రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** నాగరాజు రవీందర్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
దాహార్తిని దీర్చుటకని
రిప్లయితొలగించండియాహా నిదిమంచి హేతు వటసన్మా నితమున్
మోహము నందున నిందిర
సోహము తానంచు వచ్చె శుభమును బలుకన్
సూర్యకిరణాల ధాటికి సొమ్మ సిల్లి
రిప్లయితొలగించండిపిట్టలవలె రాలుచునుండ పేద వారు
మంచినీరమునిచ్చుచు నంచితముగ
సేవచేయుచుందురచట సేదదీర్చ
చలివేంద్ర మునడుపుట కని
రిప్లయితొలగించండిపిలచిరి స్వాగత మటంచు పి.యిందిరనే
సలిలము చల్లని వనుచును
పలువురు ప్రియమార త్రాగి వందన మిడగన్
దప్పి దీర్చుట కొఱకు నై ధర్మ ప్రభులు
రిప్లయితొలగించండిమట్టి కుండల యందున మంచి నీరు
వీధి వీధుల నడుమన బెట్టు చుండి
తీర్చు చుండిరి దాహము దెరువరులకు
ఆ.వె:కుండ లోని నీరు గ్రుక్కెడు త్రాగినా
రిప్లయితొలగించండిగొంతు తడిసి పోయి గుండె నిండు
యింత కంటె పుణ్య మిలనొండుగల్గునా
ప్రపల వలన ప్రజల బాధ తీరు.
ఆ.వె:కుండ లోని నీరు గ్రుక్కెడు త్రాగినా
రిప్లయితొలగించండిగొంతు తడిసి పోయి గుండె నిండు
యింత కంటె పుణ్య మిలనొండుగల్గునా
ప్రపల వలన ప్రజల బాధ తీరు.
పంచేంద్రియముల నిలువక
రిప్లయితొలగించండిసంచలనముచేత ఎండ సాగగ?””నీరే
పంచగ చలి వేంద్రము
లుంచిరి |దప్పికను మాన్పు యూహలచేతన్”.
2.నీరిల లేని జీవితము-నిత్య సుఖాలకు చోటు లేకనే
దారియు లేని గమ్యమగు|”దప్పిక చేత శరీర ముండియున్
తీరనిపాట్లు గాన ?ఘన తీర్థమగున్ తగునీరు జిక్కగా”|
బేరములాడనట్టి చలివేంద్రము లోకుల రక్షణార్థమే|
ఎండిన కడుపుల కొరకై
రిప్లయితొలగించండిమండెడి ఈ యెండలోన మసలు ప్రజలకున్
గుండెలు చల్లార్చుటకై
కుండల చలి నీళ్ళ నిచ్చు కొడుకా శుభమౌ
కిరణపు గొట్టమ్ములతో
రిప్లయితొలగించండిధరణీ జన జీవరసముఁ దపనుడుఁ ద్రాగన్!
భరటుని కుండలు వెలసిన
వరుణపు చలివేంద్రము లవి బ్రహ్మరసమిడున్!
అగ్ని వర్షమై కురియగ నవని పైన
రిప్లయితొలగించండితాప తప్తమై ధారుణి తల్లడిల్లె
జనులు నిర్జల గాత్రులై చచ్చు బడిరి
బ్రతుకు నిర్వీర్య దుస్సహ భరిత మయ్యె
అనలు డధికుడైన యనిలు డధముడయ్యె
అనిలు డంతట ధరవీడి యరిగె నెటకొ
ప్రాణ ( వాయువు) హీనులై మనుజులు బాధ పడగ
అవని యంత హాహాకార మలము కొనియె
ఘర్మ జలనష్ట బాధితుల్ క్రాగుచుండ
ధర్మ గుణదీప్తు లెవ్వరొ దాని గాంచి
పాంథ సుసలిలా గారముల్ భక్తి నిడిరి
సాటి వారల సేవకు సాటి యెద్ది
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
ఇందిర చేతుల పై చలి
రిప్లయితొలగించండివేందిర ప్రారంభమాయె వేగిర పడి రా
వేందిర! మార్తాండు ప్రభల
సందడినే లెక్కగొనక సరగున త్రాగన్
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.