చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ‘మీమాంస’ను ‘మిమాంస’ మన్నారు. ***** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
note: ఇక్కడ మీమాంస అనగా కర్మబ్రహ్మప్రతిపాదక శాస్త్రము ,బ్రహ్మజ్ఞానము,జ్ఞానము,ఆధ్యత్మికవిషయ సంగ్రహము ఇత్యాది జ్ఞాన సంబంధ శాస్త్రసంగ్రహానురక్తులై అటువంటి శాస్త్రభక్షణ పరులైనారు ద్విజులు అన్నఅర్ధంలో వ్రాసాను.దోషములున్న మన్నింపుడు .
పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పిరాట్ల వేంకట శివరామకృష్ణ ప్రసాద్ గారూ, పక్షులకు, పాములకు ద్విజ శబ్దం వర్తిస్తుంది. అవి రెండూ మాంసాహారులే. పక్షి, పాములు అంటే ‘ద్విజములు’ అనవలసి ఉంటుంది. కాని ఇక్కడ గరుడుడు, శేషుడు అన్నారు కనుక ‘ద్విజులు’ అన్నారు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కవిశ్రీ సత్తిబాబు గారూ, సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. ఒకసారి ప్రచురితమైన వ్యాఖ్యలను సవరించడానికి అవకాశం లేదు. సవరించిన వ్యాఖ్యను ప్రచురించి, అంతకు ముందున్న వ్యాఖ్యను తొలగించడమే మార్గం.
పిండి వంటల భోజనం ప్రియముఁగాదు కోడి కూరలు వేపుల్లు కూర్చ మనగ బిడ్డ పెళ్లికి వచ్చిన దొడ్డ వారు మేటి యాహ్వానితులలోని మిత్ర వరుల మాంసభక్షణముచే, ద్విజుల్ మాన్యు లైరి!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. తన కుమారుని పెళ్ళిలో బ్రాహ్మణేతరులకోసం ప్రత్యేకంగా మాంసంతో విందుభోజనం పెట్టించిన ఒక బ్రాహ్మణ మిత్రుడు నాకు తెలుసు. ‘భోజనం’ అని వ్యావకారికాన్ని ప్రయోగించారు. ‘పిండివంటల విందులు ప్రియము గాదు’ అనండి.
బొడ్డు శంకరయ్య గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. మూడవపాదంలో గణదోషం. ‘పరాక్రమములఁ’ అనండి. కాని పూరణ విషయమె సమర్థనీయంగా లేదు. బలపరాక్రమాలకోసం బ్రాహ్మణులు మాంసం తిన్నారా?
పెరగు హింసా ప్రవృత్తి యీ పృథ్విమీద
రిప్లయితొలగించండిమాంసభక్షణచే - ద్విజుల్ మాన్యులైరి
సాత్వికాహారమునుతిని చక్కనైన
సాధువర్తనతోనెల్ల జనులు మెచ్చ
ఘనఘ నాపాఠ వర్యులు కలిసి యచట
రిప్లయితొలగించండిఆధియాధేయ సంబంధ మరయు వేళ
ప్రేమ నిడినట్టి భక్ష్యముల్, విడుచుచు మి
మాంస, భక్షణ చే ద్విజుల్ మాన్యులైరి
ముద్రా రాక్షసము వల్ల మూడవ పాదము చివర
తొలగించండివిడుచుచు 'ను ' వ్యస్తమయింది. పెద్దలు క్షమించ
ప్రార్థన
ప్రకృతి నీతోడ బుట్టిని ప్రాణి జంపి
రిప్లయితొలగించండియారగించుటమానుషమంచు దెలిసి
విశ్వ వినుత సదాచార విధి నిషిద్ధ
మాంస భక్షణ చే ద్విజుల్ మాన్యులైరి
సాత్వికాహారము దినిన చక్కగాను
రిప్లయితొలగించండితామసమ్మును తగ్గించి దయను బెంచు
శక్తి నిడు పాలు పెరుగులు చవిగొనుచు, న
మాంస భక్షణచే ద్విజుల్ మాన్యులైరి!!!
తామసగుణమ్ముఁ బెంచెడిదై పలలము
రిప్లయితొలగించండిబుద్ధిమాంద్యమ్ము గలిగించు, పూత దైవ
వర్తనులు గాన లోకాన వర్జితమగు
మాంసభక్షణచే ద్విజుల్ మాన్యులైరి.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘మీమాంస’ను ‘మిమాంస’ మన్నారు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్కారములతో...
రిప్లయితొలగించండిద్విజుఁడు గరుడుండుఁ దేరయ్యె విష్ణువునకు!
ద్విజుఁడు శేషుండుఁ బరుపయ్యె విష్ణువునకు!
బండియుం బాన్పులై విష్ణు భక్తులయ్యు
మాంసభక్షణచే ద్విజుల్ మాన్యులైరి!!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండివాహ్! మీ రూటే సపరేటు! ద్విజశబ్దంతో గారడీ చేసి అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు, ధన్యవాదాలు.
ధన్యవాదములు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండికవిశీ సత్తిబాబు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటిపాదంలో యతి, రెండవపాదంలో గణం తప్పాయి. సవరించండి.
మొరటు వారగు దురుగద నరులు భువిని
రిప్లయితొలగించండిమాంస భక్షణ చే, ద్విజుల్ మాన్యు లైరి
శాస్త్ర ప ఠ నము వలనన ,చదువు సంధ్య
లొరుల కు గఱపు మూలాన నొజ్జ లగుచు
కందిపప్పునుండి గొనుచు కరము శక్తి
రిప్లయితొలగించండిజీవ హించను పనిగొని చేయకుండ
వివిధయజ్ఞములందున వీడినట్టి
మాంస భక్షణచే ద్విజుల్ మాన్యులైరి
గుండు మధుసూదన్ గారు మీ పద్యం లో వివరం కొంచెం వివరిస్తారా? పై పాదాలలో చెప్పిన పాత్రలకి కింద సమస్యలో వున్నా మాంస భక్షనకి సంబంధం వివరించగలరు.
రిప్లయితొలగించండితే.గీ.కర్మ వేదాంత శాస్త్రముగాంచుఘనులు
రిప్లయితొలగించండిబ్రహ్మ తత్వము నలరెడి ప్రాభవమున
మాంసభక్షణచే ద్విజుల్ మాన్యులైరి!!
మేలు పలికెడి మీమాంస మేధతోడ
note: ఇక్కడ మీమాంస అనగా కర్మబ్రహ్మప్రతిపాదక శాస్త్రము ,బ్రహ్మజ్ఞానము,జ్ఞానము,ఆధ్యత్మికవిషయ సంగ్రహము ఇత్యాది జ్ఞాన సంబంధ శాస్త్రసంగ్రహానురక్తులై అటువంటి శాస్త్రభక్షణ పరులైనారు ద్విజులు అన్నఅర్ధంలో వ్రాసాను.దోషములున్న మన్నింపుడు .
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిక్రీడల కొరకై కండలు దృడము చేయ
మాంస భక్షణ తలపు మీమాంస యందు
చిక్కి సాంప్రదా యమునకు చిచ్చు బెట్టి
మాంస, భక్షణ చే ద్విజుల్ మాన్యులైరి
నాకు మీ భొగ్ లొ సరిచేయుట తెలియక.. రెండు పర్యాయములు ఇబ్బంది పడి.. మూడవసారి ప్రచిరించుట జరిగినది... క్షమించవలెను.
రిప్లయితొలగించండిపోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పిరాట్ల వేంకట శివరామకృష్ణ ప్రసాద్ గారూ,
పక్షులకు, పాములకు ద్విజ శబ్దం వర్తిస్తుంది. అవి రెండూ మాంసాహారులే. పక్షి, పాములు అంటే ‘ద్విజములు’ అనవలసి ఉంటుంది. కాని ఇక్కడ గరుడుడు, శేషుడు అన్నారు కనుక ‘ద్విజులు’ అన్నారు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కవిశ్రీ సత్తిబాబు గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఒకసారి ప్రచురితమైన వ్యాఖ్యలను సవరించడానికి అవకాశం లేదు. సవరించిన వ్యాఖ్యను ప్రచురించి, అంతకు ముందున్న వ్యాఖ్యను తొలగించడమే మార్గం.
1.క్రూర జంతువుల్ బ్రతుకుటక్రొత్త గాదు
రిప్లయితొలగించండిమాంస బక్షణచే””|ద్యిజుల్ మాన్యు లైరి
జన్మ కొకసారి,జంద్యమ్ము జతకుమరల
వేసి గాయత్రి మంత్రమ్ము పిలుపు చేత
2.జీవ రక్షణ లేనట్టి భావన లగు
మాంస భక్షణచే|ద్యిజుల్ మాన్యులైరి
జీవహింసను విడనాడ|శ్రేయమొసగ?
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవపూరణలో ఒక పాదం తక్కువయింది.
పిండి వంటల భోజనం ప్రియముఁగాదు
రిప్లయితొలగించండికోడి కూరలు వేపుల్లు కూర్చ మనగ
బిడ్డ పెళ్లికి వచ్చిన దొడ్డ వారు
మేటి యాహ్వానితులలోని మిత్ర వరుల
మాంసభక్షణముచే, ద్విజుల్ మాన్యు లైరి!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తన కుమారుని పెళ్ళిలో బ్రాహ్మణేతరులకోసం ప్రత్యేకంగా మాంసంతో విందుభోజనం పెట్టించిన ఒక బ్రాహ్మణ మిత్రుడు నాకు తెలుసు.
‘భోజనం’ అని వ్యావకారికాన్ని ప్రయోగించారు. ‘పిండివంటల విందులు ప్రియము గాదు’ అనండి.
రాజ్యలక్ష్మిని గాపాడ రణముజేయ
రిప్లయితొలగించండిప్రజల సంక్షేమము కొరకు పనులు జేయ
బాహుబలపరాక్రమముఁ బడయగోరి
మాంస భక్షణచే ద్విజుల్ మాన్యులైరి!
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
రిప్లయితొలగించండిపిండి వంటల విందులు ప్రియముఁగాదు
కోడి కూరలు వేపుల్లు కూర్చ మనగ
బిడ్డ పెళ్లికి వచ్చిన దొడ్డ వారు
మేటి యాహ్వానితులలోని మిత్ర వరుల
మాంసభక్షణముచే, ద్విజుల్ మాన్యు లైరి!
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
మూడవపాదంలో గణదోషం. ‘పరాక్రమములఁ’ అనండి.
కాని పూరణ విషయమె సమర్థనీయంగా లేదు. బలపరాక్రమాలకోసం బ్రాహ్మణులు మాంసం తిన్నారా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరయ్యగారూ,
రిప్లయితొలగించండిపిరాట్లవారికి మీరిచ్చిన సమాధానమే నా సమాధానము!
అట్లే, మీ పూరణమును నే నీ యుదయాన గమనించనేలేదు. ఇంతకు మునుపే చూచితిని. బాగున్నది మీ పూరణము. అభినందనలు.
నా రెండవ పూరణము:
రిప్లయితొలగించండియజ్ఞపశువును బలియిచ్చి, యట్టి మాంస
మునుఁ దినం దామసులకిడి, భుక్తులుగ నొ
నర్పఁ, దద్యజ్ఞఫలదపుం దామస కృత
మాంస భక్షణచే, ద్విజుల్ మాన్యులైరి!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
గురు దేవులకు నమస్సులు, క్షత్రీయుల నుద్ధేశించి వ్రాసిన పూరణ యని గమనించ మనవి.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసవరణకు ధన్యవాదములు
రిప్లయితొలగించండి