14, మే 2015, గురువారం

పద్య రచన - 905

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. లడ్డునెపుడుజూడ లాలాజలమ్మూరు
    దీని తినని జన్మ దేనికంట
    మధురమైన దీని మధుమేహమున్నను
    తినగ జేయలేరు మనసు నదుపు

    రిప్లయితొలగించండి
  2. తిరుపతి లడ్డూ తినుటకు
    పరపతి తాగలిగి నంత బహు శులభంబౌ
    యెరవేయగ నడు గడుగున
    కరుణించగ తిరుమ లేశు కన్నులు మూయన్

    రిప్లయితొలగించండి
  3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘బహు సులభంబౌ| నెరవేయగ...’ అనండి.

    రిప్లయితొలగించండి
  4. లడ్డ! యెందుకే నినుఁ జూడ రమ్యమయ్యు,
    నోరు నూరింతు వెప్పుడు! ఘోరమైన
    యట్టి మధుమేహమున్నవారందఱకును
    బంధమును వైతువే! తిన్న, బాధ లిడుదు!!

    రిప్లయితొలగించండి
  5. లడ్డులు తీపిగ నుండెడి
    ఫుడ్డులు మరియడ్డునాపు బొందక తిన్నన్
    గడ్డుసమయంబు దప్పక
    జిడ్డు వదలుట నిజమౌను జేబుకు, నీకున్

    రిప్లయితొలగించండి
  6. గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. పంచదార లడ్డు బల్ పసందుగ నుండు
    చవికి దీని కేది సాటిరాదు
    తిరుపతిగుడిలోన స్థిరమగురుచిఁగల్గు
    పొందికైన లడ్డుఁ బొగడ తరమె

    రిప్లయితొలగించండి
  8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. తిరుమల నాథుని లడ్డును
    మరువగ జేయంగలట్టి మధురోగిరముల్
    ధరపై గలవే? నయ్యవి
    సురుచిర ఘృతపూరితంబు సుమనోహరముల్

    రిప్లయితొలగించండి
  10. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. తిరుమల లడ్డును జూడన్
    బరాత్పరుఁ డొసఁగు ప్రసాద భావన గలుగున్!
    యిరుగు పొరుగులకుఁ బంచగ
    కరివరదుని గాంచి నటులఁ గైమోడ్చెదరే!

    రిప్లయితొలగించండి
  12. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘కలుగున్+ఇరుగు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘...గలుగు| న్నిరుగు పొరుగులకు...’ అనండి.

    రిప్లయితొలగించండి
  13. గురుదేవులకు ధన్యవాదములు.
    సవరించిన పద్యం :

    తిరుమల లడ్డును జూడన్
    బరాత్పరుఁ డొసఁగు ప్రసాద భావన గలుగు!
    న్నిరుగు పొరుగులకుఁ బంచగ
    కరివరదుని గాంచి నటులఁ గైమోడ్చెదరే!

    రిప్లయితొలగించండి
  14. చిత్ర మందలి లడ్డులు చిత్ర ! చూడు
    మెంత గుండ్రము నుండె నో నంత రుచిని
    కలిగి యుండును నిజమది ,కావ లసిన
    తీసి కొని తిను మిక మఱి తీయ గుండు

    రిప్లయితొలగించండి

  15. పద్య రచన.. తిరుమలదేవుప్రసాదము
    వరమని, లడ్డూలు పరమ భక్తిని తినగా
    పరికింత్రు పెండ్లి జేయగ
    వరుడు,వధువు లడ్లు వోలె భ్రాజిలు రీతిన్
    అరయగ తీయతనానికి
    గురుతైనను,లడ్డు వంటి కోడలు దొరకన్
    చిరుబురు లాడుదు రత్తలు
    వరుడును,యెగతాళి జేయు బంధుజనమ్ముల్
    విరబూసినపూవువోలె
    సిరులొసగినబిడ్డ కన్నక్షేత్రజు డగుచో
    మురియుచు లడ్డూ యనుచును
    కురిపింతురు జనులు ప్రేమ కూరిమి తోడన్

    రిప్లయితొలగించండి
  16. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    మూడవపద్యం మొదటిపాదంలో గణదోషం. ‘విరబూసిన పూవువలెను’ అనండి.

    రిప్లయితొలగించండి
  17. తిరుపతి లడ్డులు బెరుగుచు
    ధర హెచ్చిన?తరుగుచున్న ధర్మము లాగా
    తరిగినవా?వివరించుము
    కరిగెడి మాకాంక్ష లట్లు కలియుగ దేవా?
    2.కన్నులుజేర రూపమిటు-కాంక్షగ నాల్క జలంబు బంచగా?
    తిన్నగముక్కు వాసనలుతీరిక చేతను బీల్చ నెంచగా?
    తిన్నది చిన్నదైన నట దెల్పగ వీనుల విందుబంధమై
    యన్నదిలడ్డులన్న?రుచియందున మేటియెనేటికాలమున్

    రిప్లయితొలగించండి
  18. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  19. గురుదేవులకు ధన్యవాదములు మీసూచనమేరకు
    పద్యము సవరించితిని

    రిప్లయితొలగించండి