కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
రాముని పెండ్లి జరిగెను ధరాధరసుతతోన్.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
రాముని పెండ్లి జరిగెను ధరాధరసుతతోన్.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
మధురకందము:
రిప్లయితొలగించండిశ్రీమిథిలాపురవరమున శ్రీలు తనరగా
భూమిజతో శుభదినమున మోదమెసగగా
రాముని పెండ్లి జరిగెను ధరాధరసుతతో
సోముడు దీవనలిడెను విశుద్ధ మనముతో
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధర యను స్నేహితురాలి తో..ఒక వనిత..
రిప్లయితొలగించండిఈ మా భద్రాచలమున
మామము మాయత్త తోడ మాకనులారా
ప్రేమగ జూడగ వేడుక
రాముని పెండ్లి జరిగెను ధరా ! ధరసుతతో.
రారాజులు పైకెత్తని
రిప్లయితొలగించండిశ్రీ రుద్రుని విల్లు విరచె త్రిదశులు బొగడన్
కారణ జన్ముడు శ్రీ రఘు
రాముని పెండ్లి జరిగెను ధరాధరసుతతో
క్షేమంబొనరించెడు వి
రిప్లయితొలగించండిశ్వామిత్రుని వెంట నడచి సాహసుడై సు
స్థేమమున విల్లు విఱచన్
రాముని పెండ్లి జరిగెను ధరాధర సుతతోన్.
ధర = కొండ
ధరాధర = భూదేవి ( కొండను మోయునది )
శ్రీ లక్ష్మినారాయణ గారు "ర"కారము ప్రాస యనుకొని పొరబడినారు.
రిప్లయితొలగించండిశ్రీ సంపత్ కుమార్ శాష్త్రి గారు నా పొరపాటును తెలియజేసిన మీకు ధన్యవాదములు
రిప్లయితొలగించండిమార్చి వ్రాసిన ఈ పద్యము చూడండి
కోమల గాత్రా జానకి
శ్యామల గాత్రుని వలచె సయంవరమందున్
భూమీశులు జేజే లన
రాముని పెండ్లి జరిగెను ధరాధరసుతతో
' హైమవతి! ఘనముగను శ్రీ
రిప్లయితొలగించండిరాముని పెండ్లి జరిగెను! ' ధరాధరసుతతో
కామారి చెప్పె సీతా
రాముల కల్యాణ కథను రసరమ్యముగాన్.
కోమలి సీతకు వరుడన
రిప్లయితొలగించండిసోముని ధనువును ధరించు సూరుని గోరన్
భామను పరికించి విఱచ
రాముని పెండ్లి జరిగెను ధరాధర సుతతో!
నీమము వీడని రాముడు
రిప్లయితొలగించండిక్షేమమె యని గురువుమాట శిరసావ హించన్ ! !
సోముని విల్లును విరచగ
రాముని పెండ్లి జరిగెను ధరా ధర సుతతోన్ !
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈనాటి సమస్య పాదములో "ధరాధర సుత" అంటే పర్వతరాజ కుమార్తె "పార్వతి" అని అర్థము. కొందరు మిత్రులు ఈ అర్థమును గ్రహించినట్లు లేదు. స్వస్తి.
కోమలిపై వలపు బిగియ
రిప్లయితొలగించండిప్రేమగనానందమూరి పెండ్లిని కోరెన్!
యేమని జెప్పెద తారక
రాముని పెండ్లి జరిగెను ధరాధరసుతతోన్!!
తారక రాముడు = NTR
ధరాధరసుత = (లక్ష్మీ) పార్వతి
సామాన్యము కాదు వినగ
రిప్లయితొలగించండికాముని గెలిచిన పసుపతి కాలం జరుకున్ !
క్షేమము గలుగగ జగదభి
రాముని పెండ్లి జరిగెను ధరా ధర సుత తోన్ !
జిగురు వారి పద్యం అద్భుతం
మిత్రులారా!
రిప్లయితొలగించండిధరా అనే శబ్దము ఆకారంతముగా భూమి అని అర్థము. ధర అకారాంతముగ కొండ అని అర్థము. ధరాధరము అనినను కొండ అనియే రూఢియైన అర్థము. వేరొక అర్థములో వాడుటకు నవకాశము లేదని అని నా భావన. స్వస్తి.
మిత్రులారా!
రిప్లయితొలగించండిదేవతా మూర్తియైన పార్వతీ దేవిని ధరాధరసుత అని కాని వేరే అనేకమైన పర్యాయ పదములతో కానీ సంబోధించ వచ్చును. కానీ ఏదో ఒక మానవ వనిత పార్వతి అనే పేరుతో ఉంటే ఆమెను ధరాధరసుత అనుట ఉచితము కాదు అని నా భావన. స్వస్తి.
కవిమిత్రులకు నమస్సులు.
రిప్లయితొలగించండిఈమధ్యకాలంలో వరుసగా బంధువుల మరణాలు, ఊళ్ళు తిరగడం కారణంగా మిత్రుల పూరణలపై, పద్యాలపై వ్యాఖ్యలు వెంటవెంటనే ఇవ్వలేకపోతున్నాను. మన్నించాలి.
*
పండిత నేమాని వారూ,
సముచితమైన విరుపుతో మీ పూరణ ‘మధురంగా’ ఉంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణలో అర్థవిపర్యాయం ఉంది. ధరాధరసుత అంటే పార్వతియే.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
నేమాని వారి చెప్పినట్టు మీ పూరణలో ‘ధరసుత’ అన్నా పార్వతియే. సీత అనే అర్థంలో ‘ధరాసుత’ అనవలసి ఉంటుంది.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీరు కూడా పార్వతితో రాముని పెండ్లి జరిగినట్లు చెప్పారు పూరణలో.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
‘గిరికి ధరణి భారమా, ధరణికి గిరి భారమా, తరువుకు కాయ భారమా, కని పెంచే తల్లికి పిల్ల భారమా’ అని ఒక పాత సినిమాపాట ఉంది. మీ పూరణ చూడగానే అది గుర్తొచ్చింది. మీరు చెప్పిన అర్థంలో సీతను ‘ధరధరాసుత’ అనవలసి ఉంటుంది.
*
మిస్సన్న గారూ,
సమస్యను చక్కగా అవగాహన చేసికొని అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీరు కూడా ‘ధరాధర సుత’ అంటే సీత అని పొరబడ్డారు మొదటి పూరణలో.
జగదభిరాముడు శివుడైనా కావచ్చు. మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
మీ ప్రయత్నం ప్రశంసింపదగినది. కాకుంటే నేమాని అభ్యంతరాన్ని పరిగణనలో తీసుకోవాలి.
ఆ మైథిలితో దశరథ
రిప్లయితొలగించండిరాముని పెండ్లి జరిగెను; ధరా ధర సుత తోన్
సోముడు మోదము నిండగ
క్షేమంకర మనుచు నిండు సేసల కురిసెన్
ఈ మన యాలయ మందున
రిప్లయితొలగించండిరాముని పెండ్లి జరిగెను , ధరా ధర సుత తోన్
కాముని జంపిన శివునకు
ప్రేమగ మఱి యిచ్చి జేసె పెండిలి పెద్దల్
సోముని శిరమునఁ దాల్చెను,
రిప్లయితొలగించండికామునిఁ గూల్చెన్, గిరిసుత కామేశ్వరినిన్
ప్రేమగఁ గను నా త్రిపుర వి
రాముని పెండ్లి జరిగెను ధరాధరసుతతోన్.
మాస్టరు గారూ ! నేమాని గారూ ! ధన్యవాదములు. దోషమును సవరించుచున్నాను.
రిప్లయితొలగించండిప్రేమ ధరా సుత తోనే
రాముని పెండ్లి జరిగెను, ధరాధరసుతతో
సోముని పెండ్లియె జరిగె మ
రేమనినా దివ్య జంట లిరువురె కాదా !
భీమపు నాదము తోడన్
రిప్లయితొలగించండిరాముడు తనవిల్లు విరిచి రంజింపంగన్
సోముడు ముదమున జూడగ;
రాముని పెండ్లి జరిగెను;
ధరాధరసుతతోన్
సోముడు = శివుడు
ధరాధరసుత = పార్వతి
* భీమ నినాదము తోడన్
తొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
తొలగించండి