7, ఏప్రిల్ 2013, ఆదివారం

పద్య రచన – 304 (ఆరోగ్యమే మహాభాగ్యము)

కవిమిత్రులారా,
ఈరోజు ‘ప్రపంచ ఆరోగ్యదినం’!
నేటి పద్యరచనకు అంశము...

“ఆరోగ్యమే మహాభాగ్యము”

13 కామెంట్‌లు:

 1. భాగ్యములెన్నున్నన్నా
  రోగ్యము లేకున్న బ్రతుకు రోతయె నొకటా
  రోగ్యమె నరులకును మహా
  భాగ్యమ్మదియున్న చాలు బ్రతుకే ధన్యం.

  రిప్లయితొలగించండి
 2. స్వామి! ఆరోగ్యమే మహాభాగ్యము కద
  అట్టి భాగ్యమ్ము నిమ్ము మా కభయవరద!
  నీ పదాబ్జాత యుగమును నిర్మల మతి
  కొలుచు యోగమ్ము నిమ్ము మాకు జగదీశ!

  రిప్లయితొలగించండి
 3. ఆరోగ్యమె మహ భాగ్యము
  ఆరోగ్యము గలుగు వాడు హాయిగ నుండున్
  ఆరోగ్య వంతు యొద్దకు
  ఏరోగము రాదు సామి ! యీ శుని కృ ప చేన్ .

  రిప్లయితొలగించండి
 4. ధూమ పానము విడుచుట క్షేమ మందు
  మితము నయ్యెడి తిండియే హితము నందు
  కడగి వ్యాయామ పరిశ్రమ నడుప మందు
  నివియె నారోగ్య సూత్రముల్ కవుల కందు !

  రిప్లయితొలగించండి
 5. నేల నీరు నిప్పు గాలి యాకాశంబు
  నెల్ల కలుషితంబులే కద యిక
  అల నిరామయము మహాభాగ్యమను సూక్తి
  గాలి లోని మేడ గాదె మనకు

  రిప్లయితొలగించండి
 6. గురువుగారికి ధన్యవాదములు.
  నా సందేహం మీద స్పందించిన మిత్రులు, పెద్దలందరికీ ధన్యవాదములు,
  నమస్కారములు తెలుపుకుంటున్నాను.
  శ్రీ మురళీధరరావు గారికి
  నమస్కారములు.
  అద్వైత శాస్త్రప్రకారం తమరు చెప్పినది మాత్రమే నా బుద్ధిలో ఉండడం వల్ల నాకు సందేహము కలిగినది.
  శ్రీ శంకరుల వారి భక్తిశాస్త్రనిరూపణం గురించి నేను వినియుండలేదు. ప్రత్యేకంగా వినకపోయినప్పటికీ సాధారణంగా భాగవతుల చరిత్రలో మనకు కనిపిస్తున్నది అదే అయి ఉంటుందని ఇప్పుడనిపిస్తున్నది.
  మీకు అనేక ధన్యవాదములు.
  మీ రెండు పూరణలూ ఎప్పటిలాగే అపురూపంగా ఉన్నాయి.
  రెండవపూరణ ఎంతో నచ్చినది. మొదటిపూరణలోని పదముల ఉచ్ఛారణ దోషాల వల్ల జరిగే అనర్థం గురించిన ఉదంతం దయతో విస్తారంగా తెలియజేయగలిగితే అందరికీ ఉపకారం అవుతుంది.

  రిప్లయితొలగించండి
 7. అయ్యా, నిన్నటి పద్యరచనలో నా పద్యమునందున్న దోషము సూచించినందుకు ధన్యవాదములు.

  తృప్తితో వీడుమీ దేహమున్ లోకమున్,
  తృప్తినిన్ పొంది సందేహమున్ వీడుమా!
  తృప్తిచే మూర్తినిన్ దేవునిన్ చూడగా
  ప్రాప్తమౌ మోక్షముల్, పాయగా కర్మముల్.

  రిప్లయితొలగించండి
 8. ఆరోగ్యమ్మునొక మహా
  కారమ్మగు భాగ్యమంచు గరిపిరి బుద్ధుల్
  భారతదేశమ్మందున,
  నే రోగము లేక మనుట నింపగు నంచున్.

  రిప్లయితొలగించండి
 9. శ్రీ మురళీధరరావు గారికి
  ఇదే విషయం గురించి మీరు ఇంకొక చోట వ్రాసిన వ్యాఖ్య చూడకముందు నేను వ్రాసినాను.
  మన్నించండి .

  రిప్లయితొలగించండి
 10. క్షణము నిలువకుండ సర్వకాలములందు
  ధనము కూడబెట్టి దాచుకొన్న,
  తనువు నంటెనేని ఘనరోగజాలంబు
  లందగలడె సుఖము లవని జనుడు?

  శాస్త్రచయము చదివి సంస్కారములు నేర్చి
  యశము పొందుచున్న నిశయు పవలు,
  స్వాస్థ్యసుఖము లేక సంతృప్తి కలుగంగ
  బోవ దెవ్వరికిని పుడమిలోన.

  పదవులిన్ని పొంది ముదమందుచున్నాడ
  నాకు చింతలేదు నమ్ముడనుచు
  పలుకుచుండువాడు పరమాత్ముడైనను
  రోగియైన వాని భోగ మేమి?

  ఇల్లు పిల్ల లరయ నిల్లాలు బంధువుల్
  సఖులు వాహనాలు సర్వమున్న
  నవనిలోన నెప్పు డారోగ్యహీనుండు
  పొందలేడు సుఖము లెందుజనిన.

  ధరణిలోని సుఖము లరయంగ నన్నింట
  గొప్పదనుచు నిట్లు చెప్పవలయు
  ననుపమంపు విత్త మారోగ్యభాగ్యంబు
  మానవాళి కెప్పుడైన గాని.

  రిప్లయితొలగించండి
 11. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ పండిత నేమాని గురువర్యులకు పాదాభివందనములు జేయుచూ
  ఆయుర్వేద రహస్యములను దెలుసుకొని ఆహార నియమములు పాటించమని
  శంకరాభరణ బ్లాగు వీక్షకులకు, సత్కవులకు అందరూ ఆరోగ్యమును కాపాడుకొంటూ సుఖశాంతులను పొందమని నా మనవి

  ======*=======
  సోమ రసము ద్రాగి నరుడు సోమరియగు
  నాముదము ద్రాగిన మనుజుడమరు డనియు
  తామసుడు దెలుప, విడచె తంతులెల్ల
  చీమలకు దోమలకు జిక్కి చెదరు చుండె।

  జఠర మందగ్ని విషమాగ్ని జనులకెల్ల
  వాత పిత్త కఫము లెల్ల వంచు చుండు
  పాడు రుచుల వెంట దిరుగు ప్రాణి కోటి
  చరక నీతి విన్న గలుగు సకల సుఖము ( చరక = చరకుడు )

  పాడు వ్యసనములను నేర్చి పంజరమున
  మూడు మలములు నిలిపెడి మూర్ఖ జీవి
  మధుర,లవణ,కటు రుచుల మరుగు జొచ్చి
  విత్తి విత్తము లేనట్టి పిత్తజీవి
  (మధుర, లవణ , కటు= తీపి,ఉప్పు,కారము, విత్తి=జ్ఞానము)
  చింతలు వింతలు వీనుల
  జెంతను జేర్చక సుఖముల జేదండలతో
  సంతులి తాహారము దిని
  ససంతోష చక్రవర్తులై సుసంపద తోడన్

  రిప్లయితొలగించండి
 12. ఈనాటి అంశంపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  పండిత నేమాని వారికి,
  సుబ్బారావు గారికి,
  గన్నవరపు నరసింహమూర్తి గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
  వరప్రసాద్ గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 13. కాయము లేకున్న మనము
  చేయగలేమే? క్రియలను సేమము బడయన్!
  ఖాయముగ మహా భాగ్యము
  కాయపు యారోగ్యమదియె కర్మలు జేయన్!

  రిప్లయితొలగించండి