17, ఫిబ్రవరి 2014, సోమవారం

సమస్యాపూరణం - 1326 (వార మన రెండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వార మన రెండు దినములు వారిజాక్ష.

27 కామెంట్‌లు:

  1. చమత్కారంగా All entertainments are only on weekends అనుకొన్నట్లు:
    వారమన రెండు దినములే వాస్తవమున
    ఐదుదినములు పనిఁజేసి అలసి సొలసి
    ఈసురోమని ఇల్లాలి కిక మొగంబు
    చూప లేకనా రొవనాడు సొల్లుగార్చు
    మగఁడు సరుకులేక యనెడు మాటలివియె
    “వారమన రెండు దినములు వారిజాక్ష!”

    రిప్లయితొలగించండి
  2. ఇంట నుండిన జాలును కంటి యెదుట
    భయము వలదంటి నీవెంట బడను నేను
    లంచి కటుబోయి చలన చిత్రమ్ము గాంచి
    తిరిగి వత్తుము రావయ్య కరిగి నీవు
    వార మనరెండు దినములు వారి జాక్ష

    రిప్లయితొలగించండి
  3. సుంత యైనను లేదను చింత యేల
    తినుట, కచ్చోట పెండ్లిని కనుము రమ్ము
    భవ్యమౌరీతి భుజియింపవచ్చు పెండ్లి
    వారమన, రెండుదినములు వారిజాక్ష!

    రిప్లయితొలగించండి
  4. చంద్రశేఖర్ గారూ,
    మీ వారాంతపు సంబరాల పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఆరవనాడు’ టైపాటువల్ల ‘ఆరొవనాడు’ అయింది.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    పెండ్లివారమంటూ వైవిధ్యంగా చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. అల్లదే ప్రభుత్వంపు కార్యాలయమట
    అన్ని రకముల అవినీతి అక్రమముల
    కాటపట్టది పని దినాలందు బళిర!
    వార మన రెండు దినములు వారిజాక్ష!

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారూ,
    ప్రభుత్వకార్యాలయల పనితీరును వివరిస్తూ మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. నాకు నుద్యోగమది వచ్చె నాథ వినుము
    నెలకు పదినైదు వేలిచ్చు నేను " క్లర్కు "
    శలవులున్నవి వారాన శనియునాది
    వారమన రెండు దినములు వారిజాక్ష!

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    వారముల పేర్లు ఏడుగా వాసిగాంచ
    అయిదు ఆఫీసులో నిద్ర కయినవి కద
    రెండు రోజులు సతిబాధ లుండుగాక
    వార మన రెండు దినములు వారిజాక్ష.

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    వారానికి రెండురోజుల సెలవన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    సతిబాధతో గడిపే ఆ రెండు దినాల వారంరోజుల పెట్టు అంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    రెండు పనిదినాల వారాన్నిగురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. నేత పదవిలో విరివిగా మేత మేయ
    తల్లి కరుణయు తనపైన త్రగ్గె నేని
    శిక్ష నొందుచు చెఱసాలఁ జిక్కి నపుడు
    వార మన రెండు దినములు వారిజాక్ష !

    రిప్లయితొలగించండి
  11. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘త్రగ్గు’ టైపాటా?

    రిప్లయితొలగించండి
  12. గురువు గారూ ! అది పొరబాటే ,మన్నించండి . తగ్గె నేని గా సరి దిద్దండి !

    రిప్లయితొలగించండి
  13. చంద్రశేఖర్ గారూ ! అది నిద్ర మత్తే ! చంద్రభాసురము కాదు ! వెన్నెల మహిమే !

    రిప్లయితొలగించండి
  14. గన్నవరపు వారూ,
    పాపం... చంద్రశేఖర్ గారేమీ అనేలేదే... మీకు మీరే భుజాలు తడుముకుంటున్నారు... :-)

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    "వారమన రెండు దినములే వారిజాక్ష"
    యనుచు, తిరుమల వేంకటేశునకు సేవ
    లనుచు, విడువక నర్చనల్, దినములేడు,
    గంట లిరువదినాలుగు, వెంటబడుట
    పాడి యౌనేమొ తెలుపుడు భక్తులార
    నిముస మైనను నిదుర బోనీరు మీరు

    రిప్లయితొలగించండి
  16. తగవు వలదయ్య నాతోటి మగడ నీకు
    వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు గాదె
    తెచ్చుకున్నాను కొలువును తెలివితోడ
    ఇచ్చుచున్నాను నాకాల మిఛ్ఛతోడ
    వారమునరెండు దినములు వారిజాక్ష


    రిప్లయితొలగించండి
  17. వారమన రెండు దినములు వారి జాక్ష !
    మనము పోవుట యాత్రకు మంది గూడి
    చూడవలసిన వన్నియు సొంపు మీర
    వ్రాసి యుంచుము నొకచోట వాసిగాను

    రిప్లయితొలగించండి
  18. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారి పూరణ....

    పిల్ల లెక్కువ కన్నట్టి వెతల వలన
    నప్పు లెన్నున్నవో చెప్ప నలవి కాదు
    జీతమును పొందిన నెలలో సిరులు గలుగు
    వారమన రెండు దినములు వారిజాక్ష

    రిప్లయితొలగించండి
  20. సహదేవుడు గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. వారమనగ దినము, సప్త వారములను
    గలిపి సప్తాహమందురు కలవు వాని
    యందున రవి, శివుని నామ మాది సోమ
    వార మన రెండు దినములు వారిజాక్ష !

    రిప్లయితొలగించండి
  22. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    సోమవారం చంద్రుని పేర కదా ఏర్పడింది. సోముడంటే శివుడనే అర్థం ఉందనుకోండి. కాని రూఢ్యర్థం చంద్రుడే. శివుణ్ణి సోమశేఖరు డంటాం కదా..

    రిప్లయితొలగించండి
  23. తప్పిదమే గురువుగారు తొందరపడి వ్రాయడం జరిగింది. సవరణతో..

    వారమనగ దినము, సప్త వారములను
    గలిపి సప్తాహమందురు కలవు వాని
    యందున రవి చంద్రుల నామ మాది సోమ
    వార మన రెండు దినములు వారిజాక్ష !

    రిప్లయితొలగించండి
  24. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి, పండిత నేమాని గురుదేవులకు నమస్కృతులు......
    దయచేసి నేను చేసే ప్రయత్నములో భావ, గణదోషములను సవరించి ప్రోత్సహించ మనవి..

    వారమన ఏడు దినములు వచ్చు నెపుడు
    సోమ మంగళ బుధ గురు శుక్ర శనియు
    వెంట ఆది వారమ్ములవి, శని ఆది
    వారమన రెండు దినములు వారిజాక్ష

    రిప్లయితొలగించండి