మా కిక్కడ ఇళ్ళలో కిటికీ తలుపు లెప్పుడు మూసి ఉంటాయి.అందుచే గాలి ప్రసరించే ఏర్పాటు లేదు. తప్పదు, వేడి భరించ లేము . క్రొత్త యంత్రాలు కొనాలి. అవి యింటి బయట ఉండడము వలన వాటి చుట్టూ ఇనుప కంచె కట్టి కప్ప, తాళము వెయ్యాలి.
వేసవి కాలపు విశిష్టతలను తెలియజేస్తూ చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు.... "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, లక్ష్మీదేవి గారికి, హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి, సుబ్బారావు గారికి, సహదేవుడు గారికి, గన్నవరపు నరసింహ మూర్తి గారికి, రాజేశ్వరి అక్కయ్యకు, అభినందనలు, ధన్యవాదాలు. * హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, మీ ఖండకృతి ప్రత్యేక ప్రశంసార్హమై శోభిస్తున్నది. అభినందనలు. * గన్నవరపు వారూ, అక్కడకూడా దొంగల బెడద ఉన్నదా?
మలమల మాడ్చుచుండెనిల మండుచునెండలు నేకధాటిగా
రిప్లయితొలగించండిసలసల క్రాగుచుండె మన సౌధములన్నియు నుష్ణతీవ్రతన్
విలవిల లాడుచుండె ప్రజ వేసవి తాపము నోర్వలేకనే
తలుపులు తీయనేరకను దాగొని రెల్లరు దైన్యమొందుచున్!!
వేసారునుక్క పోతలు
రిప్లయితొలగించండిసీసాలుగ చల్ల నీరు సిరి మల్లియలున్
ఆ సపోట మామిళ్ళును
వేసవి కాలమ్ము గలవు వెతలును సుఖముల్.
సత్యనారాయణుని పూజ జరుగుచోట
రిప్లయితొలగించండివిఘ్ననాయకు నర్చించి పిదప మనము
పుణ్యకాల నవగ్రహ పూజలందు
సూర్యచంద్రుల నొకచోటఁ జూడగలము.
మండుచు నుండెడి తీవ్రపు
రిప్లయితొలగించండిటెండలను భరించు శక్తి నిమ్మని నేనా
కొండల నందుదయించెడు ప్ర
చండుని వేడుదు వినతుల సలుపుదు నెపుడున్.
వేసారునుక్క పోతలు
రిప్లయితొలగించండిసీసాలుగ చల్ల నీరు సిరి మల్లియలున్
ఆ సపొ టాలును మామిడి
వేసవి కాలమ్ము గలవు వెతలును సుఖముల్.
కర్మసాక్షియు, జగముల మర్మమెరిగి
రిప్లయితొలగించండిదారి జూపంగ వెలుగుల దానమొసగు
మిత్రు డక్కట! యిలవారి మిడిసిపాటు
కాగ్రహించెను వీడెను నిగ్రహంబు.
ఉగ్రరూపంబు దాల్చుచు నుర్విపైన
కరములను చాచి నిప్పులు క్రక్కుచుండె
యువకులకునైన సత్వంబు లుడుగుచుండ
చెప్పనలవియె వృద్ధుల తిప్పలికను.
మండుటెండకు నొడలెల్ల మాడిపోయె
స్వేద మలమగ దేహంబు చీకిపోయె
గృహములందున, వీధుల, కూడలులను
నిలిచియుండంగ లేమను తలపు కలిగె.
పెదవులారిపోయె మొదలాయె నలసట
ష్ఠీవనంబు కొంత చేయబూన
వెడలకుండె రసము వేసవి మూలాన
నెండిపోయె దేహ మెల్ల గతుల.
ముదము సన్నగిల్లె చిదికిన దుత్సాహ
మాస లుడిగిపోయె వేసవి గని
వరుణదేవు దలచి వర్షంపు రాకకై
నిలిచి చూచుచుండి రిలను జనులు.
రిప్లయితొలగించండిఆర్యా!
నమస్కారములు,
రెండవపద్యాన్ని క్రింది విధంగా సవరిస్తున్నాను, గమనించ ప్రార్థన.
ఉగ్రరూపంబు దాల్చుచు నుర్విపైన
కరములను చాచి నిప్పులు క్రక్కుచుండె
పడుచులకునైన సత్వంబు లుడుగుచుండ
చెప్పనలవియె వృద్ధుల తిప్పలికను.
వేసవి కాలము వచ్చెను
రిప్లయితొలగించండిబాసటముగ నెండ ముదిరె పలురకములుగాన్
ఈ సులు మోదలా యెను మది
కాసులు నిక యెక్కువగును కవివరు లారా !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికొండల పిండిగఁ జేసెడు
రిప్లయితొలగించండినెండలఁ దిరుగంగఁ దరమె? యీశున కైనన్!
కుండల నీటినె గోరడె?
యుండిన తలపైని గంగ యుష్ణముఁ బంచన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ వేసవిలో నా గోల ;
రిప్లయితొలగించండిగాలిని చక్కదిద్ది వడ గాడ్పుల శీతల మారుతమ్ములన్
హేలగ జేయు యంత్రముల హీనుడు నొక్కడు తస్కరించె ! నే
మేలము లాడ లేదు, నిక మేలని దల్చెదొ గ్రీష్మ వాయువుల్ !
వేలను గుమ్మరించి మిడి వేసవి నెట్టుదొ హెచ్చు మూల్యమున్ !
మా కిక్కడ ఇళ్ళలో కిటికీ తలుపు లెప్పుడు మూసి ఉంటాయి.అందుచే గాలి ప్రసరించే ఏర్పాటు లేదు. తప్పదు, వేడి భరించ లేము . క్రొత్త యంత్రాలు కొనాలి. అవి యింటి బయట ఉండడము వలన వాటి చుట్టూ ఇనుప కంచె కట్టి కప్ప, తాళము వెయ్యాలి.
మండెడి యెండల కొఱకని
రిప్లయితొలగించండికుండెడు చలి వేంద్ర మిడిన కోరక వరముల్ !
దండుగ కాదని ముదముగ
మెండుగ జేయంగ వలయు మేలగు ప్రజకున్ !
వేసవి కాలపు విశిష్టతలను తెలియజేస్తూ చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండి"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
లక్ష్మీదేవి గారికి,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
సుబ్బారావు గారికి,
సహదేవుడు గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
అభినందనలు, ధన్యవాదాలు.
*
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ ఖండకృతి ప్రత్యేక ప్రశంసార్హమై శోభిస్తున్నది. అభినందనలు.
*
గన్నవరపు వారూ,
అక్కడకూడా దొంగల బెడద ఉన్నదా?
గురువు గారూ నమస్సులు. ఏ ఊరిలో నైనా దుకాణాలలో కప్పలు, తాళా లమ్ముతున్నారంటే మరి అక్కడ దొంగలున్నారనే అర్ధము. ఇక్కడ దొంగలు కారుల్లోనే వస్తారు, అదీ తేడా !
రిప్లయితొలగించండి