20, ఫిబ్రవరి 2014, గురువారం

పద్య రచన – 513

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. భక్తుడౌ తిన్నని వరివస్యలను గొని
    ....యతని యందు ప్రసన్నుడై శివుండు
    తన కంటినుండి రక్తము కారు చున్నట్లు
    ....కల్పింపగా లీల కాంచి నంత
    తిన్నడు తన కన్ను దీసి యర్పించెను
    ....నెత్తురు కారెడు నేత్రమునకు
    నంతలో రెండవ యక్షినుండియు కూడ
    ....రక్తమ్ము కార నాత్రమ్ము జెంది
    తనదు రెండవ కంటిని తక్షణంబ
    పెరుక నెంచిన తిన్నని కరము బట్టి
    దర్శనంబిచ్చి శంభుండు దయ మెరయగ
    భక్తవరునకు సాయుజ్యముక్తి నొసగె

    రిప్లయితొలగించండి
  2. కన్నులు పెకలించి యిడిన
    తిన్నని భక్తిని బొగడగ త్రినేత్రు నికైనన్
    యెన్నగ నేరక వరమిడె
    సన్నుతి జేయంగ వలయు సంతస మొందన్

    రిప్లయితొలగించండి
  3. ప్రాణము వోవునో తనువు భంగము నొందునొ ' నాక , తూణికా
    బాణము జిఱ్ఱునం దిగిచి భల్లముఖాగ్రము రక్తపద్మ దృ
    క్కోణముఁ జేర్చి గ్రుచ్చి, యొకగ్రుడ్డు వడిం బెకలించి శోణిత
    ద్రోణికయైన దైవతశిరోమణి కంట నమర్చె నంతటన్

    మున్నిటి కంటికంటెఁ గడు మోహనమై తనకన్ను వచ్చినన్
    మన్ననఁ జూచి మెచ్చక, యుమాపతి రెండవకంట శోణిత
    క్లిన్నతఁ జూపినన్, నగి పుళిందుఁడు ' నీ కృపచేతఁ గన్న మం
    దున్నది, దీనికిన్ వెఱవ, నొక్కటి నావ్రత మింక శంకరా!

    లలాట లోచనంబునఁ
    గీలాలము దొరఁగె నేని, కేవలభక్తిన్
    గీలించి, మనోదృష్టికి
    మూలంబగు నాదు ప్రాణముల్ నీ కిత్తున్ '

    అని చెప్పుఁగాల నిటలా
    క్షుని కన్గొనఁ దన్నిపట్టి, సునిశిత బాణం
    బునఁ దన రెండవ కను గ్రు
    డ్డును బెకలింపంగఁ బూనుడును సదయుండై

    దూర్జటి మహాకవి "శ్రీకాళహస్తి మహాత్మ్యము" నుండి

    రిప్లయితొలగించండి
  4. దండము భక్తవరేణ్యా!
    చండీశునిఁ గొలిచి సిద్ధి సాధింపంగా
    నిండు మనమ్మున నెంతో
    పండిన భక్తినిఁ జూపిన పావన చరితా!

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    తిన్నని వృత్తాంతాన్ని సంక్షేపంగా సీసపద్యంలో మధురంగా తెలిపారు. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. ‘త్రినయనునకే/ యెన్నగ...’ అనండి.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ధూర్జటి కవివరుని పద్యాలను ఇచ్చి చిత్రానికి శోభను కూర్చారు. ధన్యవాదాలు.
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. తిన్నని జ్ఞానము లేదులె
    తిన్నని భక్తేమొ పార్వతీశుడు మెచ్చెన్
    కన్నుల నీయగ జూడగ
    కన్నప్పగ బిల్చి బ్రోచి కరుణను జూపెన్.

    రిప్లయితొలగించండి
  7. కన్నప్పగించ జూచెను
    కన్నప్పుడు రక్తమింక కారుచు నుండన్
    కన్నప్పగించి చూడకు
    కన్నప్పను కావుమయ్య కరుణ మహేశా !

    రిప్లయితొలగించండి
  8. కన్నుల నిచ్చెను శూలికి
    కన్నప్పగ పిలువబడెను కడు పుణ్యమునన్
    తిన్నని మూఢపు భక్తికి
    వెన్నెలవిరిదాల్పుడొచ్చి వేడుక దీర్చెన్

    రిప్లయితొలగించండి
  9. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    పద్య రచన:తిన్నడను భక్తుడు శివుని
    కన్నున రక్తమ్ము గార కాలిడి యదిమెన్
    క్రన్నన పెకలించెను తన
    కన్నును యచ్చోట నిలిపి గాంచెను శివమున్

    రిప్లయితొలగించండి
  10. తిన్న డ య్యెడ దనకన్ను దీ సి శివుని
    కంటికి నమర్చ భక్తిని గాలు డంత
    మోక్ష మిచ్చెను నతనికి ముదము తోడ
    దైవ కృపలన నిటులనే దనరు చుండు


    రిప్లయితొలగించండి
  11. తిన్నడను నట్టి భక్తుడు కన్నులందు
    నీరుకారెడు పరమేశునిగని మనము
    తల్లడిల్లగా గ్రక్కున తనకను నొక
    దాని పెకలించి యమరిచె తనివి తోడ
    కాంచె నప్పుడు రెండవ కన్ను నుండి
    కారు చున్న శోణితమును, గ్రచ్చర తన
    కాలు నుంచె నాదేవుని కన్ను చెంత
    తీయ సమకట్టి తనదు ద్వి తీయ నేత్ర
    మాపె శంభుడు భక్తుని ఆదరముగ


    రిప్లయితొలగించండి
  12. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘భక్తి + ఏమొ’ సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘భక్తికిని’ అనండి.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘విరిదాల్పుడొచ్చి’ని ‘విరిదాల్పు వచ్చి’ అనండి.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘కన్నును తా నచట ...’ అనండి.
    *
    సుబ్బారావు గారూ,
    బాగున్నది మీ పద్యం. అభినందనలు.
    *
    అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. ఆర్యా ! ధన్యవాదములు..
    మీరు చూపిన సవరణతో...


    తిన్నని జ్ఞానము లేదులె
    తిన్నని భక్తికిని పార్వతీశుడు మెచ్చెన్
    కన్నుల నీయగ జూడగ
    కన్నప్పగ బిల్చి బ్రోచి కరుణను జూపెన్.

    రిప్లయితొలగించండి

  14. ధన్యవాదములు గురువుగారు,.మీ సవరణతో..

    కన్నుల నిచ్చెను శూలికి
    కన్నప్పగ పిలువబడెను కడు పుణ్యమునన్
    తిన్నని మూఢపు భక్తికి
    వెన్నెలవిరిదాల్పువచ్చి వేడుక దీర్చెన్

    రిప్లయితొలగించండి
  15. ఎన్నడు దైవము నమ్మని
    తిన్నడినే భక్తిలోన తీరుగ ముంచి
    కన్నులతో నువు పరీక్షంచి
    కన్నప్పగ మార్చితివట కనగా శంభో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ద్వారకానాథ్ యజ్ఞమూర్తి గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పద్యం బాగుంది. కందంలో రెండవ పాదం చివర తప్పక గురువు ఉండాలి. అక్కడ "ముంచన్" అనండి. మూడవ పాదంలో గణభంగం. "కన్నులతో శోధించియు" అందామా?

      తొలగించండి
    2. గురువుగారికి ప్రణామాలు,

      మీ సూచన ప్రకారం సవరించాను.

      ఎన్నడు దైవము నమ్మని
      తిన్నడినే భక్తిలోన తీరుగ ముంచన్
      కన్నులతో శోధించియు
      కన్నప్పగ మార్చితివట కనగా శంభో!

      తొలగించండి