20, మే 2015, బుధవారం

పద్య రచన - 911

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20 కామెంట్‌లు:

 1. ఆ ఫోటోను పట్టుటకు,పెట్టుటకు
  సమయమున్న మానవా ! ఆ పాటి
  సమయము నై నను చదువు నేర్వ లేని
  పిల్లలకి కేటాయించి విద్య నేర్పిన మేలౌ !


  (జిలేబి)
  (బ్లాగు లోకం లో ఈ ఫోటో కి పద్యరచన చేసేవారికిన్నూ ఇది వర్తించును )

  రిప్లయితొలగించండి
 2. జిలేబీ గారూ,
  మీ భావానికి నా ఛందోరూపం....

  బండ నెత్తు పాప పటము పట్టి పద్య
  మల్లు సమయ మున్న కవీంద్ర! పిల్లదాని
  కొఱకు కొంత సమయ మిచ్చి గుణము బెంచు
  విద్య నేర్పిన మేలగు సద్యశ మిడు.

  రిప్లయితొలగించండి
 3. రాయిని మోయగ వలదిక
  వ్రాయుట జదువుటను నేర్వవలె నీ వయసున్
  రాయిని మెట్టుగ వాడుము
  వ్రాయుట జూపెట్టి యెక్కు వరుసగ మెట్లన్.

  రిప్లయితొలగించండి
 4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. పాప మాపిల్ల రాళ్లు జే బట్టి దలను
  బెట్టి మోయు చుండెను నార్య !పెద్ద బండ
  మోయ లేకుండె జూడుడు ముఖము తనది
  సకల సంపద లిచ్చుత ! శంక రుండు

  రిప్లయితొలగించండి
 6. రాయి మోయు టేల హాయిగా చదువక?
  యన్న జదివి బాగనెదుగు కొరకు!
  నీదు జీవితమ్ము నెరవేరు టెట్లమ్మ?
  యన్నబాగు పడిననాదుకొనడె!?

  ఆశ పడుట లోన నభ్యంతరము లేదు
  కాదు కూడదన్న కలికి యెటులె?
  మాదు బ్రతుకు లింతె! మారాజ వినుమయ్య!!
  గ్రుడ్డివాడు నాన్న కుంటి దమ్మ!!!

  రిప్లయితొలగించండి
 7. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. మెండుగ పాఠశాలలను మేలును గోరుచు నూరువాడలన్
  దండిగ నిల్పి విద్యను ప్రదానము చేయ ప్రభుత్వముండగా
  బండను మోయుదుస్థితికి బాలిక యెట్టుల వచ్చి చేరెనో
  దండన కర్హులైరి తలి దండ్రులు పంపక పాఠశాలకున్

  రిప్లయితొలగించండి
 9. మొన్న కట్టె గొట్టుచు నుండె ముదుస లొకతె
  నేడు చిన్నది పెనుబండ నెత్తి నెట్టె
  ఆ కలికి వృద్ధులు శిశువు లనుట లేదు
  ధరను దారిద్ర్య మత్యంత దారుణంబు

  రిప్లయితొలగించండి
 10. శంకరయ్య గురువుగారు
  జిలేబి గారు ఫోటోగ్రాఫర్ కు ఉచిత సలహా ఇస్తే, మీరు కవికి
  అంటే జిలేబి గారికి అదే సలహా ఇచ్చినట్టున్నారు.
  అన్యధా భావించవద్దు, నాకలా అనిపించింది

  రిప్లయితొలగించండి
 11. చిన్న పిల్లలు చదువు కోకుండా , ముసలి వారు 'రామ కృష్ణా' అనుకోకుండా అలా ఎందుకుచెయ్యాలి అనుకుంటాము. కానీ వారి పరిస్థితి అలా ఉంటుంది. అందుక దారిద్య్రం చాలా చెడ్డది

  రిప్లయితొలగించండి
 12. కుసుమకోమల మైన పసిబాలురెందరో
  ---------వెట్టిచాకిరియందు వెతలు జెంద
  పొట్ట కూటికొరకు కట్టు బాట్లను మాని
  -----------చట్టాల పట్టాలు సాగనీక
  బాల్యపు ముల్యము భావన లనుకోక
  ------------స్వార్థ చింతన లందు ఫణము కొరకు
  చదువు సంద్యలు మాన్పి సంసారభారంబు
  ---------రాళ్ళలా మోయించ?రాబడెంత?
  పసిడి బాల్యంబు పనులతో ఫైకిరారు
  చదువు సంస్కార మెట్లబ్బు ?సంపదేది?
  కలిమి బలిమికివిద్యయే విలువ లొసగు|
  వెట్టి చాకిరి మాన్పుమా పట్టుదలగ

  రిప్లయితొలగించండి
 13. పొట్ట కూటి కొఱకు పుడమిపై నిలబడి
  పెద్ద బరువు మోయు పిన్న పాప
  వెట్టి పనుల నుండి విడుదల యెప్పుడో
  యెవరు జెప్ప గలరు యిలను దేవ.

  రిప్లయితొలగించండి
 14. పొట్ట కూటి కొఱకు పుడమిపై నిలబడి
  పెద్ద బరువు మోయు పిన్న పాప
  వెట్టి పనుల నుండి విడుదల యెప్పుడో
  యెవరు జెప్ప గలరు యిలను దేవ.

  రిప్లయితొలగించండి
 15. సూటిగ నడుగుచు నున్నది
  ఆటలనాడే వయస్సు అమ్మాయిటులన్
  ''చీకటి బ్రతుకులు మారవ?
  కూటికి రాళ్లెత్తు కర్మ కూనల కేలా?''

  రిప్లయితొలగించండి
 16. సూటిగ నడుగుచు నున్నది
  ఆటలనాడే వయస్సు అమ్మాయిటులన్
  ''నేటికి బ్రతుకులు మారవ?
  కూటికి రాళ్లెత్తు కర్మ కూనల కేలా?''

  రిప్లయితొలగించండి
 17. విద్య హక్కు తెలుపు వేవేల "ఛానళ్ళు"
  విధిని మార్చ రేమి విధము దెల్పి ?
  బరువు మోయు విద్య బాల్యము చిదుమంగ
  భరత జాతి కేది భావి బతుకు
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 18. బండ బారగ బాల్యమంతా
  బండ రాయిల బరువుతో గుది
  బండ లాగా బతుకు చేసిన
  బండ మనసుల గని

  వూతమివ్వక వూరకుండక
  చేతనమ్ముతొ చేవ చూపుతు
  నీతిమంతులు నీచజనులకు
  వాతలే పెట్టన్

  చిట్టి చేతుల చిగురు పూయద
  వెట్టి బతుకున వెలుగు నిండద
  యట్టి బాలల యాతనమ్ముల
  మట్టి కరిపించన్

  రిప్లయితొలగించండి
 19. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  జిలేబీ గారు ఫోటోగ్రాఫర్‍కే కాదు, దానిని బ్లాగులో ‘పెట్టిన’ నాకూ, పరోక్షంగా దానిపై పద్యాలు వ్రాసిన కవులకూ అక్షింతలు వేశారు!
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘...గలరు+ఇలను’ అన్నప్పుడు యడాగమం రాదు.
  *****
  గండూరి లక్షినారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘అమ్మాయి+ఇటులన్’ అన్నప్పుడు యడాగమం వస్తుంది, సంధి లేదు. ‘అమ్మాయి యిటుల్’ అనండి.
  *****
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  పల్లా నరేంద్ర గారూ,
  మీ ముత్యాలసరాలు బాగున్నవి. అభినందనలు.
  కాని మన బ్లాగులో మాత్రాఛందస్సులో వ్రాసే గీతాలకు అవకాశం లేదు. గమనించండి.

  రిప్లయితొలగించండి