గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, చివరిపాదాన్ని ఇలా మార్చితే బాగుంటుందని నా సలహా... "చుట్ట మొకడు కాలు బెట్టు నింట" * సహదేవుడు గారూ, ‘సూచికంబు" అనేది ‘సూచకంబు"నకు టైపాటా? * తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ, రెండవ పాదంలో ‘ఘనమగు’ అన్నచోట గణదోషం. అక్కడ ‘ఘనము’ అంటే సరి!
చాల సంకేతములు రహస్యముగ నుండు
రిప్లయితొలగించండివాహినీ దళములలోన, వానిలోన
"కా"యనెడు వాని కంపిన కబురె జగతి
కాకి కబురుగ జెలగె లోకమ్మునందు
పెద్దలనగ వింటి పెరటిలో చెట్టుపై
రిప్లయితొలగించండికాకి యరచు చుండి గంతు వేయ
బంధు జనుల రాక ప్రకటించు నదియని
కాకి కబురు కల్ల గాని దనియు .
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచూచి పోదమనెడి చుట్టమ్ము రాకను
రిప్లయితొలగించండికావు కావు మనుచు కాకి తెలిపె
కాకి పోక యిపుడు కంప్యూటరుకు జెప్ప
కవిత జేర్చె మీకు క్షణము లోన !
కోడి కొక్కొ రోకొ కూయగా నుదయాన
రిప్లయితొలగించండిసూర్యు డంబరమున చూడ వచ్చు
కాకి కప్పు పైన "కాకాలు" పాడంగ
కలియ చుట్టమొకరు కాలు బెట్టు
నీ దు తీ రిక జూసుకు నెమ్మదిగను
రిప్లయితొలగించండికాకి చేతను బంపుము కబురు నాకు
వేగ వత్తును నిచటకు విందు జేయ
సంది యంబులు విడువుమ , యిందు వదన !
పెద్ద వారి పట్ల పెంపగు గౌరవ
రిప్లయితొలగించండిసూచికంబు గాను జూడ మనము
వారి కవసరంబు వచ్చిన మనతోటి
కాకి కబురు పంప కదలి పోమె?
రిప్లయితొలగించండికాకి చేత కబురు,కలహంస సందేశ
కాలములు గతించె ,గడకు పోస్టు
తంతివార్త కూడ తగ్గిపోయెను నేడు
కంప్యుటర్ల,సెల్లు కబురు చాలు.
శ్రీపండిత గురువులకు నమస్సులతో
రిప్లయితొలగించండికాకి యరవ బంధు జనుల కాంతు మనెడి భావముల్
కాకి పిడుచ తీసి కొనగ ఘనమగు పైతృ కంబునన్
కాకి కబుర నగను కర్ణ కర్ణ ములతె లియన గున్
కాకి కబురు లెన్నొ యిందు కాంచు చుంటి మందరున్.
కాక మెందు కోయి నోకియా ఫోనుండ ?
రిప్లయితొలగించండిమేఘ మేల నోయి ' మేలు ' లుండ ?
కాలదోష మందె “ కాకి కబుర " నుట
వచ్చె నేడు యంత్ర పరికరములు
ఇంటిమీద చేరి ఇరుమారు ముమ్మారు
రిప్లయితొలగించండి"కావు,కావు”మనుచు కాకి యప్పు
డరచినట్టివేళ నటునుండి చుట్టాల
రాక సత్యమనియె కాకికబురు.
కాకి పేర నిలచె కాకాని యనగను
రిప్లయితొలగించండిమునుల వరము నొందె ముక్తి కొఱకు
గతుకు పిండములను కాలుని వరమొంది
కాకి కబురు లనగ కల్ల గాదే !
-------------------------------------
కబురు లెన్నొ జెప్పి కలకలమును రేపి
ప్రియుని రాక కొఱకు ప్రేమ మీర
పెరుగు భోజనమ్ము పేర్మిగా తినిపోవు
కడకు మోస గించు కాకి యనగ
క్షమించాలి
రిప్లయితొలగించండిచివరి పాదం చివర ....." గాదె " ....అని ఉండాలి
కాకి చేత కబురు పంపిస్తూ, అందుకొంటూ, కాకి కబుర్ల పద్యాలను వ్రాసిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
మిస్సన్న గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
సహదేవుడు గారికి,
కమనీయం గారికి,
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
నాగరాజు రవీందర్ గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
అభినందనలు, ధన్యవాదాలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిచివరిపాదాన్ని ఇలా మార్చితే బాగుంటుందని నా సలహా...
"చుట్ట మొకడు కాలు బెట్టు నింట"
*
సహదేవుడు గారూ,
‘సూచికంబు" అనేది ‘సూచకంబు"నకు టైపాటా?
*
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
రెండవ పాదంలో ‘ఘనమగు’ అన్నచోట గణదోషం. అక్కడ ‘ఘనము’ అంటే సరి!