సూర్యచంద్రుల నొక్కచోట చూపిస్తూ చక్కని పూరణలు పంపిన కవిమిత్రులు.... పండిత నేమాని వారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి, "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి, ఆర్.వి.ఆర్. శర్మ గారికి, లక్ష్మీదేవి గారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి, సహదేవుడు గారికి, డా. ఆచార్య ఫణీంద్ర గారికి, సుబ్బారావు గారికి, మంద పీతాంబర్ గారికి, రాజేశ్వరి అక్కయ్యకు, గన్నవరపు నరసింహ మూర్తి గారికి, అభినందనలు, ధన్యవాదాలు. * కిశోర్ కుమార్ గారూ, మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని గణయతిప్రాసల విషయంలో శ్రద్ధ చూపవలసి ఉన్నది.
సూర్య చంద్రాగ్ని నేత్రుడై శోభలలరు
రిప్లయితొలగించండిపార్వతీపతి దర్శన భాగ్యమొదవ
నా మహాదేవు కన్నులై యలరు చుండు
సూర్య చంద్రుల నొక చోట జూడగలము
అమ్మ వారికి కన్నులై యమరి యుండె
రిప్లయితొలగించండిరవి యదొక్కటి మరి యొండు రాజు గాదె
అమ్ముఖమ్మును గన భక్తి సమ్ముఖమున
సూర్య చంద్రుల నొక చోట జూడగలము
అమ్మ ముఖమున కన్నులై యలరు చుండు
రిప్లయితొలగించండిరవియు నొక్కటి వెన్నెల రాజు నొకటి
అమ్ముఖమ్మును గన భక్తి సమ్ముఖమున
సూర్య చంద్రుల నొక చోట జూడగలము
భారతంబున కన్యాకుమారికెపుడు
రిప్లయితొలగించండిదర్శనార్థులు పలువురు తరలివత్తు
రచట పౌర్ణమినాడెంతొ యద్భుతముగ
సూర్యచంద్రుల నొకచోట జూడగలము.
అందరికీ శుభోదయం., నమస్సులు
రిప్లయితొలగించండివిశ్వరూపుడు పరమాత్మ విశ్వరూప
దర్శనంబిడి భక్తులఁ దనియ జేయ
జగమునిండిన యా నేత్ర యుగమునందు
సూర్య చంద్రుల నొక చోట జూడగలము!!
సెలవులివ్వంగ బళ్ళకు నెలకుమించి
రిప్లయితొలగించండిహర్షమందుచు బాలకులాడుచుంద్రు
జాలమికనేల? నక్షత్రశాలలోన
సూర్యచంద్రుల నొకచోట జూడగలము
కనగ నమవస దినమున జనితునకును
రిప్లయితొలగించండివక్రమేమిది? జాతక చక్రమందు
విదితమే నేకరాశిలో వెల్లివిరియు
సూర్య చంద్రుల నొక చోట జూడగలము
అమావాస్య జనిత జాతకుడికి రాశి చక్రంలో సూర్యచంద్రులిద్దరూ ఒకే (రాశి) ఇంట్లో ఉంటారు
సత్యనారాయణుని పూజ జరుగుచోట
రిప్లయితొలగించండివిఘ్ననాయకు నర్చించి పిదప మనము
పుణ్యకాల నవగ్రహ పూజలందు
సూర్యచంద్రుల నొకచోటఁ జూడగలము.
సూర్యతేజుండు రఘురాముఁ డార్యుడితడు
రిప్లయితొలగించండిచంద్రబింబంబుఁ బోలు భూజాత సీత
జరుగు పట్టాభిషేక సత్సమయమందు
సూర్య చంద్రుల నొకచోటఁ జూడగలము
సూర్యుడుదయించు పూర్వమే స్కూలు కెళ్ళి
రిప్లయితొలగించండిచంద్రుడరుదెంచు వరకు చదువు చుండ
నేటి విద్యార్థులై మేము నిత్య మటుల
సూర్యచంద్రుల నొకచోట చూడగలము!
తన విరాడ్రూపమందు నేత్రముల వోలె
రిప్లయితొలగించండివెలుగ ఖద్యోత చంద్రులే, విష్ణు మూర్తి
దర్శనం బిడగ - మనము ధన్యులగుచు
సూర్య చంద్రుల నొకచోట చూడగలము!
సూర్య చంద్రుల నొక చోట జూడ గలము
రిప్లయితొలగించండిపౌర్ణ తిధి యందు రామేశ్వ రార్ణవమున
చంద్రు రాకయు మఱియును సూర్యు పోక
ఏక సారిగ జరుగును నిచట జూడ.
విష్ణు మూర్తినిమురిపించు విష్ణుసతిని
రిప్లయితొలగించండిబ్రహ్మ తోవాణి గిరిజతో పరమ శివుని
సూర్య చంద్రుల నొకచోట జూడగలము
వెండి తెరపైన కన్నుల వెలుగునిండ!!!
మరియొక ప్రయత్నము:
రిప్లయితొలగించండి(భాగవతములో రాకేందు బింబమై రవిబింబమై యొప్పు అనే భావము ఆధారముగా)
ఆ.వె.
సూర్యచంద్రుల నొకచోట జూడగలము
సత్యభామ కనులజంట యందు
నరకు నెదుర నిల్చి హరి చెంతగల వేళ
ప్రళయ ప్రణయ గతుల వైభవమున
పశ్చి మాద్రిని క్రుంకుచు నిశ్చ లముగ
రిప్లయితొలగించండిసంధ్య సొగసులు విరియగ సంత సమున
నింగి నందున చంద్రుడు తొంగి చూడ
సూర్య చంద్రుల నొక చోట చూడ గలము !
సూర్యుడనెడివాడు రవికు
రిప్లయితొలగించండిమారుడు, చనద్రయ్యను చంద్రుడని అనినచో
వారిరువురిని కని సూర్య
సూర్యచంద్రుల నొకచోటఁ జూడగలము అవునునా?
సుమతి! సూర్య చంద్రుల నొకచోట జూడగలము ప
రిప్లయితొలగించండిద్యముల నల్లుచుండ వర్ణనాత్మకముగ శ్లేషతో
ప్రముఖ కవుల వాక్పటుత్వ వైభవమ్మునకు నసా
ధ్యము జగమ్ములందు నేదియైన నుండజాలునే?
సూర్యదీధితి వర్ణింప నార్యు లచట
రిప్లయితొలగించండిచంద్రకాంతుల గీర్తింప సరస యేము
శంకరాభరణమునందు సహజ రీతి
సూర్యచంద్రుల నొకచోటఁ జూడ గలము.
శ్రీ సహదేవుల వారి పూరణకు చిన్న సవరణ ;
రిప్లయితొలగించండి( స్కూలుకు + వెళ్ళి , సంధి రాదు. )
భాను డుదయించు మునుపునే బడికి వెళ్ళి
చంద్రు డరుదెంచు వఱకును చదువు చుండ
నేటి విద్యార్థులై మేము నిత్య మటుల
సూర్య చంద్రుల నొకచోటఁ జూడగలము!
సూర్యచంద్రుల నొక్కచోట చూపిస్తూ చక్కని పూరణలు పంపిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి,
ఆర్.వి.ఆర్. శర్మ గారికి,
లక్ష్మీదేవి గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
సహదేవుడు గారికి,
డా. ఆచార్య ఫణీంద్ర గారికి,
సుబ్బారావు గారికి,
మంద పీతాంబర్ గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
*
కిశోర్ కుమార్ గారూ,
మీ ప్రయత్నం ప్రశంసనీయం.
కాని గణయతిప్రాసల విషయంలో శ్రద్ధ చూపవలసి ఉన్నది.
గురువుగారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసహృదయంతో సవరించిన కవి మిత్రులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తుల వారికి కృతజ్ఞతలు.