27, ఏప్రిల్ 2013, శనివారం

సమస్యాపూరణం – 1036 (వివర మెఱుఁగ లేనివాఁడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
వివర మెఱుఁగ లేనివాఁడె విజ్ఞుఁడు జగతిన్.

15 వ్యాఖ్యలు:

 1. కవిమిత్రులకు నమస్కృతులు.
  నిన్నటినుండి నా నెట్ ఎందుకో రావడం లేదు. పక్కింటివాళ్ళ సిస్టం నుండి పోస్ట్ చెయ్యవలసివచ్చింది. దయచేసి పూరణల, పద్యాల పరస్పర గుణదోష విచారణ చెయ్యవలసిందిగా మనవి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. స్తవనీయుల తో జేరుచు
  భవహర వేదంబు సర్వ వాజ్ఞ్మయ ములనే
  లవలేశపు ననుమానము
  వివర మెఱుఁగ లేనివాఁడె విజ్ఞుఁడు జగతిన్.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. పవిపుష్పములందున స్వజ
  న విరోధుల యందు స్వర్గ నరకంబందున్
  లవలేశపు భేదంబను
  వివర మెఱుఁగ లేనివాఁడె విజ్ఞుఁడు జగతిన్.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. అవునవునని తలయూపుచు
  అవమానము లేశమైన యనిపించకనున్
  దివరాత్రులు మంచిచెడుల
  వివర మెఱుఁగ లేనివాఁడె విజ్ఞుఁడు జగతిన్.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. సువిశాల భారతమ్మున
  నవినీతిని వ్యాప్తిజేయ నాతని ఘనమం
  త్రివరులు వివిధగతుల, నా
  వివర మెఱుఁగ లేనివాఁడె "విజ్ఞుఁడు" జగతిన్!

  ప్రత్యుత్తరంతొలగించు
 7. అవిరళ మనస్కు డే నట
  వివర మెఱు గ లేని వాడె , విజ్ఞుడు జగతిన్
  సవివరముగ దెలిసి కొనుచు
  నవ విధముల సాయబడును నమ్రత తోడన్ .

  ప్రత్యుత్తరంతొలగించు
 8. కవివర! కాలము మారెను
  నవ నాగరికత నెపమున నష్టము కూడెన్
  శివశివ! తొలి చదువుల తుది
  వివర మెఱుఁగ లేనివాఁడె విజ్ఞుఁడు జగతిన్!!

  ప్రత్యుత్తరంతొలగించు
 9. పండిత శ్రీనేమాని గురువులకు బ్లాగు మిత్రులకు
  నమస్సులతో అన్న మిస్సన్న గారి పునఃప్రేరణతో

  సవర మనంబున నిత్యము
  శివతత్త్వ జ్ఞానమొప్పు చింతన తోడన్
  భవబంధద్వంద్వమ్ముల
  వివర మెఱుఁగ లేనివాఁడె విజ్ఞుఁడు జగతిన్.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. పండిత శ్రీనేమాని గురువులకు బ్లాగు మిత్రులకు
  నమస్సులతో అన్న మిస్సన్న గారి పునఃప్రేరణతో

  సవర మనంబున నిత్యము
  శివతత్త్వ జ్ఞానమొప్పు చింతన తోడన్
  భవబంధద్వంద్వమ్ముల
  వివర మెఱుఁగ లేనివాఁడె విజ్ఞుఁడు జగతిన్.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. అవినీతి జనుల దలపక
  భవ బంధములు మరచి భగవం తునిపై !
  నవిరళ మగు భక్తి గలిగి
  వివర మెఱుఁ గలేని వాఁడె విజ్ఞుఁడు జగతిన్ !

  ప్రత్యుత్తరంతొలగించు
 12. కవి పెండ్లిచూపు లందున
  రవిగానని కిటుకులొప్పి రసికత తోడన్
  సవరమ్మా? కేశమ్మా?
  వివర మెఱుఁగ లేనివాఁడె విజ్ఞుఁడు జగతిన్!

  ప్రత్యుత్తరంతొలగించు
 13. తవులుచు నూతన పత్నిని
  పవలును రేయిని విడువక పడకల గదిలో
  చవిగొని పూర్వపు చెలువుర
  వివర మెఱుఁగ లేనివాఁడె విజ్ఞుఁడు జగతిన్

  ప్రత్యుత్తరంతొలగించు