11, ఏప్రిల్ 2013, గురువారం

సమస్యాపూరణం – 1020 (కాదు సంతోషదాయకము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
 కాదు సంతోషదాయక మీ దినమ్ము.

17 కామెంట్‌లు:

  1. సోదర సోదరీ మణులకు పూజ్య గురువులకు పండితులకు అందరికీ ఉగాది శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  2. అన్నయ్యగారికి గురువర్యులకు అభివందనములు. మిత్రులకు సోదరీమణులకు అభినందనలు. అందఱికీ శ్రీ విజయనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  3. శ్రీ కంది శంకరయ్య గురుతుల్యులకు , పండిత నేమాని కవి శ్రేష్టులకు మరియు కవులెల్లరకు శ్రీ విజయనామ సంత్సర ఉగాది శుభాకాంక్షలతో...

    "నూతన వత్సరంబు సుమనోహర కాంతులు జిమ్మి చీకటిన్
    భీతిని బారద్రోలి బహు ప్రీతి , సుసంపద, సౌఖ్యమిచ్చి ప్ర
    ఖ్యాతిని బెంచి సంఘమున గౌరవ మెందగ జేసి సర్వదా
    జాతిని నీతి మార్గమున జక్కగ సాగగ జేయుగావుతన్"

    రిప్లయితొలగించండి
  4. ఏగుదెంచెనోయి యుగాది బాగు బాగు
    పూని యేడాది కొకమారు కాని రాదు
    ఆశ చిగురించు కొత్తగా నదియె వమ్ము
    గాదు ; సంతోష దాయక మీ దినమ్ము

    రిప్లయితొలగించండి
  5. శంకరాభరణ మిత్రులకు విజయ నామ సంవత్సర శుభా కాంక్షలతో ...


    విజయము నిచ్చును గావుత !
    విజయపు నా వత్సరమ్ము వేవిధములుగాన్
    అజరామరమగు శుభములు
    నిజముగ నిక గలుగు గాక ! నిరతము మీ కున్

    రిప్లయితొలగించండి
  6. విజయ వత్సర మీ యది విజయ ముగను
    ఏగు దెంచెను నీ నాడ యింతు లార!
    మదిని కలత లొం దకుడు నా మాట వమ్ము
    కాదు, సంతోష దాయక మీ దినమ్ము .

    రిప్లయితొలగించండి
  7. క్రొత్త యాశల నూసుల కొసరి తెచ్చు
    కోయిలమ్మయు మావులు క్రొత్త వత్స
    రాదిని మనలకు శుభ కరమ్మొ కటియె
    కాదు సంతోష దాయక మీ దినమ్ము .

    రిప్లయితొలగించండి
  8. వత్సరారంభ మీనాడు వైభవముగ
    బంధుమిత్రుల రాకచే బహువిధాల
    సుఖము కలుగును సర్వత్ర శుభము లివియె
    కాదు, సంతోషదాయక మీదినమ్ము

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గురువులకు ,కవిపండితులకు పాఠకులకు విజయనామ సంవత్సర శుభాకాంక్షలు.

    వృద్ధి గలుగని సర్వ సమృద్ధి గాను
    జనము కీయేడు ఘనమైన జయముగలిగి!
    మంచికాలమ్ముకాదను మాట ,నిజము
    గాదు !సంతోష దాయకమీ దినమ్ము!

    రిప్లయితొలగించండి
  10. శ్రీపండిత నేమాని గురువులకుశ్రీ శంకరార్యులకు శ్రీఏల్చూరి వారికి నమస్సులతో
    శంకరాభరణ కవిమిత్రులకు బ్లాగువీక్షకులకు “ విజయ” నామ ఉగాది శుభాకాంక్షలతో

    గడచిన దినములన్నిట కనిన రీతి
    కాదు, సంతోషదాయక మీ దినమ్ము
    వచ్చె “విజయ” విలాసియై వత్సరమ్ము
    మనకు శుభమ్ము విజయమ్ము మంచి నిడగ.

    రిప్లయితొలగించండి
  11. గురువులకు కవి మిత్రులకు ఉగాది శుభాకాంక్షలు.


    విజయ నామ సంవత్సర వేడ్క లందు
    శుభములుఁగలుగ కాంక్షించ శోభ గూర్చు
    గతముఁ దలపోసి దుఃఖించ క్షితినిఁ బాడి
    కాదు , సంతోష దావయక మీ దినంబు!

    రిప్లయితొలగించండి
  12. ఆరు రుచులును జీవితమందు నంద
    సంతసమ్ముగ భావించు శక్తి లేని
    వలదు వేప్పచ్చడని చెప్పు వారి కెపుడు
    కాదు సంతోష దాయక మీ దినమ్ము .

    రిప్లయితొలగించండి
  13. నాదు నవ్య రచనలెల్ల నచ్చకున్న
    గురువు మెచ్చకున్న , శుభము గొలుపు మాట
    పలుకకున్నచో -నిక్కము పలుకుచుంటి-
    కాదు సంతోష దాయక మీ దినమ్ము .

    రిప్లయితొలగించండి
  14. గురువర్యులు పండితులు శ్రీ కంది శంకరయ్య గారికి శ్రీ విజయ నామ ఉగాది శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  15. విజయ నామ సంవత్సర వేడ్క రోజు
    నందరాత్మీయ ప్రేమతో డలర దగును
    గత వెతలను జింతించు కాల మిదియు
    కాదు, సంతోష దాయక మీ దినమ్ము .

    రిప్లయితొలగించండి
  16. నిన్న "విజయ" ఉగాది 'సంతోషదాయకం'గా గడిచింది. రోజంతా పండుగ హడావుడి, మిత్రులతో కాలక్షేపం, సాయంత్రం కవిసమ్మేళనం, రాత్రి ‘ప్రతాపరుద్ర’ స్వచ్ఛంద సంస్థ వారిచే సన్మానం....
    నిన్నటి సమస్యకు చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు....
    నాగరాజు రవీందర్ గారికి,
    సుబ్బారావు గారికి,
    మిస్సన్న గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    మంద పీతాంబర్ గారికి,
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    సహదేవుడు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు.....
    రాజేశ్వరి అక్కయ్యకు,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    సుబ్బారావు గారికి,
    మంద పీతాంబర్ గారికి,
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    సహదేవుడు గారికి,
    kvsv గారికి,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. మాస్టరు గారూ ! ప్రతాపరుద్ర సంస్థ వారిచే సన్మానమునందుకున్న మీకు అబినందన మందార మాల...అందుకోండి.

    రిప్లయితొలగించండి