2, మే 2015, శనివారం

సమస్యా పూరణము - 1663 (నాగశయనుఁడు విహరించు నంది నెక్కి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
నాగశయనుఁడు విహరించు నంది నెక్కి.

(కవిమిత్రులకు మనవి... మా మేనల్లుని కూతురు పెళ్ళికి వెళ్తున్నాను. మూడు నాలుగు రోజులు అటే ఉంటాను. ఎందుకైనా మంచిదని ఐదురోజుల సమస్యలను షెడ్యూల్ చేసాను. ఈ అయిదురోజులు ‘పద్యరచన’ శీర్షిక ఉండదు. సెల్‍ఫోన్‍లో ఎప్పటికప్పుడు మీ పూరణలను చూస్తూ ఉంటాను కాని సమీక్షించలేను. కావున దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.)

33 కామెంట్‌లు:

 1. గగన సీమల దిరుగును గరుడి పైన
  నాగ శయనుఁడు ,విహరించు నంది నెక్కి
  పరవ శమ్మున పార్వతీ భవుడు కలసి
  నిముస మైనను కుదురుగ నిలువ లేక

  రిప్లయితొలగించండి
 2. రాజేశ్వరి అక్కయ్యా,
  పెళ్ళికి బయలుదేరుతూ కేవలం మీ పూరణను సమీక్షించే అవకాశం చిక్కింది. సంతోషం!
  విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. యతుల నేర్పగ వలె నన్న గతులు మార్చి?
  నాగశయనుఁడు విహరించు నంది నెక్కి
  యనుచుఁ జెప్పగ నేటికి? వినగ ననరె
  "కమలనాభుడు విహరించు ఖగము నెక్కి"

  రిప్లయితొలగించండి
 4. సూచివంతుని పైచను సురుచిరముగ
  నాగశయనుడు, విహరించు నంది నెక్కి
  ఫాలనేత్రుడు లోకాలు ప్రమదమలర
  సలిలఖగముపై దిరుగును నలినజుండు!!!

  రిప్లయితొలగించండి
 5. పరమ శివుడేమొ పార్వతిన్ గలసి వేగ
  సిరిని జూడగ వైకుంఠ పురమునకును
  రమ్మననుచును పిలువ నారాయణుండు
  నాగశయనుడు - విహరించు నంది నెక్కి

  రిప్లయితొలగించండి
 6. ప్రమథ నాథుండు,కైలాస పతి, భుజంగ
  భూషణుఁడు, సర్వ భువనైక పోషకుండు,
  స్థిర కృపా మూర్తి శివుఁడు - స్తుతించుచుండ
  నాగశయనుఁడు - విహరించు నంది నెక్కి !

  రిప్లయితొలగించండి
 7. శ్రీమతిరాజేశ్వరి నేదునూరిగారి పద్యం మూడవ పాదం "పరవశమ్మునఁ బార్వతీ పతియుఁ దాను " అంటే సరిపోతుంది.


  నాగరాజు రవీందర్ గారూ , మీ పద్యం బాగుంది.
  "ఎద్దునెక్కె శివుఁడు గద్దనెక్కెను విష్ణు
  హంస నెక్కె పంకజాసనుండు
  బద్ధకంపు మొద్దు బల్లపైకెక్కెరా
  లలిత సుగుణజాల తెలుగుబాల !" పద్యాన్ని జ్ఞప్తికి తెచ్చింది. మొదటిపాదంలో గరుడవాహనారూఢుడై "తిరుగుచుండు" అనండి .

  రిప్లయితొలగించండి
 8. కమలతోనుండు సాగర గర్భమందు
  నాగశయనుడు, విహరించు నందినెక్కి
  శివుడు వివిద లోకములు చెండి తోడ
  బ్రహ్మ చదువుల తల్లితో పరిఢవిల్లు

  రిప్లయితొలగించండి
 9. వైనతేయుని భుజమెక్కి పత్నితోడ
  నాగశయనుండు విహరించె;నందినెక్కి
  హైమవతి తోడచరియించె హరుడు తాను
  హంస నెక్కి వాగ్దేవితో నజుడు తిరిగె

  రిప్లయితొలగించండి
 10. వైనతేయుని భుజమెక్కి పత్నితోడ
  నాగశయనుండు విహరించె;నందినెక్కి
  హైమవతి తోడచరియించె హరుడు తాను
  హంస నెక్కి వాగ్దేవితో నజుడు తిరిగె

  రిప్లయితొలగించండి
 11. వైనతేయుని భుజమెక్కి పత్నితోడ
  నాగశయనుండు విహరించె;నందినెక్కి
  హైమవతి తోడచరియించె హరుడు తాను
  హంస నెక్కి వాగ్దేవితో నజుడు తిరిగె

  రిప్లయితొలగించండి
 12. వైనతేయుని భుజమెక్కి పత్నితోడ
  నాగశయనుండు విహరించె;నందినెక్కి
  హైమవతి తోడచరియించె హరుడు తాను
  హంస నెక్కి వాగ్దేవితో నజుడు తిరిగె

  రిప్లయితొలగించండి
 13. వైనతేయుని భుజమెక్కి పత్నితోడ
  నాగశయనుండు విహరించె;నందినెక్కి
  హైమవతి తోడచరియించె హరుడు తాను
  హంస నెక్కి వాగ్దేవితో నజుడు తిరిగె

  రిప్లయితొలగించండి
 14. హరి,హరుండిల నొక్కటై నలరు నపుడు
  నాగశయనుండు విహరించు నంది నెక్కి
  అవసరానికి నంతటా నణగియున్న
  సర్వ రక్షకులిద్దరు సమముగాదె|


  రిప్లయితొలగించండి
 15. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులు...

  అంతర్జాలావరోధమువలన నేను నిన్నటి సమస్యకుఁ బూరణమునుం బంపలేకపోయిన కతమున నిచట నిచ్చుచున్నాను.

  నిన్నటి పూరణము:
  వేరు మతమ్ముల వారై,
  క్రూరత, హిందూమతస్థ గురుదైవములన్
  దూరుచు నుండెడివారికి
  భారత రామాయణములు వ్యర్థములు గదా!


  నేఁటి పూరణము:
  వైనతేయునిపై నెక్కి వరముల నిడ
  నాగశయనుఁడు విహరించు! నంది నెక్కి
  త్రిపురవైరియుఁ దా విహరించు! హంస
  వాహనము నెక్కి ముదమున బ్రహ్మ తిరుగు!

  రిప్లయితొలగించండి
 16. నాగశయనుండు స్తుతించుచుండఁగ, శివుఁడు నందివాహనముపై నెక్కి విహరించినాఁడను డా.విష్ణునందన్ గారి పూరణము సరసముగను, యుక్తముగను నున్నది. అభినందనలు!

  రిప్లయితొలగించండి
 17. భ్రమ్మసృష్టించు ప్రాణులుబ్రతుకు గూర్చ?
  విష్ణు ముర్తిచే-విలువలు వెలేకివచ్చు
  శివుని-నగ్నగ లోకాలు-చేరనేంచ
  నాగ శయనుండు విహరించు-నందినేక్కి
  2. పగలురేయి లేని పరమాత్మ-తత్వాలు
  వాహనాల సృష్టి వారెగాన?
  ఏదినెక్కియైన వెళ్ళుట సహజంబు
  నగశాయనుండు విహరించు నందినేక్కి
  3. అణువు నణువున అణగిన హరి,హరుండు
  జీవితాలలో దాగున్న భావమైన
  నాగశయనుండు విహరించు నందినేక్కి
  భక్తి,నాసక్తిచే రక్తి యుక్తమేగ?

  రిప్లయితొలగించండి
 18. గగన తలమందు విహరించు గరుని నెక్కి
  నాగ శయనుడు, విహరించు నంది నెక్కి
  సకల శుభముల నీయంగ శంక రుండు
  మూడు లోకాల ప్రజలకు ముదము గూర్చ

  రిప్లయితొలగించండి
 19. వినువీధి సురకోటి విరివృష్టి గురిపింప
  ఘనఘనమ్ములఁసుమ గంధ మలర
  ప్రమథ గణము లంత ప్రభలఁ ప్రబలుచును
  యుత్సాహముప్పొంగి యురుకు చుండ
  ఋషివర్య నివహంబు ఋగ్ధార ఘటియించి
  సాధు సాధుయనుచు శాంతి బలుక
  కన్నుల బండువై కమనీయ ఘట్టమై
  విశ్వపితరులకు పెండ్లి జరిగె
  తే.గీ
  అరుగఁ నిజనివాసములకు, యంచ నెక్కె
  బ్రహ్మ, వాణిఁగూడి, పక్షి పైసిరియును
  నాగశయనుడు విహరించు, నందినెక్కి
  విశ్వ నాథుండు సతితోడ విడిది సేరె

  రిప్లయితొలగించండి
 20. కవిమండలికి సవినమ్ర ప్రార్థన
  నిజానికి, క్రింద వ్రాసిన తేటగీత చాలు సమస్య పూరణకు
  కానీ పద్యరచన, వర్ణనల అభ్యాసం కొరకు, వ్రాశాను.
  నా అతియాన్ని మన్నించ గలరు

  రిప్లయితొలగించండి
 21. పార్వతీశుడు, ముక్కంటి, పంచముఖుడు,
  ప్రమథనాధుడు, శంబుడు, భైరవుండు,
  కాలకంఠుడు,నటరాజు; కాడతండు
  నాగశయనుఁడు; విహరించు నందినెక్కి

  రిప్లయితొలగించండి
 22. విషధర రిపు నెక్కి గగన వీధిలోన
  నాగశయనుండు విహరించు, నందినెక్కి
  సర్వగురు చను నేలపై సంతసమున
  హరి హరులు వారిలో బేధ మవని గలదె .

  రిప్లయితొలగించండి
 23. శ్రీ నాగరాజు రవీందర్ గారికి ధన్యవాదాలు. త్రిమూర్తుల మూడు వాహనాలను ప్రత్యేకముగా పేర్కొన్నశ్రీ గుండు మధుసూదన్ గారి పూరణ అలరించింది. వారికి అభినందనలు.

  సత్యనారాయణ రెడ్డి గారూ ,మొదటి పాదాన్ని "కమలతో నుండు క్షీర సాగరమునందు " అని మార్పు చేస్తే బాగుంటుంది - లక్ష్మీ నారాయణులు పాల సముద్రము పైనుండే వారే కాని సాగర గర్భము నందు కాదు కదా !

  కె.ఈశ్వరప్ప గారు తమ పద్య ప్రథమ పాదంలో హరి హరుండిల నొక్కటై యలరునపుడు అని, మూడవ పాదంలో "అవసరానికి నంతట నణగియున్న " అంటే సరిపోతుంది.రెండవ విడతలో పంపిన పద్యాల్లో సమస్య తేటగీతి అయితే వారి పూరణ మూడు పాదాలు ఆటవెలదిగా ఉంది - సరి చేయవలసి ఉంటుంది. అక్షర దోషాలు కూడ ఎక్కువగానే ఉన్నాయి.

  మూర్తి గారి పద్యం బాగుంది , కానీ ఎత్తు గీతి రెండవ పాదం గణాలు సరి చేయాలి , పద్యమంతా భూతకాలం జరిగినట్టుగా ఉంటే , నాగశయనుడు "విహరించు" అని సామాన్య వర్తమాన కాలంలో ఉండడాన్ని పరిహరించాలి. ప్రమథ గణము లంత ప్రభలఁ ప్రబలుచును - ఈ పాదంలోప్రభల తరువాత అరసున్న పెడితే ప్రభలఁ బ్రబలుచును అనండి . "అరుగఁ నిజనివాసములకు, యంచ నెక్కె" ఈ పాదంలో అరుగ తరువాత అర సున్న అవసరం లేదు , అరుగ నిజ నివాసములకు నంచ నెక్కె అని మార్చండి.

  శంకరయ్య బొడ్డు గారి పూరణ బాగుంది. శంబుడు అక్షర దోషం - శంభుడు అంటే సరి !

  రిప్లయితొలగించండి

 24. అరయ విరజానదీతటి సిరిని గూడి
  నాగశయనుండు విహరించు, నందినెక్కి
  భవుడు పార్వతి గూడి దేవళము వీడి
  బయలుదేరిరి జనుల యాపదలు గాయ

  రిప్లయితొలగించండి
 25. విష్ణు వర్ధన్ గారూ
  శ్రమకోర్చి తెలియ చేసినందుకు కృతజ్ఞతలు.
  పక్షి పై సిరియును నాగశయనుడు, విహరించు నంది, నెక్కి విశ్వనాథుడు' అంటే అ్యంతరమా?
  అని, అంటే " విహారములు చేయు" travellable
  మిగిలిన అర సున్నలు మార్చుకుటాను


  రిప్లయితొలగించండి
 26. వైనతేయుడు తేరుగా వరలుచుండు
  నాగశయనుడు, విహరించు నందినెక్కి
  శివుడు, నరుపై కుబేరుడు సెలగు చుంద్రు
  చెలువు గూబపై తిరుగాడు సిరియు తాను


  శివుడు, కేశవులన్నట్టి సేవ్యరూప
  ములవి వేరైన, నొకటన్నముదపు తలపు
  నుండు వారల కగుపించు నొప్పుఁగాను
  నాగశయనుడు విహరింపు నంది నెక్కి

  క్షేత్ర పాలురు నగుచును చెలగు చుంద్రు
  నొకరు నొకరికి నాలయాలొప్పు చోట
  కనగనగుపించు మనకట కాంచ తేర్లు
  నాగశయనుడు విహరించు నందినెక్కి

  తిక్క యజ్వయు హరిహర దివ్యరూప
  మొకటె యంచును నద్వైత మొప్పఁ జూపె,
  హరిహరుండను దైవంబు హరువుఁగాను.
  నాగశయనుడు విహరించు నందినెక్కి

  రిప్లయితొలగించండి
 27. డా. విష్ణునందన్ గారి సవరణకు ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 28. పూర్తి వైవిధ్యంగా,పురాణార్ధానికి దూరంగా రాయాలని:

  పనులు లేనట్టి సోమరి బాలుడొకడు
  మూడుపూటల బోనమున్ మొదటె మెక్కి
  మంచమందున నిద్రను మించి పోవు
  నాగ,శయనుడు విహరించు నందినెక్కి.

  మించిపోవునాగ=మించిపోయేటట్లుగా;నంది=ఎద్దు.

  రిప్లయితొలగించండి