14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

పద్య రచన – 507

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. అన్నదమ్ముల వోలె ఆర్టిస్టు లిద్దరు
    కన్నవారి కడుపు నిండ జేసె; సినీ జగత్తులొ
    నెన్న వారిరువురు ఎంతొ పేరును బొంద
    ఉన్నవారు గానమూర్తి మధ్యన నున్నవారు.

    రిప్లయితొలగించండి
  2. వారి నటన ప్రతిభ ఫాటలో పలికించు
    ఘంటసాల వారు ఘనముగాను
    గాత్రమునకు తగ్గ గాంభీర్యమౌ నటన
    నెంటియారు చేయు నేయెనారు.

    రావులు మువ్వురు సినిమా
    జీవితమున రాజులగుచు జీవించిరిగా
    రావలయు మరల వారలు
    కావలెనని కోరుచుండెగా తెలుగిళ్ళే.

    రిప్లయితొలగించండి
  3. ఘంట సాల వారి గాత్ర సంపద తోడ
    అక్కినేని నటన మెక్కుడాయె,
    రామ రావు గారు రాగాలు దీసెను,
    తెలువారి ప్రతిభ వెలిగె భువిన

    రిప్లయితొలగించండి
  4. ఒకరు ధర్మదాతనొకరు దానకర్ణ
    గాన గంధర్వ రారాజు ఘంటశాల
    కలసి చిత్రసీమనలరించు ఘనులు వీరు
    మరచి పోలేము మువ్వురి మధుర చరిత

    రిప్లయితొలగించండి
  5. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
    =============*================
    అన్న గారు నిలచె నఖిలాంధ్రులు మెచ్చు
    అక్కినేని గారి ప్రక్క, నడుమ
    నిలువ కరము లంది,నేత్ర పర్వము గాను
    ఘంటసాల గారు గనుడు ముందు!

    రిప్లయితొలగించండి
  6. నందమూరి మఱియు నాగేశ్వ రుండును
    ఘంటసాల వారు గాని పించ
    రార్య ! యందనంత దూర మే గిరిగద
    వంద నంబు లిడుదు వంద లాది .

    రిప్లయితొలగించండి
  7. నందమూరితోడ నాగేశ్వరుండును
    నడుమ ఘంటశాల నగుచు నిలిచె
    తెలుగు చలన చిత్రపు తేజమ్ములేవీరు
    విశ్వ మంత తెలియు వీరి ప్రతిభ


    రిప్లయితొలగించండి
  8. రావుత్రయమును(రావులు మువ్వురు) గాంచుడు
    ధీవైభవనిధులు భువిని స్థిరయశులగుచున్
    జీవనము కళల కర్పణ
    గావించిన వారు వీరు ఘనులన్నింటన్. 1.

    వరుస నందమూరివంశాబ్ధి చంద్రుండు
    యావదాంధ్రభూమి ననుపమమగు
    ఖ్యాతి నంది తెలుగుజాతికి జగతిలో
    ఘనత గూర్చిపెట్టు కర్మఠుండు. 2.

    తారకరామారావను
    పేరున నటుడౌచు వెలిగి విపులాదరమున్
    గౌరవము గాంచి నాయక
    ధీరుండై యవనిఁ దెలుగు తేజము చాటెన్. 3.

    రాముడై కృష్ణుడై రణరంగభీముడై
    ..........సోముడై సన్మునిస్వామి యౌచు,
    పౌరుడై వ్యవసాయదారుడై వీరుడై
    ..........శూరుడై సంగీతకారుడౌచు,
    నేతయై భువనాల జేతయై మిత్రుడై
    ..........త్రాతయై విశ్వవిఖ్యాతుడౌచు,
    పేదయై దాతయై విజ్ఞసత్తముడౌచు
    ..........మోదకారకుడై వినోది యౌచు
    ఒక్కటననేల పాత్రలు పెక్కులిట్లు
    చిత్రములయందు పోషించి సిరులు గాంచి
    ఆంధ్రదేశాన "నటరత్న"మౌచు యశము
    లంది యున్నట్టి యాంధ్రుండు నందమూరి. 4.

    పౌరాణికములైన చారిత్రకములైన
    ..........సామాజికములైన సత్యమిద్ది
    పాత్రలెట్టివియైన వాటిలో లీనుడై
    ..........ప్రియముగూర్చెను సదా ప్రేక్షకులకు
    వచనమాధురితోడ రుచిరాభినయముతో
    ..........దేహసౌందర్యంపు దీప్తితోడ
    నటనలో మేటియై నవ్యమార్గములంది
    ..........హర్షమందించువా డక్కినేని
    అతడు నాగేశ్వరుండు తానభినయమున
    ఘనుడు, "సమ్రాట్టు"గా కీర్తి గాంచినట్టి
    నటశిఖామణి సత్కళానైష్ఠికుండు
    మాన్యుడౌచును బ్రతికిన ధన్యజీవి. 5.

    మధుబిందునిభములై మానసంబులు దోచు
    ..........నెవ్వాని వచనంబు లెల్లవేళ,
    అమృతోపమానమై హాయిగొల్పుచునుండు
    ..........నెవ్వాని గాన మీ యిలను జూడ,
    నిత్యప్రసన్నమై నిర్మలంబై వెల్గు
    ..........నెవ్వాని ముఖసీమ యింపుమీర,
    సన్నుతి కర్హముల్, సద్భావపూర్ణంబు
    ..........లెవ్వాని కృత్యంబు లెల్లగతుల
    అతడు మహనీయచరితుడై యవనిలోన
    ననుపమంబైన యశముల నందియున్న
    సద్గుణాఢ్యుడు సంగీతచక్రవర్తి
    ఘనుడు సుందరహృదయుడు ఘంటసాల. 6.

    నోరు తెరచిన సంగీతసౌరభంబు,
    పలుకులందున మధువులు చిలుకునట్టి
    మధురగాయకు డన్నింట మహితగుణుడు
    వేంకటేశ్వరరాయు డా విజ్ఞవరుడు. 7.

    నందమూరిని సంతతానందయుతుని,
    అక్కినేనిని నాగేశ్వరాఖ్య ఘనుని,
    ఘంటసాలను నిత్యమింటింట జనులు
    స్మరణ చేయుట సర్వథా సముచితంబు. 8.

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    ఎన్టి ఎన్నార్ల గానమై ఘంటసాల
    బాస పలుకుల నొప్పెడి భావమగుచు
    తెలుగు పాటల ఠీవిని వెలయ జేసె
    దేశ దేశ మ్ము లందున దీటు గాను

    నవ రసమ్ములు మెప్పి౦చు నా యకులుగ
    తెనుగు చలచిత్రసీమ నేలిన నటకులు
    ఎన్టి ఎన్నార్ల విఖ్యాతి నెన్న తరమె
    శివుడుముగురిని తన సభను జేర్చు కొనియె

    రిప్లయితొలగించండి
  10. చిత్రసీమకు కళ్ళుగా చెల్లవారు
    చెల్లె ముక్కంటి వలె తాను సీమమెరయ
    కనగ నాపాత మధురాలు , వినగ తోచు
    రావు లోరి త్రయము చిరంజీవులనగ

    రిప్లయితొలగించండి
  11. అన్నదమ్ములవోలెతా మున్నతముగ
    తెలుగు చిత్రసీమకు సేవ సలిపి నారు
    రామరావును, నాగేశ్వ రావు, ఘంట
    సాల, లేరు వారికి సాటి తెలుగు నాట

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులకు నమస్కృతులు.
    రెండు రోజులు మేడారం సమ్మక్క సారలక్క జాతరకు వెళ్ళి రాత్రి తిరిగి వచ్చాను. మొన్న కాసేపు ఒకరి లాప్‍టాప్‍లో బ్లాగును కాసేపు చూచే అవకాశం దొరికింది.
    పూరణలు, పద్యాలను వ్రాసిన
    రఘుకుమార్ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    శైలజ గారికి,
    వరప్రసాద్ గారికి,
    సుబ్బారావు గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    సహదేవుడు గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి