15, ఫిబ్రవరి 2014, శనివారం

పద్య రచన – 508

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. కొడుకు వలచిన గాదిలి కోడ లివని
    గార వించితి నాయింట గౌరి వనుచు
    కొరివి దయ్యాని వైతివి శిరము పైన
    నేటి కోడలె యత్తకు చేటు యనక

    రిప్లయితొలగించండి
  2. పటపట పండ్లు కొరికెన్
    కటకట! మందర పలుకులు కైకయె వినగన్
    నటవికి రాముని పంపగ
    కటువుగ యుండనుచుబల్కె కపటపు బుధ్ధిన్

    రిప్లయితొలగించండి
  3. కపట నాటకమందున కథను మలుపు
    త్రిప్పు సంఘట నిది లేక చెప్పలేము
    రామచరితము, చంపగ రావణుడిని
    బీజమిక్కడ వేసె శ్రీ ప్రియుడు కనుడు

    రిప్లయితొలగించండి

  4. చిన్న సవరణ..

    పటపట పండ్లన్ కొరికెన్
    కటకట! మందర పలుకులు కైకయె వినగన్
    నటవికి రాముని పంపగ
    కటువుగ యుండనుచుబల్కె కపటపు బుధ్ధిన్

    రిప్లయితొలగించండి
  5. కైక శయ నించు చోటకు వేగముగను
    మందరేతెంచి యామెతో మగువ ! వినుము
    రాము నడవికి బంపను రాజు జేరి
    యీ యవలసిన వరమును నిప్పు డడుగు

    రిప్లయితొలగించండి
  6. మందర విషయము నందించినంత
    సుందరి కైకేయి మనంబు స్రుక్కదజేసెన్,
    తొందరపడి యా సతి యక్కడె
    నిందించెను ధరణీపతి నిముసములోనన్.

    రిప్లయితొలగించండి
  7. శ్రీరామున కారాజ్యపు
    భారంబును కట్టబెట్టు భాగ్యమునందున్
    ధీరుడు దశరథభూపతి
    తోరపు హర్షాతిశయముతో నున్నపుడున్ 1.

    చెనటి మంథర కైకను చేరి యిట్లు
    పలుకసాగెను క్రోధాన పడతి నీవు
    లెమ్ము నిద్రింపగానేల యిమ్మహినిక
    కష్టకాలము మున్ముందు కాంచ గలవు. 2.

    నాప్రాణనాథుండు నాదైవ మాతండు
    ..........ప్రేమానురాగాల ధామ మతడు,
    సవతులందరిలోన సన్మానమందించి
    ..........గౌరవించును నన్ను ఘనముగాను,
    నామాట జవదాట కామోదమును దెల్పి
    ..........యేమి కోరినగాని యిచ్చుచుండు,
    నేనె సర్వస్వంబు నిక్కమియ్యదియంచు
    ..........సంతసించెదవేల సన్నుతాంగి!
    మూర్ఖురాలవు బేలవై మోదమంద
    దగునె? యాతడు నాథుండె? పగతునివిధి
    నిన్ను వంచించు చున్నాడు నిజము కనుము
    భర్త రూపాన నున్నట్టి వైరి యతడు. 3.

    యువరాజపీఠాన నవనీశుడక్కటా!
    ..........రామచంద్రుని నిల్ప రయముతోడ
    ఆదేశములు చేసె నభిషేక కార్యంబు
    ..........జరుగనున్నది రేపు తరుణి! వినుము
    మాయమాటలు చెప్పి మమకారమును జూపు
    ..........కైకేయి! యాతండు కపటి నిజము
    రమణి! భావిని నీకు రాబోవు కష్టముల్
    ..........తలచి యోర్వగలేని దాన నగుట
    హితము కోరుచుండి సతతసౌఖ్యము గూర్చు
    తలపుతోడ నేను పలుకుచుంటి
    రామచంద్రమూర్తి రాజ్యాభిషేకంబు
    జరుగనీయ రాదు సర్వగతుల. 4.

    అనుచు మంథర వచియించ నమితముగను
    హర్షమందుచు విలువైన హార మొకటి
    అందుకొనుమంచు కైకేయి యామె కొసగి
    మంచివార్తను తెలిపినావంచు బలికె. 5.

    రామచంద్రునికన్న రమణీయగుణుడెవ్వ
    ..........డతడు పుత్రుడునేను నంబగాదె?
    భరతుడెట్టులొ నాకు పావనచరితుడౌ
    ..........రాముడట్టులె భేదమేమి లేదు,
    పరమాత్మతుల్యుడై సరసుడై వెలుగొందు
    ..........శ్రీరామచంద్రుని సేవలోన
    తరియించు భాగ్యంబు భరతుని కబ్బిన
    ..........ధన్యుడై వెలుగు నా తనయు డవని
    నింతకంటెను వేరొక్క టిహమునందు
    సౌఖ్యదాయక మగునేమి? సర్వగతుల
    రామ పట్టాభిషేకంబు భూమిజనుల
    కన్నివేళల శుభకర మనెను కైక. 6.

    అని పలికిన కైకేయిం
    గని మంథర మూర్ఖురాల! ఘనతాపమునన్
    మునుగం దగు సమయంబున
    ననుపమమగు రీతి హర్ష మందెదవేలా? 7.

    రాజ్యాధిపతి యౌచు రామంచంద్రుండుండ
    ..........బంటౌను సర్వదా భరతు డికను
    కౌసల్య మాతయై గౌరవంబును పొందు
    ..........దాసివౌదువు నీవు తథ్యమిద్ది
    వర్ణింప దరమౌనె వసుధలో దాస్యాన
    ..........కలుగబోయెడి తీవ్ర కష్టతతులు?
    నీపట్టి రాజైన నిత్యసౌఖ్యము గాంచి
    ..........హాయినందగవచ్చు ననవరతము
    అనుచు మంథర దుష్టయై యామె హృదిని
    విషము నింపంగ కైకేయి విస్తృతమగు
    క్రోధమును బూని రయమున కోపగృహము
    చేరె భర్తను సాధించు కారణమున. 8.








    రిప్లయితొలగించండి
  8. కపటి మంధర జేరెను కైక చెంత
    మాయ మాటలు బల్కుచు మమత త్రుంచి
    కైక మనసుని రగిలించి కసిని బెంచి
    రాము నడవికి బంపగ రచన జేసె

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    దుర్బోధజేయ మంధర
    దౌర్బల్యత కైక బంపె దవముకు రామున్
    బర్బరదనుజులు హతమవ
    అర్బుదములు ప్రాణు లన్ని నానందించెన్

    రిప్లయితొలగించండి
  10. పట్టె మంచ మందు పవళించి యున్నావు
    రాజవంశ జాత రాణి వోలె
    ఇంటి, వంట పనులు యెవరు చేయుదురమ్మ?
    కొడుకునెత్తి నున్న కొయ్య బొమ్మ (కోడలమ్మ)

    రిప్లయితొలగించండి
  11. " ఓసీ బేల ! యిదేమి నీవిటుల హర్షోత్సాహమున్ యుంటివా?
    కౌసల్యమ్మకు దాసిగా బ్రతుకు నీ ఖర్మంబు లింతేనుటే?
    ఆ సీతాపతి నీ సుతున్ తొలుతనే అంతంబు చేబూనడో?"
    ఆసాయంత్రము ఎఱ్ఱబారెను కనుల్ ఆమాటలన్ కైకకున్ !

    రిప్లయితొలగించండి
  12. అమ్మా, కేకయ పుత్రివై, మగని ప్రేమాశ్వాసనంబున్ సదా
    సమ్మానమ్మును పొందియున్, పలునెడల్ సామర్థ్యముల్జూపుటన్
    న్నెమ్మాత్రంబొక యోచనన్ మనములోనెంచంగ లేకుందువే,
    యిమ్మంచున్ పతి గోరవే వరము, ప్రాణేశుండు విచ్చేసినన్?

    రిప్లయితొలగించండి
  13. రాజేశ్వరి అక్కయ్యా,
    మీకు ఆ చిత్రంలో కైక, మందర కాక అత్తాకోడళ్ళు కనిపించారు. పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘చేటు + అనక’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘చేటనకను’ అందాం.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘మందర + ఏతెంచి’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘మందరయు వచ్చి’ అనండి.
    *
    రఘుకుమార్ గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. కానీ గణదోషాలున్నవి. మీ పద్యానికి నా సవరణ....
    మందర జెప్పిన విషయము
    సుందరి కైకేయి మనము స్రుక్కగజేసెన్,
    తొందరపడి సతి యక్కడె
    నిందించెను ధరణిపతిని నిముసములోనన్.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    అద్భుతమైన ఖండికతో అలరింప జేశారు. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    బాగున్నది మీ పద్యం. అభినందనలు.
    *
    అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    రాజేశ్వరి అక్కయ్య లాగా మీరు కూడా అత్తాకోడళ్ళను విషయంగా తీసుకొని మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
    ‘పనులు + ఎవరు’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘పనుల నెవరు’ అనండి.
    *
    ఆదిత్య గారూ,
    చక్కని శార్ధూలాన్ని రచించారు. బాగుంది. అభినందనలు.
    ‘హర్షోత్సాహముల్ బొందితే’ అనండి.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ శార్దూల పద్యం ధారాశుద్ధి గలిగి చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. తమరిచ్చిన సలహాకు కృతజ్ఞతలు. మార్చిన పద్యము పంపుచున్నాను.
    ఆ: పట్టె మంచ మందు పవళించి యున్నావు
    రాజవంశ జాత రాణి వోలె
    ఇంటి, వంట పనులు నెవరు చేయుదురమ్మ?
    కొడుకునెత్తి నున్న కొయ్య బొమ్మ (కోడలమ్మ)

    రిప్లయితొలగించండి