1, ఏప్రిల్ 2013, సోమవారం

పద్య రచన – 298 (అంతర్జాల అవధానము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“అంతర్జాల అవధానము”

10 కామెంట్‌లు:

  1. మిత్రులారా!
    చిత్తైకాగ్ర్యం అవధానం అని ఆర్యోక్తి. చిత్తైకాగ్ర పరీక్ష ప్రత్యక్షముగనే చేయుట సమంజసము కాని పరోక్షముగా చేయుట హాస్యాస్పదము. ధారణకు అవకాశము నీయని విధానము అంతర్జాల వధానము. అట్టి ప్రక్రియ అర్థరహితము. అందుచేత అట్టి ప్రక్రియలను "అవధానము" అనే పేరుతో నిర్వహించుట సముచితము కాదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  2. అంతర్జాలంబందున
    వింతగ నవధాన విద్య వెలిగించంగా
    నెంతో కొంతగ జనులకు
    నింతా మన తెలుగననుచు నిష్టము గలుగున్.

    రిప్లయితొలగించండి
  3. గురువు గారు,
    పండితులవారు చెప్పినట్టు ఇందులో ధారణకు అవకాశము లేదు.
    కానీ ఈ ప్రక్రియలో నిషిద్ధాక్షరి మొదలైనవన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. పైగా ఉన్నచోటునుంచే పాల్గొనే సౌలభ్యం కూడా ఉంది.
    ఈ ప్రక్రియకు ఇంకొక సరిపోయే పేరు పెట్టవలసి ఉంది.
    సభలో చేసే అవధానాల వంటిది కాదిది. అంతర్జాలంలో నిర్వహించినపుడు పైన చెప్పిన ప్రత్యేక లక్షణాలను సూచించగలిగే పేరయి ఉంటే బాగుంటుంది.

    భాషాధ్యయనమునను సం
    తోషమ్ముకలుగు, చతురత తోడన్ కవుల్
    దోషరహితమ్ముగఁ గడు వి
    శేష రచనఁ జేయుచుండ శీఘ్రమ్ముగనే.

    రిప్లయితొలగించండి
  4. అంతర్జా లంబందున
    వింతగ మ ఱి చేయు చుండ్రి వేవిధము లుగా
    వింతలలో నవధానము
    వింతలునే గలుగ జేసె వింతగ మనకున్ .

    రిప్లయితొలగించండి
  5. శ్రీనేమానివారి అభిప్రాయం సబబుగాఅ ఉంది. కాని పోర్తిగా హాస్యస్పదం కాకపోవచ్చునండీ. ఎంతైనా అవధాని అందరితో onlineలో నయినా గబగబా ప్రక్రియ పూర్తిచేయాలి కదా. కాని వారన్నట్లు కంప్యూటరుతో కూర్చుని ధారణతో చేసే అవసరం లేదు కాబట్టి అవధానం అని కాకుండా వేరే‌ పేరు పెట్టాలన్న అలోచన చేయవచ్చును.

    రిప్లయితొలగించండి
  6. నిన్నటి అంతర్జాల అవధాన(సదృశ)కార్యక్రమంలో యాదృఛ్ఛికంగా నేనొక క్రొత్త ఛందస్సును ఆవిష్కరించటం జరిగింది. వ్యాఖ్యరూపంలో వివరాలన్నీ చెప్పటం సాధ్యం కాదు కాబట్టి శ్యామలీయం బ్లాగులో‌వివరాలతో టపా వేశాను. కవిమిత్రులు పరిశీలించగలరు. లింక్: http://syamaliyam.blogspot.in/

    రిప్లయితొలగించండి
  7. సంతోషదమిది యనదగు
    నంతర్జాలంబునందు నత్యుత్సుకతన్
    వింతగ తారొనరించెడి
    దెంతయు నవధానవిద్య యిక్కాలమునన్.

    రిప్లయితొలగించండి





  8. ఈ విషయంలో పండిత నేమాని వారితో ఏకీభవిస్తున్నాను.ఎలాగూ ,సమస్యాపూరణ,ఒక అంశం మీద పద్యరచన,అప్పుడప్పుడు దత్తపది జరుగుతున్నాయి కదా.అవి చాలుననుకొంటున్నాను.

    రిప్లయితొలగించండి
  9. అంతర్జాలము నందున
    సంతస మున పృచ్చ కుండు చాతుర్యము నన్ !
    వింతగ పూరణ జేయుచు
    అంతరమును కలుపు కొనగ నంబర వీధిన్ !

    రిప్లయితొలగించండి
  10. సాంకేతికాభివృధ్ధితో సాధ్యమే యిది. కాని ప్రత్యక్ష దర్శనపు వేడుకే వేరు.

    క్రీడలు ప్రత్యక్షముగా
    వేడుకతో జూచు నటులె పృచ్ఛకు లడుగన్
    వేడిగ పూరణ,ధారణ
    లాడరె జాలమ్ము లోన నవధాను లికన్ !

    రిప్లయితొలగించండి