16, ఫిబ్రవరి 2014, ఆదివారం

సమస్యాపూరణం - 1325 (తల్లినిఁ గూడి చిత్రముగ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తల్లినిఁ గూడి చిత్రముగఁ దామరసాక్షులఁ గాంచె మువ్వురన్.

21 కామెంట్‌లు:

  1. తల్లులు ముజ్జగంబులకు తారు భవానియు, వాణి, లక్ష్ము లీ
    యెల్లర గావబూని భువికేగిన యట్టుల తీర్చియుండ నా
    పల్లెకు జేరి యొక్కరుడు భక్తియు, శ్రద్ధయునూని వృద్ధయౌ
    తల్లిని గూడి, చిత్రముగ తామరసాక్షుల గాంచె మువ్వురన్.

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    పిల్లలజేసి జన్నిడెనుప్రేమగ నత్రి మహర్షిపత్నియా
    కల్లరి విప్రులాసతి దిగంబరియై తమకోగిరంబిడన్
    ఖుల్లము సేయ. వార్త వినికూర్మిసతుల్ పతి గోర బాలురా
    తల్లితొ గూడి చిత్రముగ తామరసాక్షుల మువ్వురన్ గనెన్.

    రిప్లయితొలగించండి
  3. వల్లియు, నామెచెల్లియగు భారతి, యక్క సుహాసినీత్రయం
    బెల్లసులక్షణాఢ్యలిక నింపులు,సొంపులు గుల్కువారలౌ
    యిల్లలితాంగులందు మనసెవ్వతె దోచునొ యంచు నాతడున్
    తల్లిని గూడి, చిత్రముగ తామరసాక్షుల గాంచె మువ్వురన్.

    రిప్లయితొలగించండి
  4. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    ఎల్లిదునై నరుండయితినీధర శాపము చేతనే కదా !
    యుల్లము నల్లిబిల్లియననుత్సుకతన్ పురికొల్పుచున్న దే
    నెల్లి నుతింతు నన్వసువు యేగి ప్రయాగను తన్వితీరగా
    తల్లినిఁ గూడి చిత్రముగఁ దామరసాక్షులఁ గాంచె మువ్వురన్.

    రిప్లయితొలగించండి
  5. మరొక పూరణ

    కొల్లలుగా విరోధముల గూర్చుచు లోక సురక్షనార్ధమై
    యుల్లమునల్లిబిల్లిగనె నూగగ చక్కని పాట పాడువా
    డెల్లలు లేవు నా కనుచునేగి ప్రయాగను సంగమంబులో
    తల్లినిఁ గూడి చిత్రముగఁ దామరసాక్షులఁ గాంచె మువ్వురన్.

    రిప్లయితొలగించండి
  6. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    ”కల్లలుకావు మిత్ర!సురకాంతలుమువ్వురు సత్త్రమందు తా
    మెల్లరుస్నానమాడి యట నీశ్వరి కోవెల బూజ సేయగా
    తల్లి వరమ్మునిచ్చెపతి దండుడట౦చును, చాటు మాటుగా
    నల్లననేను గాంచితిని, యంబరమందున దేవరాజుయున్
    తల్లినిగూడి చిత్రముగ తామరసాక్షుల మువ్వురన్ గనెన్.”

    రిప్లయితొలగించండి
  8. పిల్లలఁ గాచి పోషణనుఁ బ్రేమగ చేయునదేరి జెప్పితిన్?
    చిల్లర నెట్లు చేర్చవలె? చిక్కునదెట్టుల తీర్చినావొకో,
    పల్లెలఁ జేరి యన్యుడిట పాలనఁ జేసెడు గ్రామదేవతల్-
    తల్లినిఁ, గూడి, చిత్రముగఁ? దామరసాక్షులఁ గాంచె మువ్వురన్

    రిప్లయితొలగించండి
  9. పల్లెను గ్రామ దేవతకు పండుగ జేసెడి వేళ భక్తితో
    చల్లని తల్లి నీవనుచు శారద లక్ష్మి భవాని రూపులన్
    తెల్లము గాగ తత్త్వమట తీరిచి దిద్దగ పట్నవాసి తా
    దల్లినిఁ గూడి, చిత్రముగఁ, దామరసాక్షులఁ గాంచె మువ్వురన్.

    రిప్లయితొలగించండి
  10. పిల్లడ నీకు తొందరగ పెండిలి జేసెద రమ్ము వేగమే
    పిల్లను జూడ నీవనగ వీడి విదేశము జేరి యూరికిన్
    తల్లినిఁ గూడి చిత్రముగఁ దామరసాక్షులఁ గాంచె మువ్వురన్
    పిల్లల, రూప యౌవన వివేకము లందున మించువారలన్.

    రిప్లయితొలగించండి
  11. మెల్లని పిల్లివోలె చని మీగడ పాలను దొంగిలించె నీ
    నల్లని పిల్లడంచు వెస నాతులు మువ్వురు చెప్పగానె తా
    నల్లన పిల్చెబాలకుని, ఆ హరి చెచ్చెర వచ్చియింటికిన్
    తల్లినిగూడి చిత్రముగ తామరసాక్షులు గాంచె మువ్వురన్

    రిప్లయితొలగించండి
  12. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ చదువుతూ ఉంటే ఏదో జానపద కథను చదివినట్లుంది. బాగుంది పూరణ. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. పిల్లలుగా త్రిమూర్తులను చేసిన పిమ్మట నూయలూపుచున్
    లల్లిల లాలలాలి యనసూయయె పాడుచు నుండగా బిరన్
    తల్లడిలంగ వాణి సతి తాసిరి వచ్చిన బోసినవ్వుతో
    తల్లిని గూడి, చిత్రముగ తామరసాక్షుల గాంచె మువ్వురన్.

    రిప్లయితొలగించండి
  14. పల్లెకు బోయి వత్తునని భానుని రాకకు వేకువన్ జనన్
    చల్లని పైర గాలిమది సంతస మొందుచు నాలయం బునన్
    మల్లెల మాలలందు చిరు నవ్వుల దేవత వీక్షణం బులన్
    తల్లిని గూడి చిత్రముగ దామర సాక్షుల గాంచె మువ్వురన్

    రిప్లయితొలగించండి
  15. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
    కాని... 1, 2 పాదాలలో గణదోషం. ఆ రెండు పాదాలకు నా సవరణ......
    పిల్లలుగా త్రిమూర్తులను ప్రేమగ జేసియు నూయలూపుచున్
    లల్లిల లాలలాలి యని లాలిని తా ననసూయ పాడగా....
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. గురువర్యా...అవునండీ.. త్వరపాటులో దోషములు దొరలినవి..బహు చక్కని సవరణలు చేశారు..ధన్యవాదములు. మీరు చూపిన సవరణలతో...

    పిల్లలుగా త్రిమూర్తులను ప్రేమగ జేసియు నూయలూపుచున్
    లల్లిల లాలలాలి యని లాలిని తా ననసూయ పాడగా
    తల్లడిలంగ వాణి సతి తాసిరి వచ్చిన బోసినవ్వుతో
    తల్లిని గూడి, చిత్రముగ తామరసాక్షుల గాంచె మువ్వురన్.

    రిప్లయితొలగించండి
  17. పిల్లల పెండ్లి చేయుటకు వేదిక నొక్కటి పొందుచేయగా
    మెల్లగ వచ్చి చేరిరట మిక్కిలి యందము గల్గు మువ్వురే
    పిల్లల జూడవచ్చెనొక పెండ్లి కుమారుడు చెల్లితోడుతన్
    తల్లిని గూడి, చిత్రముగ దామరసాక్షుల గాంచె మువ్వురన్!

    రిప్లయితొలగించండి
  18. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. చిన్న సవరణతో...

    పిల్లల పెండ్లి చేయుటకు వేదిక నొక్కటి పొందుచేయగా
    మెల్లగ వచ్చి చేరిరట మిక్కిలి యందము గల్గు మువ్వురే
    పిల్లల జూడవచ్చెనొక పెండ్లి కుమారుడు చెల్లి తమ్ముడున్
    తల్లిని గూడి, చిత్రముగ దామరసాక్షుల గాంచె మువ్వురన్!

    రిప్లయితొలగించండి
  20. చల్లని శీతకాలమున చక్కని కాంతలు మువ్వురచ్చటన్
    పిల్లియు కోతియున్ పులియు బింకము మీరగ కన్నులార్పగన్...
    పిల్లడు జంతుశాల చని ప్రీతిని వారికి ఫోటొ తీయుటన్
    తల్లినిఁ గూడి, చిత్రముగఁ దామరసాక్షులఁ గాంచె మువ్వురన్ :)

    రిప్లయితొలగించండి