27, ఫిబ్రవరి 2014, గురువారం

పద్య రచన – 520

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

32 కామెంట్‌లు:

  1. అభిషేకించుచు నుండిరి
    త్రిభువనపతి! భక్తులు నిను లింగాకారా!
    శుభముల నిడి ప్రోచు శివా!
    యభయప్రదు గొలుతు నిను సమాదరమతినై

    రిప్లయితొలగించండి
  2. మాతను గూడి వేడుకను మంచు గిరిన్ కొలువుండి, చెంతనే
    ప్రీతిగ నాడు పుత్రులను ప్రేమను ముద్దిడు చుండి, భక్తితో
    జోతలు సేయు దేవతల జూచుచు నుండి కృపల్ దలిర్ప, యీ
    రాతిరి విందు సేతువట రమ్యముగా కనుదోయికిన్ శివా!

    శంకర శంకరా యనుచు సన్నుతి జేతును, నీకు పాపపుం-
    బంకిల మంటె నంచు మది భావన సేయక, సంకటమ్ము లే
    వంకలు బెట్టబోక, నెలవంకను దాల్చిన దొడ్డ దేవరా!
    పంకజనాభ వందిత !శివా! పరమాత్మ! పురారి! బాపరా.

    మూడవ కంట జూచెదను మూడును నీకని పల్క భావ్యమే?
    చూడు మదాపహారి! పరిశోధన జేసిన నన్ను గాంచవే
    యాడెడి శత్రు షట్కమును హాయిగ నాయెద ప్రాంగణమ్ములో!
    చూడుము వాని నొక్కపరి, జోతలు! చిచ్చర కంట నీశ్వరా!

    కాతువు భక్త కోటులను కంటికి రెప్పగ నందురే నినున్
    జూతు వదేమి చోద్య మొకొ ? సుందర దృశ్యమొ ? కాక క్రీడయో ?
    భీతిని గొల్పు నా ప్రబల భీకర దుష్కర పాప రాశులన్
    పాతర వేయవే తుహిన పర్వత పంక్తుల యందు శంకరా!

    శైశవమా గతించినది, చల్లగా జారెను యౌవనమ్ము, నా
    యాశకు లేక హద్దు తిరుగాడితి విత్తము వెంట వెర్రినై!
    లేశము గూడ దల్పకనె రేబవలుల్ బ్రతుకంత నీడ్చినే
    నీ శివరాత్రి నైన నిను నింపుగ గొల్చెడి భాగ్య మీయవే.

    రిప్లయితొలగించండి
  3. మిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  4. పూజ్య గురుదేవులకు,కవిమిత్రులకు మరియు బ్లాగు వీక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  5. మిస్సన్న గారు,
    మంచి పద్యాలతో శివుని సేవించినారు. మిమ్మల్ని మూడవకంటితో ఎందుకు చూస్తాడు లెండి. రెండు కన్నులు సూర్యచంద్రులనగా చంద్రుని పోలిన చల్లని కంటితో చూస్తున్నాడు. అందుకే కదా కవితా సుధాధారలు కురిపిస్తున్నారు. :)

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    ==============*==============
    బిల్వ పత్ర పూజకు నీవు ప్రీతి నొంది
    వరము లిచ్చెద వని విని పరమ పురుష
    భక్తి తోడను దెచ్చితి పత్రములను
    జాలి జూపి వరము లిమ్ము శూల పాణి !

    రిప్లయితొలగించండి
  7. మిస్సన్న గారు, చాలా మంచి పద్యాలతో శివుని అభిషేకించి,యా పరమ శివుని ప్రీతికి పాత్రులైనారు. ఆ భాగ్యము మాకు కూడా కలిగించిన మీకు ధన్యవాద శతము.

    రిప్లయితొలగించండి
  8. హరనర్తన

    శంకరా!యభయంకరా!శశిభూషా! దీవనలిచ్చి నీ
    కింకరత్వము నిచ్చి మద్గృహమందున్ పూజల వేళ నే
    వంక లేని వరంబు లివ్వవదే పాపంబది ముంచెనో,
    పంకిలంబగు నిజ్జగంబను మోహాబ్ధిన్ విడబోకుమా!

    రిప్లయితొలగించండి
  9. హరనర్తన

    శంకరా!యభయంకరా!శశిభూషా! దీవనలిచ్చి నీ
    కింకరత్వము నిచ్చి మద్గృహమందున్ పూజల వేళ నే
    వంక లేని వరంబు లివ్వవదే పాపంబులు ముంచెనో,
    పంకిలంబగు నిజ్జగంబను మోహాబ్ధిన్ విడబోకుమా!

    రిప్లయితొలగించండి
  10. భక్తి భావము మదీనుంచి పరవశమున
    సాంబ మూర్తికి నభిషేక జలము లిడుచు
    పూలు పండ్లతో నర్చించ ముదము తోడ
    మంగళంబుల నొసగు నా లింగ మూర్తి

    రిప్లయితొలగించండి
  11. చక్కగనభిషేకించుచు
    మిక్కుటమగు భక్తిగొలువ మినుసిగవేల్పున్
    మ్రొక్కుచు శివశివ యనుచున్
    ముక్కంటినిబూజచేయ మోక్షము గలుగున్

    రిప్లయితొలగించండి
  12. శివరాత్రి పర్వ దినమున
    సవినయముగ వేడు కొనుదు సహ కవుల గమిన్
    శివ నామము జపియించుడు
    భవుడే మిము గాచు నెపుడు భవ్యత గలుగన్

    రిప్లయితొలగించండి
  13. భక్తు లెల్లరు గుమిగూడి భక్తి తోడ
    చేయుచున్నారు చూడుడు చిత్ర మందు
    పాలు ,పంచామృతములు ను వరలు నేతి
    తోడ యభిషేక మాయుమ జోడున కట

    రిప్లయితొలగించండి
  14. పరమ భక్తి తోడ హరుని కొల్చుచు నుండ్రి
    కోరుకున్న వన్ని తీరుకొరకు
    లింగరూపుదైన జంగమయ్య ముదముఁ
    దీర్చు వారి యొక్క కోర్కె లన్ని

    రిప్లయితొలగించండి
  15. పరమ భక్తి తోడ హరుని కొల్చుచు నుండ్రి
    కోరుకున్న వన్ని తీరుకొరకు
    లింగరూపుడైన జంగమయ్య ముదముఁ
    దీర్చు వారి కోర్కె తృప్తి గాను

    రిప్లయితొలగించండి
  16. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. నాలుగు పాదాలలో ప్రాసయతి వెయ్యాలని ప్రయత్నించాను.నాలుగవ పాదము కుదరలేదు. ఇప్పుడు నాలుగవ పాదము యిలా మారుస్తున్నాను.

    "చక్కబఱచు వారి చిక్కులన్ని"

    రిప్లయితొలగించండి
  17. శ్రీమతి లక్ష్మీదేవి గారూ!
    శుభాశీస్సులు. మీరు వ్రాసిన హరనర్తన వృత్తమును చూచితిని. బాగుగ నున్నది. అభినందనలు. ఆ వృత్తమునకు యతి స్థానమును ఏవిధముగా గుర్తించవలెనో తెలియుట లేదు. వివరించగలరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. లక్ష్మీ దేవి గారు హరనర్తనం లో శివతాండవం చక్కగా చూపించారు.

    నేమాని పండితార్యా యతి 9 వ అక్షరంలో ఉందంటారా.

    రిప్లయితొలగించండి
  19. మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు!
    *
    పండిత నేమాని వారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    చాలామంచి పద్యాలను అందించి ఆనందాన్ని కలిగించారు. అభినందనలు.
    *
    కందుల వరప్రసాద్ గారూ,
    చిత్రానికి తగిన చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ హరనర్తన చాలా బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    ఈరోజు లక్ష్మీదేవి గారు వ్రాసిన హరనర్తన వృత్త లక్షణం ఇది....
    హరనర్తన
    18వ ఛందమైన ధృతిలో 90971వ వృత్తం.
    గణాలు : ర - స - జ - య - భ - ర.
    యతిస్థానం : 9. ప్రాసనియమం ఉంది.

    రిప్లయితొలగించండి
  20. అయ్యా,
    నాకు పెద్దగా వ్యాకరణజ్ఞానము కానీ, రచనానుభవం కానీ, పఠనానుభవం కానీ లేదు. అన్నీ నేర్చుకోవాలనే తపన తప్ప.
    హరనర్తన గణములు, యతి (పైన గురువుగారు
    చెప్పినవి) మాత్రము తెలుసుకొని వ్రాసినానే కానీ నడక అనుభవజ్ఞుల ద్వారా తెలుసుకోవాలనే నా ఉద్దేశ్యము. తెలిసిన వారు దయ వహించి ఏదైనా చెప్తారనే ఇక్కడ అన్ని ఛందో పద్ధతులను ప్రయత్నించి వ్రాస్తుంటాను.
    గురువు గారు, ధన్యవాదాలు.
    మిస్సన్న గారు, మీరదృష్టవంతులు. కానీ నేను పాటించిన నడకలో నాకు హరనర్తన దర్శనం కానట్టే ఉంది.

    రిప్లయితొలగించండి
  21. నాగరాజు గారు,
    వారు ఛందో రీతుల మీద చేసిన చేస్తున్న శోధన అద్బుతము. ఈ శివరాత్రి సందర్భంగా భవభయహర అను ఒక రీతిని రూపకల్పన చేసినారు.
    మీరు చెప్పిన వ్యాసము చూసినాను. వారినే అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను.
    మత్తకోకిల కు ర స జ జ భ ర గణములు పదకొండవ అక్షరము యతి, హర నర్తనకు ర స జ య భ ర గణములు తొమ్మిదవ యక్షరము యతి. మరి ఇదెట్లు సంభవమో తెలియుటకు నా పరిజ్ఞానము చాలదు.
    మీరు ఈ సంగతి పంచుకున్నందుకు అనేక ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ మిస్సన్నగారికి,నమస్సులు..
    మీరు, ఏరి కోరి తెచ్చిన మంచి పదపుష్పములతో పద్యమాలలల్లి పరమశివుని అభిషేకించారు..ఎంతో బాగున్నాయి..అందులో 5 వపద్యము( శైశవమా...)
    అద్బుతంగా వ్రాసారు..

    రిప్లయితొలగించండి
  23. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    ఉపవసించంగలేను నీజపము సేతు
    బిల్వ పత్రాలు తెచ్చి నే గొల్వ లేను
    పాలు తేనెల నభిషేక లీల నెరుగ
    యెంచి నీపూజ సేయ దర్శించ గలను
    నాపురాకృత పుణ్య మ్మొ నాథ నేడు
    నీమహాశివరాత్రి నుమా మహేశు
    చిత్ర దర్శన భాగ్యమ్ము మిత్రకవుల
    కవితలెల్లను చదువు భాగ్యమ్ము గలిగె

    రిప్లయితొలగించండి
  24. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    “మిత్రకవుల కవితలెల్లను చదువు భాగ్యమ్ము గలిగె” నంటూ చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. గురువుగారికి ధన్యవాదములు.

    రవీందర్ గారికి ధన్యవాదములు.

    శైలజ గారికి ధన్యవాదములు.

    లక్ష్మీ దేవిగారూ మీ హర నర్తన నిజంగా బాగుంది. మీ మనస్సు ఆర్తితో శివపద ప్రాంగణంలో తాండవించింది. అంతకన్నా భాగ్యం ఏం ఉంటుంది?
    రవీందర్ గారు అన్నట్లు క్రొత్త వృత్తాన్ని పరిచయం చేశారు. బాగుంది.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. గురువుగారు, మిస్సన్న గారు,ధన్యవాదాలు.
    గురువుగారు, రవీందర్ గారు, మిస్సన్న గారు,
    హరనర్తనము విషయంలో వచ్చిన సందేహాన్ని శ్రీ జెజ్జాల కృష్ణమోహన్రావు గారు తీర్చినారు. గమనించగలరు.


    కొందఱు (ఉదా. కోవెల పుస్తకము) మీరు వ్రాసిన వృత్తమును హరనర్తనము అని అంటారు. కాని ర/స/జ/జ/భ/ర గణములతో నుండే వృత్తమునే సామన్యముగా హరనర్తనము అనే వాడుక, దీనికి నేను చెప్పినట్లు ఎన్నో పేరులు ఉన్నాయి - చర్చరీ, ఉజ్జ్వల, మల్లికమాలె, ఇత్యాదులు. మీరు వ్రాసిన వృత్తమును వరకృత్తన అని సంస్కృత గ్రంథములలో పేర్కొనబడినవి. - జెకె మోహనరావు.

    రిప్లయితొలగించండి
  27. పలికెద నీశుని మహిమల
    పలురీతుల భక్తిభావ భరితుడనగుచున్
    పలికించునటగ యాతడె
    పలుకులు విరులేయగుచును పదములుచేరన్

    రిప్లయితొలగించండి
  28. నేను మీ పద్యాలూ చదవగలుగు తాను కానీ మీ అంత పాండిత్యం నా దగ్గర లేదు..ఆ పరమ శివుని ఆశీస్సులు తో చదివి ఆనందించగలను..
    నాకు శివ పరివారం అని పదం వచ్చేటట్టుగా ఏదైనా పద్యం వ్రాయగలరు..
    మా పరివారం పేరు శివ పరివారం.. మేము ప్రతి నెల ఆదివారం మా సభ్యులు తో ఆ పరమ శివుని కి అభిషేకం చేస్తాము.. మా గురువర్యులు పేరు రాళ్లబండి వారు...ఆ దంపతులు మాకు పార్వతి పరమేశ్వరులు తో సమానం..మా సభ్యులు లో అందరు అష్టలక్ష్మి లు ఉన్నారు..మహా లక్ష్మి, కామాక్షి, జయలక్ష్మి ,మొ..వారు..

    రిప్లయితొలగించండి