28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

పద్య రచన – 521

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:

  1. సుగంధి
    అమ్మలక్కలార! రండి యాటలాడ వేడ్కతో
    కమ్మనైన పాటపాడి గంతులేసి పొంగుచున్
    చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేరడేసి మొగ్గలో
    కొమ్మలార! పైడి ముద్దుగుమ్మలార! యొప్పుగా

    రిప్లయితొలగించండి
  2. అమ్మ లార కొమ్మ లార యట్ల తద్ది పండు గన్
    కమ్మ నైన అమ్మ చేతి కంది పప్పు పచ్చ డిన్
    నెమ్మి గాను వెన్నె లందు నేతి ముద్ద తింద మా
    చెమ్మ చెక్క చింత గింజ చేరి యాడి పాడు దాం

    రిప్లయితొలగించండి
  3. చెమ్మ చెక్కలనుచు చేతులు గలుపుచు
    చేరెడెసి మొగ్గ చేరి పాడి
    ఆడపిల్లలంద రాడుకుందమురండు
    పల్లెలాట లనుచు పారిపోక.

    రిప్లయితొలగించండి
  4. చిత్ర మందున జూడుడు చెమ్మ చెక్క
    లాట లాడుచు నుండిరి యచట చెలులి
    రువురు సంతసము గలుగ ,రూప మందు
    నొకవి ధముగానె నలరిరి యుత్సు కనన

    రిప్లయితొలగించండి
  5. బొట్టు కాటుక దిద్దియు పూవు ముడచి
    జడను వేసిన చిన్నారి జలజ తోడి
    కొప్పు గట్టిన చిత్రాంగి కులుకు లమ్మ
    చెమ్మ చెక్కలాటల మున్గి చిందులేయ
    రంగవళ్లి దిగదుడుపు ముంగిటందు!

    రిప్లయితొలగించండి
  6. చింతలేమి లేని చిన్ని పాపాయిలు
    చెంత చేరినారు చిందులేయ
    చెమ్మ చెక్క లాట చెన్నుగా నాడుచు
    పాట పాడు చుండ్రి పరవశమున

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని వారూ,
    స్వభావోక్తితో కవితాసుగంధాన్ని వెదజల్లినారు మీ పద్యంలో. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    అట్లతద్ది పండుగను ప్రస్తావించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యంలో మనోహరమైన భావమాలిక నల్లి అందించారు. బాగున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    పల్లెల ఆటలని చులకన చేయవద్దన్న మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    చిత్రానికి తగిన మంచి పద్యం వ్రాశారు. అభినందనలు.
    ‘ఉత్సుకతను’ అనండి.
    *
    సహదేవుడు గారూ,
    నిసర్గసౌందర్యాన్ని ప్రతిబింబించారు మీ పద్యంలో. బాగుంది. అభినందనలు.
    ‘ముంగిట గన’ అంటే బాగుంటుందనుకుంటాను.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    బాలికల పారవశ్యాన్ని వర్ణించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. అమ్మ నేర్పుపాటలన్ని యాటలందు పాడుచున్
    చెమ్మచెక్క చెమ్మచెక్క చెల్లితోనె యాడుచున్
    కొమ్మ కొమ్మలందు దాగి కోయిలల్లె కూయుచున్
    చిమ్మచీకటందుకూడ చిందులేయు వేడ్కతో

    రిప్లయితొలగించండి
  9. శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘కోయిలల్లె’ అనడం గ్రామ్యం. దానికి బదులుగా ‘కోయిలమ్మ కూయగన్’ అందామా?

    రిప్లయితొలగించండి
  10. సెల్లుగేము వీడియోలు చేతులందు బట్టుచూ
    చెల్లి యక్కలంత చేరి చెమ్మచెక్క లాడునా
    పల్లె సీమ లందుకూడ పాత యాటలందురే
    కళ్ళజోడు తెచ్చిపెట్టు కాంతిగేము లొచ్చెనే



    రిప్లయితొలగించండి
  11. శైలజ గారూ,
    మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.
    ‘బట్టుచూ’ అన్నదాన్ని ‘బట్టుచున్’ అనండి.

    రిప్లయితొలగించండి
  12. పరుగులఁ బెట్టి పాడుచును యాడుచునుం
    దురు చిరునవ్వు తోడ మనమున్ మురిపిం
    తురు పనివేళ తొందరలు వెట్టుచునే
    మురిపెముఁ జూపి ముచ్చటలఁ దీర్తురిటుల్.

    రిప్లయితొలగించండి
  13. లక్ష్మీదేవి గారూ,
    విషయానికి తగిన వృత్తాన్ని ఎన్నుకొని ముచ్చటైన పద్యాన్ని చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. గురువుగారు, మిస్సన్న గారు,ధన్యవాదాలు.
    గురువుగారు, రవీందర్ గారు, మిస్సన్న గారు,
    హరనర్తనము విషయంలో వచ్చిన సందేహాన్ని శ్రీ జెజ్జాల కృష్ణమోహన్రావు గారు తీర్చినారు. గమనించగలరు.


    కొందఱు (ఉదా. కోవెల పుస్తకము) మీరు వ్రాసిన వృత్తమును హరనర్తనము అని అంటారు. కాని ర/స/జ/జ/భ/ర గణములతో నుండే వృత్తమునే సామన్యముగా హరనర్తనము అనే వాడుక, దీనికి నేను చెప్పినట్లు ఎన్నో పేరులు ఉన్నాయి - చర్చరీ, ఉజ్జ్వల, మల్లికమాలె, ఇత్యాదులు. మీరు వ్రాసిన వృత్తమును వరకృత్తన అని సంస్కృత గ్రంథములలో పేర్కొనబడినవి. - జెకె మోహనరావు.

    రిప్లయితొలగించండి

  15. గురువుగారికి ధన్యవాదములు.తమరి సూచిత సవరణతో:

    బొట్టు కాటుక దిద్దియు పూవు ముడచి
    జడను వేసిన చిన్నారి జలజ తోడి
    కొప్పు గట్టిన చిత్రాంగి కులుకు లమ్మ
    చెమ్మ చెక్కలాటల మున్గి చిందులేయ
    రంగవల్లి దిగదుడుపు ముంగిట గన!

    రిప్లయితొలగించండి
  16. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    అది యొక వింత లోక మట యాటల మోజున బాల లందరున్
    మది పులకింప నుల్లసము నవ్వుల నూయల లూగుచున్ సదా
    చెదరని శ్రద్ధ చెమ్మ చెక చేరెడు మొగ్గని పాటపాడుచున్
    కదలుచునృత్యముల్ సలిపి కన్నుల విందొనరింత్రువేడుకన్
    మునిమాపుపొగలు క్రమ్మగ
    వినువీధిని జుక్కబొడుచు వేళను క్రన్నన్
    మినుకుమను దివ్వె వెల్గులు
    కనుపించగ నాటలన్ని కడ ముట్ట౦గన్
    పల్లె పల్లెల మార్చెను ప్రగతి నేడు
    అమ్మ నాన్నలమారుగా మమ్మి డాడ్లు
    భరతదేశమునందునమెరికవెలసె
    చెమ్మచెక్కల వేలనే చెలియ మనకు

    రిప్లయితొలగించండి
  17. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ మూడు పద్యాలు (ముఖ్యంగా మొదటి చంపకమాల) చాలా బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి