25, మే 2015, సోమవారం

పద్య రచన - 916

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. అబ్బా!ఎండాకాలము
    కొబ్బరి బోండమ్ము త్రాగ కోరును మనసే
    అబ్బురమేల యిదియె వడ
    దెబ్బ తగులకుండగాచు దవ్యౌషధమై

    రిప్లయితొలగించండి
  2. కొబ్బరి బొండము త్రాగిన
    నిబ్బరముగ నుండు తనువు నిక్కము సుమ్మీ
    దబ్బున శుభకార్య ములకు
    కొబ్బరి మనకల్ప తరువు కోరిన వరమౌ

    రిప్లయితొలగించండి
  3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. సూరీడు కాల్చుచుండిన
    నేరీతిగ నిలుతుననుచు నేడ్వక నపుడే
    భారీ కొబ్బరి బోండము
    చేరిచి నూ కొట్టి త్రాగ సేదనుదీర్చున్.

    రిప్లయితొలగించండి
  5. చల్లని కొబ్బరి బొండము
    నెల్లరకును మేలుజేయు నెండల వేళన్
    మెల్లగ బీల్చుచు ద్రాగగ
    నుల్లాసము గలుగ జేయు నోషధి యిదియే !!!

    రిప్లయితొలగించండి
  6. కొబ్బరి బోండమందుగల కొద్ది జలమ్మున పోషకమ్ములే
    యబ్బుర పర్చునట్టులుగ నందున నుండు నటంచు తెల్సియున్
    దబ్బున చేతబట్టి తన దాహము తీరగ త్రాగి వేడెఁ నీ
    రబ్బు మరింత యెక్కువయె రాకుడ! మాపయి జాలిజూపుమా!

    రిప్లయితొలగించండి
  7. అబ్బాయనిపించునిలన్
    కొబ్బరిబోండము తనువున కొసగును హాయిన్
    నిబ్బరమిచ్చును త్రాగిన
    శుబ్బరముగ గైకొనగనె సుఖమును యొసగున్.

    రిప్లయితొలగించండి
  8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. ఉకారంతో జరిగే యడాగమాన్ని శంకరయ్యగారు ఎందుకో ఉపేక్షిస్తునారు.(ఉమాదేవిగారి పద్యంలో చివరిపాదం)

    రిప్లయితొలగించండి
  10. శీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    సమీక్షిస్తున్న సమయంలో ఇంటికి బంధువులు వచ్చారు. వారితో మాట్లాడాలన్న తొందరలో అసలు పద్యం చదవకుండానే వ్యాఖ్యానించాను. మన్నించండి.
    ఉమాదేవి గారి పద్యంలో యడాగమ దోషమే కాక, ‘శుబ్బరము’ అనడమూ దోషమే.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. ఎండ వేడిమి యధిక ముండె గతన
    దేహ మందలి తాపము దీర్చు కొనగ
    చిత్ర మందున బాలుడు చేత బట్టి
    త్రాగు చుండెను బొండము దనివి దీర

    రిప్లయితొలగించండి
  12. చెల్లని పానియాలడుగు-చెంచల తత్వము మానసంబులో
    కల్లనిజంబు గాదెపుడు| కాంక్షల యందున వేడిగాడ్పులే
    నల్లుకొనంగ?లోకులకునందిన కొబ్బరి నీరు నెంచగా?
    “చల్లని హాయి బంచి పరిచర్యలుగూర్చు| శరీర మంతటన్|
    2,చల్లనినీటి కంటె పరిచర్యల చల్లని గాలిమేలు|మా
    పల్లెల చెట్ల నీడ పరివారము బంచెడి మంచి సూత్రముల్
    “తల్లడముంచు –గ్రీష్మ పరితాపము మాన్పును|చెట్లుబెంచగా?
    కల్ల నిజాలుగామొలచి ?కామిత సిద్ధికి మూల బంధమౌ|

    రిప్లయితొలగించండి
  13. మిత్రులందఱకు నమస్సులతో...

    "ఎండదెబ్బకు దాహమ్మదెక్కువ యయెఁ!
    ద్రాగుటకుఁ జుక్క నీరైన దక్కదాయె!
    బుడుత! నాకిమ్ము కొబ్బరిబోండ మిపుడు!
    త్రాగి నా దాహ మది తీర నేగెదనయ!!"

    రిప్లయితొలగించండి
  14. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మొదటిపాదంలో గణదోషం. ‘ఎండవేడిమి యెక్కువై యుండు కతన’ అనండి.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘పానీయము’ని ‘పానియము’ అన్నారు.
    యతికోసం ‘చంచల’ను ‘చెంచల’ చేశారు.
    ‘గాడ్పులే యల్లుకొనంగ’ అనండి.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    పక్షులట్లు గూలి పలువురు పడిపోవ
    వంద వంద జనులు మ్రంద జూడ
    మానవాళి పైన మార్తాండ శక్తిగా
    విసురు చుండె నాంధ్ర వేడి గాలి

    నిన్నటి నా పద్యం మూడవ పాదంలోని పదం ''చేదుర్''నకు నా వివరణ :-
    చేయుదురు అను పదమునకు చేదురు గ్రామ్యమును వాడితిని . ఆపదం ఆమోద
    యోగ్యం కానిచో పద్యం లోని రెండవ పాదం క్రింది విధంగా మార్పు చేయ వచ్చును
    '' చెంతన్ జేరిన వారి ప్రొద్బలమదే చేదున్ గొనన్ జూడమే '
    చేఁదు :- ఆకర్షించు
    ఆధారం :- శబ్దరత్నాకరము

    రిప్లయితొలగించండి
  16. మండెడు నెండల దిరుగుచుఁ
    గుండలతో నీరుఁ ద్రాగఁ గొదువే చూడన్ !
    గండము దీర్చెడు కొబ్బరి
    బోండము నొకటున్న జాలు మోదము గాదే?

    రిప్లయితొలగించండి
  17. భాగవతుల కృష్ణారావు గారూ,
    ఈనాటి ‘న్యస్తాక్షరి’లో నాస్పందన చూడండి.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి