4, ఫిబ్రవరి 2014, మంగళవారం

సమస్యాపూరణం - 1314 (కాలొక్కటె కలదు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కాలొక్కటె కలదు మూడుకన్నులదొరకున్.

53 కామెంట్‌లు:

  1. కైలాసమ్మున తాండవ
    లీలల నలరారు వేళ ప్రియ భంగిమలో
    కాలిపయి కాలు భువిపై
    కాలొక్కటె కలదు మూడు కన్నుల దొరకున్

    రిప్లయితొలగించండి
  2. భూలోకావతరణమను
    మేలొనరింపగ శిరమున మిన్నేరమరెన్
    లీలగ లోకము లేలుట
    కాలొక్కటె కలదు మూడు కన్నుల దొరకున్

    రిప్లయితొలగించండి
  3. బాలుడడిగె పొడుపుకథను
    "కాలొక్కటె కలదు మూడు కన్నుల దొరకున్"
    వీలు పడిన చెప్పమనెను
    గోలను జేయుచు నొకడనె "కొబ్బరికాయే"!

    రిప్లయితొలగించండి
  4. చేలము ధరియించ కనే
    పాలాక్షుడు మసన మందు పాలన జేయన్
    కాలా తీతుం డాతడు
    కాలొక్కటి కలదు మూడు కన్నుల దొరకున్

    రిప్లయితొలగించండి
  5. జాలము వేయగ చేపలు
    వేలాదిగ చిక్కు పడెను వేయి రకమ్ముల్
    జాలరి సంతస మొందగ
    కాలొక్కటి కలదు మూడు కన్నుల దొరకున్

    రిప్లయితొలగించండి
  6. ఆలోకవర్మ యనియెడు
    బాలుడు తికమకను చెంది బడిలో పలికెన్
    వ్యాలాలంకృత ఘనునకు
    కాలొక్కటెకలదు మూడుకన్నున దొరకున్.

    రిప్లయితొలగించండి
  7. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరింపనున్నవి !

    లోక సంరక్షణార్థమై
    చిరునవ్వుల వెన్నెలలు చిలుకుతూ
    భర్తను విషం తాగమని అభ్యర్థించిన భార్య
    జగదంబే గదా యీ లోకంలో :

    01)
    ___________________________

    పాలింపగ సకల జగతి
    హాలాహలమును గొనుమని - యభ్యర్థించెన్
    హేలగ చిరునగవుల చిలు
    కాలొక్కటె కలదు మూడు - కన్నులదొరకున్ !
    ___________________________

    రిప్లయితొలగించండి
  8. శ్రీలక్ష్మి యనెడు బాలిక
    ఫాలంబున కన్ను జూచి పలికెను సఖితో
    బాలా! చూడుము రా, టీ
    కాలొక్కటె కలదు మూడు కన్నుల దొరకున్.

    రిప్లయితొలగించండి
  9. సతి సంగతి తెలిసిన పతి , రుద్రతాండవం చేస్తున్నప్పుడు :

    02)
    ___________________________

    హేళన జేయగ దక్షుడు
    జ్వాలలలో బడగ సతియె - ఝుంకించుచుచున్
    నేలను స్థిరముగ నానిన
    కాలొక్కటె కలదు మూడు - కన్నులదొరకున్ !
    ___________________________
    ఝుంకించు = భయపెట్టు

    రిప్లయితొలగించండి
  10. పండిత నేమాని వారూ,
    నాట్యభంగిమలో ఉన్న శివుణ్ణి వర్ణించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    హరి పవన్ కుమార్ గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    సలక్షణంగా, చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    శివుడు గంగాధరుడే కాని గంగాపతి కాదు. అతనికి భార్య పార్వతి ఒక్కర్తే! ఆ విషయాన్ని మీ పూరణలో ప్రస్తావించారు. బాగుంది.
    *
    గూడ రఘురామ్ గారూ,
    మీ పొడుపు, విడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పద్యాలూ నిర్దోషంగా చక్కగా ఉన్నాయి. అభినందనలు.
    కాని సమస్యాపరిష్కారం అయినట్టు తోచడం లేదు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    తికమక పడిన బాలుడి గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    శివుడు ‘టీకా’ వేసుకున్నట్టు భ్రమపడిన అమ్మాయి పూరణ కూడా బాగుంది. కాని టీకాలు బహువచనం, ఒక్కటె కలదు అని ఏకవచనం?
    *
    వసంత కిశోర్ గారూ,
    లోకంకోసం భర్తను విషం త్రాగమన్న ఆలు ఆమె ఒక్కర్తే. బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. వసంత కిశోర్ గారూ,
    తాండవ శివుడిని గురించిన మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘ఝంకించుచుచున్’ అన్నచోట ఒక ‘చు’ అధికమైనది. అక్కడ ‘ఝంకించుటకై’ అందామా? టైపాటు వల్ల ‘ఝ’ - ‘ఝు’ అయింది.

    రిప్లయితొలగించండి
  12. పవన్ కుమార్ హరి గారూ ! చక్కని పూరణ..చాలా బాగుంది..
    నేనూ మీబాటలోనే...

    ఆలన జేయగ లోకము
    పాలన జేయంగ తోడు పార్వతి యుండున్
    ప్రేలుట మానవదెందుల
    కాలొక్కటె కలదు మూడు కన్నుల దొరకున్.

    రిప్లయితొలగించండి
  13. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఒక్క ఆలిని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. మాస్టారూ, తెలుసుకోవాలనే ఉత్సాహంతో కూడిన సందేహం- "అతనికి" + "ఆలి" = అతనికాలి అవుతుందా లేక "అతనికి యాలి" అవుతుందా?

    రిప్లయితొలగించండి
  15. హాలహల గళధారి ఘ
    నాలోకేశ్వరియులర్థనారీశ్వరులై
    హేలాగతి యుండినతఱి
    కాలొక్కటి కలదు మూడు కన్నుల దొరకున్.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

    =============*================
    బాలు డొకడు ముని శాప వశుడైన పిదప గనంగ
    కాలొక్కటె కలదు,మూడు కన్నుల దొరకును బాగ
    పాలాభి షేకమ్ము జేయ భక్తి తోడ,మరల పొందె
    'కాలు'ని,కరివధను వలె కరములు జోడించి వేగ!

    రిప్లయితొలగించండి
  17. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య గారికి వందనములు

    లీలా కృష్ణుని నోటను
    కాలొక్కటి కలదు . మూడు కన్నులదొరకున్
    కాలొకటిభువిని రెండవ
    కాలు దిశల నింగి నేలు కాలుడు యనగన్

    రిప్లయితొలగించండి
  18. శ్రీయుతులు శంకరయ్య గారికి నమస్కారములు..
    మీ స్వాగతానికి ధన్యవాదములు.. ఇక నుంచి ఈ బ్లాగులో నేను కూడా భాగస్వామిని కావడం చాలా సంతోషంగా ఉన్నది..
    స్వస్తి

    రిప్లయితొలగించండి
  19. చంద్రశేఖర్ గారూ,
    ‘అతనికి + ఆలి = అతని కాలి, అతనికి నాలి’ అయ్యే అవకాశం ఉంది కాని యడాగమం రాదు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    అర్థనారీశ్వర రూపంలో శివునకు కాలొక్కటే అన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. ‘హాలాహల’ అంటే సరి. ‘ఘనాలోకేశ్వరి" ?
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    చంధస్సును మార్చి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘కాలును’ అనవలసింది. ‘కరి వధను వలె’ ?
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘కాలుడు + అనగన్’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘కాలుం డనగన్’ అంటే సరి!
    *
    హరి పవన్ కుమార్ గారూ,
    సంతోషం!

    రిప్లయితొలగించండి


  20. పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    మీసవరణకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  21. గురువుగారూ నాదో సందేహం. ఆలి యొక్కటే అనడం సరియైనదా ఆలొక్కటే అనడం సరియైనదా?

    రిప్లయితొలగించండి
  22. గురువుగారికి ధన్యవాదములు!

    'కాలు'ని = (కాలు)మరియు కాలుడు,కలిపి వ్రాసితినండి. గణపతి వలె పోయిన కాలు వచ్చినందులకు కరములు జోడించినాడు.

    రిప్లయితొలగించండి
  23. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈ నాడు శ్రీపంచమి (వసంత పంచమి) పర్వదినము కదా. సరస్వతి ప్రావిర్భవించిన మహా పర్వము. అందుచేత మనము అందరము ఆ పలుకుల తల్లికి వివిధ రీతులలో ఆరాధన చేయవలసి యున్నది. ఆ తల్లిని గురించి మంచి శబ్ద అర్థ శోభలలరారు పద్య స్తోత్రములను వ్రాద్దామా! అయితే ఇక ఆలస్య మెందులకు? మొదలు పెట్టండి. స్వస్తి

    రిప్లయితొలగించండి
  24. నా మనసులోని మాటను చెప్పినారు.

    శ్రీవాణీ! నిను నే భజింతును సదా చేకొమ్మ నాపూజలన్,
    నీ వీణాధ్వని తోడ శాంతినిడుచున్ నిత్యమ్ము పాలించుమా!
    నీవే నాకిక మార్గదర్శివనుచున్ నే నమ్మి యుంటిన్ మదిన్,
    దేవీ! విద్యనొసంగి నన్ కరుణతో దీవించు పద్మాసనీ!


    ఆలియు నుత్తమియౌ యి
    ల్లాలవగా లోటదేమి? లౌకిక రీతిన్
    కేలనొసంగని మధుప
    ర్కాలొక్కటె కలదు మూడుకన్నులదొరకున్.

    రిప్లయితొలగించండి

  25. మూ లన గల శునకమునకు
    కాలొక్కటె కలదు, మూడు కన్నుల దొరకున్
    కాలొక్కటె కనబడు మఱి
    లీలగ దాం డవము సేయ ప్రియముం గలుగన్

    రిప్లయితొలగించండి
  26. శారద మాతకు నమములు
    శారద! మఱి దయను జూడు శరణము నీవే
    తరియించుమమ్మ దీనుని
    కోరను నిక నేది నిన్ను కువలయ నేత్రా !

    రిప్లయితొలగించండి
  27. ఏలా గడుపుదు కాలము
    కాలొక్కటె కలదు, మూడు కన్నుల దొరకున్
    జాలేల లేదు నాపై
    బోలా శంకరు డటంచు బొగుడుదు రతనిన్.

    రిప్లయితొలగించండి
  28. నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండు పూరణలు (రెండవపూరణలో అన్యదేశ్యాలు వాడినా) బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘దొరకున్ ఏలా’ అని వ్ర్రాయడం సంప్రదాయం కాదుకదా. పోతన, మరికొందరు కవుల వలె ‘దొరక్కు న్నేలా’ అనవచ్చు ననుకోండి. అక్కడ ‘దొరకున్/ జాలికలుగ దెందులకో’ అన్నా బాగుంటుంది.
    *
    మిస్సన్న గారూ,
    నిజానికి అది ‘ఆలు + ఒక్కటె’. కాని మరో సందేహం ఆలు అన్నప్పుడు ఒక్కతె అనవలసి ఉంటుంది. కాని సమస్యలో ఒక్కటె అని ఉంది!
    *
    పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ వాణీస్తుతి మనోహరంగా ఉంది.
    మధుపర్కాలతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది.
    మీ శారదాస్తవం బాగున్నది. అభినందనలు.
    కాని మూడవ పాదంలో ప్రాస తప్పింది. ఆ పాదాన్ని ‘భారము నీదె తరింపుము’ అందామా?
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    కాలుడు తాండవ మాడగ
    కాలొక్కటె కలదు మూడుకన్నులదొరకున్
    తూలెడి భస్మాసురుగని
    కాలొక్కటి గాదు రెండు గలవని జూపెన్

    రిప్లయితొలగించండి
  30. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    ==============*=============
    అనుపమానవిద్యాప్రదాయిని!జనని!న
    ను దయ జూదు మమ్మ!వర జలధర వేణి!
    వాణి! నిలుపు నా నాలుక పై బలుకులు
    తల్లి! నలువ రాణీ!కల్ప వల్లి! దాస
    దాసులకు దాసుడను నేను ధరణి యందు!

    రిప్లయితొలగించండి
  31. వందే శారద పూర్ణచంద్ర వదనాం వందే విధాతృప్రియాం
    వందే సర్వకళామయీం భగవతీం వందే బుధారాధితాం
    వందే వాగ్విభవప్రదాం సురనుతాం వందే సువర్ణోజ్జ్వలాం
    వందే జ్ఞాన సరస్వతీం సుకవి హృత్పద్మస్థితాం భారతీం

    రిప్లయితొలగించండి
  32. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ హాస్యస్ఫోరకంగా ఉంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ వాణీ స్తుతి బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    సంస్కృతంలో మీ గురుస్తుతి, సరస్వతీ స్తుతి బాగున్నవి. అభినందనలు.
    ‘శంకరాద్వైత వ్యాపినం’ అన్నప్పుడు ‘వ్యా’ వల్ల ‘త’ గురువై గణదోషం ఏర్పడుతున్నది. అనుష్టుప్ అన్ని పాదాలలో ఐదవ అక్షరం లఘువై ఉండాలి కదా!

    రిప్లయితొలగించండి
  33. పండిత నేమాని వారూ,
    వాగ్విభవప్రదాయిని అయిన శారదకు వందనం చేస్తూ మీరు రచించిన శ్లోకం భక్తులకు నిత్యపారాయణంగా ఉండగలిగే యోగ్యతను కలిగి ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  34. శ్రీ నాగరాజు రవీందర్ గారి శ్లోకములు బాగుగ నున్నవి. అభినందనలు. కొన్ని సవరణలు:
    తొలి శ్లోకములో ఆఖరి పదము వ్యాప్తినంకి బదులుగా పోషకం అని మార్చితే బాగుంటుంది.

    2వ శ్లోకములో: 3వ పాదము: జిహ్వాంచలేస్థితాం వాణీం అని మార్చితే బాగుంటుంది.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  35. శ్రీ కంది శంకరయ్య గారికి శుభాశీస్సులు - ప్రశంసకు మా సంతోషము.

    రిప్లయితొలగించండి
  36. మాలగ మెడలో సర్పము
    నీలికురుల కొప్పులోన నిలుపుచు గంగన్
    హేలగ నర్తించునపుడు
    కాలొక్కటె కలదు మూడు కన్నుల దొరకున్.

    రిప్లయితొలగించండి
  37. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్య
    గారికి వందనములు

    శారదాస్తవము:

    వీణా పుస్తక పాణీ
    వాణీ సంగీత గీత వరదాయినివై
    జ్ఞానమ్ము నొసగు బ్రాహ్మీ
    ధ్యానింతుము మిమ్ము సర్వదా దయ జూడన్
    ఆదిశంకరుల్ నినుగొల్వవేదశాస్త్ర
    సారపార౦గతు౦ జేసి జ్ఞాని యవగ
    బ్రహ్మ సత్యమ్ముసుమ్మని ,భ్రాంతి జగము,
    జీవుడును ;బ్రహ్మ మున్ వేరు గావటంచు
    ఆర్ష ధర్మ౦ పు సూక్ష్మము నవనికొసగె
    శంకరాచార్య విరచిత స్తవము లన్ని
    అమరవాణిని మృదులమై నమరె గాదె
    నన్నయ తిక్కనాదులు ప్రణామము సేయగ నిచ్చినావు పే
    రెన్నిక గన్న కావ్యముల నింపు వహింపగ వ్రాయ వాక్సుధల్
    జెన్ను న ధారగా కురిసి చిత్తము మెచ్చగ బ్లాగు మిత్రుల౦
    దున్నకవిత్వ సాధకుల కున్నతి గల్గగ జేయు మంబరో

    రిప్లయితొలగించండి
  38. పండిత నేమాని వారూ,
    రవీందర్ గారి శ్లోకాలను ప్రశంసించి, సవరణలను సూచించినందుకు ధన్యవాదాలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ గారూ,
    ఖండికా రూపమైన మీ శారదాస్తవం చాలా బాగున్నది. “బ్లాగు మిత్రుల౦/దున్నకవిత్వ సాధకుల కున్నతి గల్గగ జేయు మంబరో” అనడం సంతోషాన్ని కలిగించింది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  39. గురువుగారన్నట్లు నేమాని పండితార్యుల శారదా శ్లోకం నిత్య పారాయణకు అత్యంతము యోగ్యమైనదిగా నున్నది.

    తిమ్మాజీ రావు గారి స్తవం ఉత్తమముగా నున్నది.

    లక్ష్మీ దేవి గారు మనోజ్ఞమైన ప్రార్థన చేశారు.

    సుబ్బారావుగారు, వరప్రసాదు గారు, రవీందర్ గారు సభక్తికమైన స్తోత్రాలను చేశారు.


    శారద! నీ పద ద్వయపు సన్నిధి నే శిరసుంచి మ్రొక్కెదన్
    భూరి కటాక్ష వీక్షణల పొల్పుగ నన్ గనుమమ్మ! నా హృదిన్
    జేరి చరించుచున్ సతము శ్రీకర భావములూర జేయవే
    భారతి! మాఘ పంచమిని ప్రార్థన జేసెద నమ్మ భక్తితో.

    రిప్లయితొలగించండి
  40. జాలము వేయగ జగతిని
    పాలాక్షుడు కలత జెంది పరి పాలింపన్
    హాలాహల మును మ్రింగగ
    కాలొక్కటి కలదు మూడు కన్నుల దొరకున్

    గురువులు క్షమించాలి

    రిప్లయితొలగించండి
  41. శ్రీ మిస్సన్న గారి పద్యము బాగుగ నున్నది. దానిని ఈ విధముగా సవరించుదాము:

    శారద! నీ పదాంబురుహ సన్నిధి నౌదల జేర్చి మ్రొక్కెదన్
    భూరి కటాక్ష వీక్షణల పొందికతో గనుమమ్మ! నా మదిన్
    జేరి చరించుచున్ సతము శ్రీకర భావ తరంగ రాజితో
    సార వచోవిభూతు లిడి సాకుము నన్ శుభదా! సరస్వతీ!

    రిప్లయితొలగించండి
  42. నేమాని పండితార్యా! శారదా కటాక్షము నాపై ప్రసరించేలా పద్యాన్ని మలచినందులకు ధన్యవాద శతము.

    రిప్లయితొలగించండి
  43. మిస్సన్న గారూ,
    మీ శారదా స్తుతి మనోహరంగా ఉంది. నేమాని సవరణతో మరింత సింగారించుకున్నది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  44. చెలి సగభాగంబవ్వగ
    కాలొక్కటెకలదు, మూడుకన్నులదొరకున్
    చెలికాలును తనకాలును
    కలిపియె తాండవముచేయు కమనీయముగన్

    రిప్లయితొలగించండి
  45. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    కమనీయంగా పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  46. శ్రీ వాగ్దేవి! సరస్వతి!
    భావంబున నిన్ను గొలుతు భవదాశీస్సుల్
    దేవీ! నాకిడి దయతో
    నా వాక్కులలోన నిలిచి నను బ్రోవమ్మా!

    రిప్లయితొలగించండి
  47. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ వాగ్దేవీ స్తుతి బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  48. శ్రీ వరప్రసాద్ గారి పద్యము - సంస్కరణలతో:

    సకల విద్యా ప్రదాయిని! శారదాంబ!
    వాణి! కలవాణి! శుకపాణి! భ్రమరవేణి!
    నీదు దాసానుదాసుడ నిన్ను గొలుతు
    నమ్మ! దయగని వాగ్వైభవమ్ము నిమ్మ!

    రిప్లయితొలగించండి
  49. లీలా నాటక కేళికి
    ఫాలాక్షమెగాక నంది వాహను జేతన్
    శూలంబనంగ తగు చొల
    కాలొక్కటెగలదు మూడు కన్నుల దొరకున్
    (చొలకాల=బండి తోలు నపుడు ఎద్దులను నియంత్రేచిది)

    రిప్లయితొలగించండి
  50. సహదేవుడు గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  51. భోలా శంకరుడనబడి
    యాలోచించక వరముల నటునిటు నొసగున్
    వీలుగ గెలుచుటకై కా
    కాలొక్కటె కలదు మూడుకన్నులదొరకున్


    కాకా : (శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి 2004)

    "కార్యసాధనకై చేయు మిక్కిలి సేవ."

    రిప్లయితొలగించండి
  52. ఆలోచించక వరమిడి
    కైలాసమ్మున పరుగిడ గాభర పడుచున్
    నేలను నొకపరి తాకెడి
    కాలొక్కటె కలదు మూడుకన్నులదొరకున్

    రిప్లయితొలగించండి