్ అని అన్నారు అది సాధువేనా, లేక ఆతనిన్ అనాలా? కొంచెం చెప్పండి
రాముని దూతయై హనుమ రాక్షసరాజును హెచ్చరించి "శ్రీ
రిప్లయితొలగించండిరామ పదాబ్జమే శరణురా" యని పల్కెను రావణుం డ"హో!
యేమని పల్కుచుంటి"వనె, నెంత యహమ్మునుఁ జూపెనంతగా
రాముని క్రోధతీవ్రతను రాక్షసవంశము నంతరించెగా!
ఆమహనీయ సాధ్వి నిక నారడి బెట్టక నప్పజెప్పుమా
రిప్లయితొలగించండిరామునికన్న తమ్ము గని రౌద్రముతోడను తన్ని నీకికన్
రామ పదాబ్జమే శరణురా యని పల్కెను; రావణుం డహో!
కామ మదమ్ము కన్నులను గప్పి న నచ్చునె సూనృతమ్ములే !
శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
రిప్లయితొలగించండినమస్కృతులతో,
“రామపదాబ్జమే శరణు రా?” యని పల్కెను రావణుం; “డహో!
రామపదాబ్జమే శరణు రా?” యని పల్కెను రావణుం; “డహో
రామపదాబ్జమే శరణు రా యని రాయనిఁ గొల్వుఁ” డం “చహో
రామపదాబ్జమే శరణు రా!” యని పల్కెను రావణుం డహో.
“రామపదాబ్జమే శరణందువురా?” అని రావణుఁడు, “రామపదాబ్జమే శరణందువురా?” అని మేఘనాదుఁడు [రావణస్య అపత్యం పుమాన్ రావణిః. తెలుగులో రావణుఁడు] దూతగా వచ్చిన హనుమంతుని గద్దించి అడిగారు.
ఆ మాటలకు, “ఓహో! రామునియొక్క పాదాబ్జమే శరణాగతి అని నమ్మి ఆ రాయని భక్తితో ప్రార్థించండి” అని అంటూ, రావణుండు = ఉచ్చైఃస్వరము కలవాఁడైన హనుమంతుఁడు “అహో = శోకమును [అహో (అవ్య.) శోకః – శబ్దార్థకల్పతరువు], రామ = ఉపశమింపఁజేయు శ్రీరామచంద్రునియొక్క, పద = చరణమనెడు, అబ్జమే = కల్పవృక్షము [అబ్జః కల్పతరౌ – శబ్దార్థకల్పతరువు] ఒక్కటే; శరణము = ఆశ్రయము” అని సమాధానం చెప్పాడు.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
రామశరాగ్ని కీలలను రాజ్యము దగ్ధము కాక మున్నె శ్రీ
రిప్లయితొలగించండిరాముని ప్రాపు పొందుమని ప్రార్థన జేయగ తమ్ము డుగ్రుడై
రామను గోలుపోయి వని గ్రాలెడు మర్త్యుడు దేవుడేమి? ఏ-
రామ పదాబ్జమే శరణురా? యని పల్కెను రావణుం డహో!
రాముని దూత వాయు సుతు రావణు సన్నిది జేరి "ధూర్త! శ్రీ
రిప్లయితొలగించండిరామ పదాబ్జమే శరణురా " యని పల్కెను , రావణుండహో !
రాముడు పిచ్చివానివలె రాత్రి బవల్ వనిలోన తిర్గుచున్
భూమిజ నెట్లు చేకొనును భూరి పరాక్రము నన్ను గెల్చియున్.
రిప్లయితొలగించండిఏమని పల్కుచుంటివి యొకింతయు నింగిత మేమి లేకయే
పామరునట్లు,మానవుని పక్షము జేరి యిటుల్ విభీషణా
భీమపరాక్రముండ,నిటు భీరుడనౌదునె పార్వతీమనో
రామపదాబ్జమే శరణురా యని పల్కెను రావణుండహో !
నీమము వీడకుండ మది నిర్మల భావము ప్రీతి చెందగా
రిప్లయితొలగించండిక్షేమము గోరినంత విని చేదన కుండగ విన్నవించి యా
రాముని పత్నినిన్ విడచి రాజస మొప్పగ వేడు కొందువే
రామ పదాబ్జమే శరణు రాయని పల్కెను రావణుండహో !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ కామేశ్వర శర్మ గారికి నమస్సులు. అతడు, అతండు, ఆతడు, ఆతండు, అని కూడా అనవచ్చు. కానీ... మీరన్నట్టు ఇక్కడ ఆతనిన్ అన్నడే సరియైనదని నా భావన.
రిప్లయితొలగించండిఅతను అన్నది ఏకవచనం, అగౌరవార్థంలో వినిపిస్తున్నది.. తమ్ముడు, పైగా కోపం. మీరన్న పదమే సమంజసం... ధన్యవాదాలు.
కామము రేగె నాకు పెను కారణమయ్యెను సీత దానికిన్
రిప్లయితొలగించండికోమలి రామ సక్కనిది కూరిమిఁ జూపినఁ జాలు నేడికన్
ధూమము లేని యగ్ని వలె తోచును తొయ్యలి చెన్నుఁ జూడనా
రామ పదాబ్జమే శరణురా యని పల్కెను రావణుం డహో!!
ఒకరిని మించి ఒకరుగా మనోహరంగా, వైవిధ్యంగా పూరణలు చెప్పిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
లక్ష్మీదేవి గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
ఏల్చూరి మురళీధర రావు గారికి,
మిస్సన్న గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
కమనీయం గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
జిగురు సత్యనారాయణ గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
తోముచు మోడి కాళ్ళనిక తుమ్ముచు దగ్గుచు ముక్కుచీది జై
రిప్లయితొలగించండిరామ రమేశుడీ తడవ రమ్యపు రీతిని మ్రొక్కుచుండుటన్
గోముగ చూడగా నితని గొల్లున నేడ్పును తోచు నివ్విధిన్: 👇
"రామ పదాబ్జమే శరణురా యని పల్కెను రావణుం డహో!"