22, ఏప్రిల్ 2013, సోమవారం

సమస్యాపూరణం – 1031 (నలకూబరుఁ డాంజనేయునకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
నలకూబరుఁ డాంజనేయునకు మామ గదా!

14 కామెంట్‌లు:

  1. (ఒక అల్లుడు మామల సంభాషణ)

    తలపగ సరియగునే? యా
    నలకూబరు డాంజనేయునకు, మామ! గదా
    విలసద్ భుజుడా మారుతి
    బలశాలియు, సుందరుండు, భగవద్ధితుడున్

    రిప్లయితొలగించండి
  2. నెల తక్కువ వయసైనా అమ్మతమ్ముడు మామ వరసే కదా అని...

    నెలతకు తమ్ముడు పుత్రుడు
    నెల తేడా తోడ బుట్టె, నిజ నామములన్
    నెల తక్కువ వయసైనను
    నలకూబరుఁ డాంజనేయునకు మామ గదా!

    రిప్లయితొలగించండి
  3. ఇల రావణునకు శాపం
    బలమెను, రాముండు హారమందగజేసెన్,
    అలరగ శ్వశరుండేమగు?
    నలకూబరుఁ, డాంజనేయునకు, మామ యగున్.

    రిప్లయితొలగించండి
  4. ఇల నరయ కాడు నేమియు
    నలకూబరు డాం జనేయునకు , మామ గదా !
    బలరామునకును గంసుడు
    పలు విధముల బాధ వెట్టె బ్రజలను నతడున్ .

    రిప్లయితొలగించండి
  5. ఇదితప్పుకదా చెప్పుట
    నలకూబరుఁ డాంజనేయునకు మామ గదా!
    యని ఎవరన్నన్, కుబేరు
    ని కుమారుడు నలకుబేరుడు అనిన చెల్లున్!

    రిప్లయితొలగించండి
  6. కలవాడు కుబేర సుతుడు
    తెలుపుము నామము, కడలిని దిగ్గున దాటన్
    బలమేరికి? శశి యెవ్వరు?
    నలకూబరుఁ ;డాంజనేయునకు; మామ గదా!

    రిప్లయితొలగించండి
  7. కిశోర్ కుమార్ గారూ,
    కాస్త దారిలో పడ్డారు. అభినందనలు.
    అయితే మీరు ప్రాస నియమాన్ని పాటించలేదు. మూడవ పాదంలో ‘కుబేరు’ అని జగణం పడింది. ఆ పాదంలో బేసిగణంగా జగణం ఉండకూడదు కదా! నాల్గవ పాదంలో యతి తప్పింది.

    రిప్లయితొలగించండి
  8. కలనైనను విన లేదన
    నలకూ బరు డాంజనేయు నకు మామ గదా !
    నిల సాటి నెవరు గెలువగ
    బలశాలగు వాయు సుతుని భట్టారకునిన్ !

    రిప్లయితొలగించండి
  9. అలశూద్రక కవి రచితో
    జ్వల సంస్కృత మృచ్ఛకటిక ప్రకరణమందున్
    తెలియకను శకారుడనున్
    "నలకూబరుఁ డాంజనేయునకు మామ గదా!"

    రిప్లయితొలగించండి
  10. పండితులు శంకరయ్య గారికినమస్కారములతో,
    నేను ఈ మాత్రం పద్యం చెప్పగలుగుతున్నది మీ బ్లాగు సముదాయం దయవల్లనే. ఒకరోజు యాధృచ్ఛికంగా ఈ బ్లాగులోకి రావడం, ఆసక్తితో పద్యాలన్నీ చదివి కొంత అనుభవం సంపాదించడం జరిగింది. నేను పండితుడిని కాను కాబట్టి తప్పులుంటే సరిదిద్దగలరని మనవి. మీరు తగిన సూచనలిచ్చి మరింత మెరుగైనవిధంగా వ్రాసేటట్లుగా నన్ను తీర్చిదిద్దిగలరని కోరుతున్నాను.

    రిప్లయితొలగించండి
  11. ఈనాటి సమస్య వైవిధ్య పూరణలకు అవకాశమున్నట్టిది. అందుకు తగినట్లుగానే మిత్రులు చక్కని పూరణల నందించారు. సంతోషం!
    చక్కని విరుపుతో మంచి పూరణ నిచ్చారు పండిత నేమాని వారు.
    వరుసలు కలిపి ఇద్దరినీ నిజంగానే మామా అల్లుళ్ళను చేసారు గోలి హనుమచ్ఛాస్త్రి గారు.
    క్రమాలంకారంలో చక్కగా పూరించారు సంపత్ కుమార్ శాస్త్రి గారు,
    విరుపుతో మంచి పూరణ చెప్పారు సుబ్బారావు గారు.
    క్రమాలంకారంలోనే చక్కని పూరణ చెప్పారు లక్ష్మీదేవి గారు.
    రాజేశ్వరి అక్కయ్య మంచి ప్రయత్నం చేసారు. కానీ కొన్ని లోపాలు..
    శకారుని ఉన్మత్తప్రలాపంగా అద్భుతమైన పూరణ చెప్పారు ‘అవధాన సుధాకర’ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు.
    అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మూడవ పాదం ఆరంభంలో యడాగమం రావాలి. అలాగే ‘సాటి + ఎవరు = సాటి యెవరు’ అవుతుంది. ‘బలశాలి + అగు’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ యడాగమం వస్తుంది. భట్టారకుడు శబ్దానికి సూర్యుడు, ముని అని అర్థాలున్నాయి. మీ పద్యానికి నా సవరణ....
    కలనైన వినని పలుకిది
    ‘నలకూ బరు డాంజనేయు నకు మామ గదా !’
    యిల సాటి నెవరు గెలువగ
    బలవంతుడు వాయు సుతుని భండనమందున్ !
    *
    కిశోర్ కుమార్ గారూ,
    పద్యరచనను ప్రోత్సహించడమే శంకరాభరణం బ్లాగు ఆశయం. అందుకు మీకు అన్ని విధాల సహకారం నానుండి, బ్లాగు మిత్రుల నుండి తప్పక లభిస్తుంది. ఇప్పుడు బ్లాగులో మనోహరమైన పద్యాలు వ్రాస్తున్న కొందరు మిత్రులు ప్రారంభంలో మీలాగే తడబడిన వారే. క్రమక్రమంగా తప్పులు తెలుసుకొని, పద్యధారను చేజిక్కించుకొన్నారు. మీరు వ్రాయడం కొనసాగించండి. శుభమస్తు!

    రిప్లయితొలగించండి
  12. అల మారుతి సుందరుడే,
    నలకూబరుడందగాడు; నన్నడిగినచో...
    అలవోకగ చుట్టములే
    నలకూబరుఁ డాంజనేయునకు మామ గదా!

    రిప్లయితొలగించండి