ఆంజనేయుడు చెచ్చెర నబ్ధి దాటి సీత జాడకై వెదకె నిశీథ మందు రావణుని గృహమునను తా రయమున చని పడకపై శయనించిన పడతిగాంచి పార్థివిగ తనమదిలోన భ్రమము నొందె పిదప తప్పు తెలిసికొని వదలెనచటు
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. రెండవపాదంలో లఘువుతో ప్రారంభమయింది. ‘జానకి మాతను వెదుకగ| బూనిన మారుతి దశాస్యు పురి నంతిపురిన్’ అందామా? ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘నిర్ధరించె’...? ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
మిస్సన్న గారూ, మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు. రావణుని ప్రక్కనున్న సుందరాంగి సీత కాదని హనుమంతుడు నిర్ధారించుకున్న విషయాన్ని కూడా చెప్తే బాగుండేది. మూడవ పద్యాన్ని యడాగమంతో ప్రారంభించారు.
మిస్సన్న గారూ, నా సూచన ననుసరించి అదనంగా చక్కని పద్యాలను చేర్చారు. సంతోషం, అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, నేను ‘పురి నంతిపురిన్’ అని సూచిస్తే మీరు ‘పురి నంతఃపురిలోన్’ అన్నారు. దానితో గణభంగం.
లంకేశు మందిరంబున
రిప్లయితొలగించండిపంకజ ముఖులంత నిదుర భంగిమ లొలుకన్
కింకరు వలెవెదకి హనుమ
సంకట ముగదిరిగె నంత సందే హమునన్
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఆ.వె: జానకి మాతను వెదకగ
రిప్లయితొలగించండిహనుమంతుడు లంకలోన యంతః పురిలోన్
దానవ వనితలు వ్యస్తము
గా నిద్రించుట గనుచు మొగంబటు ద్రిప్పెన్.
రావ ణుం డచట దనదు రాణి తోడ
రిప్లయితొలగించండినిదుర బోవుచుం డ హనుమ నెలతు లొక్క
రొకరి నిగనుచు మెల్లగా నొక్క రొకరి
ని మఱి దాటుకొ నుచునుబో నిర్ధ రించె
ఆంజనేయుడు చెచ్చెర నబ్ధి దాటి
రిప్లయితొలగించండిసీత జాడకై వెదకె నిశీథ మందు
రావణుని గృహమునను తా రయమున చని
పడకపై శయనించిన పడతిగాంచి
పార్థివిగ తనమదిలోన భ్రమము నొందె
పిదప తప్పు తెలిసికొని వదలెనచటు
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రెండవపాదంలో లఘువుతో ప్రారంభమయింది. ‘జానకి మాతను వెదుకగ| బూనిన మారుతి దశాస్యు పురి నంతిపురిన్’ అందామా?
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘నిర్ధరించె’...?
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
రావణు శయ్యపై పడుచు రాణిని గాంచిన వాయునందనుం
రిప్లయితొలగించండిడావిరిబోణి సీతయని హర్షము నొందెను చూచినాడ నే
నీవసుధాత్మజాతనని హిప్పని తోకను కొట్టె నేలపై
రావము చేసె మెల్లగను రంగుగ చూపెను కోతి చేష్టలన్.
********
కామ మోహితలై తేలి కామకేళి
నసుర రాజుతో సుఖియించి యలసిపోయి
వస్త్రభూషలు వ్యస్తమై బడలిక గొని
నిదుర వోయిన స్త్రీల ననిలజుడు గనె.
యిట్టి దృశ్యములను జూచి నట్టి నేను
పాపకార్యము చేసిన ఫలము నొందు
వాడనగుదునా యేమి? నే వాంఛతోడ
కాన లేదివి లేదే వికార మెడద.
అనుచు తలపోసి వెడలి నాడచటినుండి
సీత జాడను గనలేని చింత తోడ
రామ మూర్తిని స్మరియించి రమ్యమైన
వనము నొక్కటి జూచెనా వానరుండు.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
రావణుని ప్రక్కనున్న సుందరాంగి సీత కాదని హనుమంతుడు నిర్ధారించుకున్న విషయాన్ని కూడా చెప్తే బాగుండేది.
మూడవ పద్యాన్ని యడాగమంతో ప్రారంభించారు.
రిప్లయితొలగించండిగురువుగారికి ధన్యవాదములతో వారి సూచన ననుసరించి సవరించితిని.
రావణు శయ్యపై పడుచు రాణిని గాంచిన వాయునందనుం
డావిరిబోణి సీతయని హర్షము నొందెను చూచినాడ నే
నీవసుధాత్మజాతనని హిప్పని తోకను కొట్టె నేలపై
రావము చేసె మెల్లగను రంగుగ చూపెను కోతి చేష్టలన్.
మరల యోచించె మారుతి మనమునందు
నెంత వెఱ్ఱిని సీత హృదంతరమున
నైన తలచునే యన్యుడౌ వాని నామె
పరమసాధ్వి రావణు నెట్లు బడయ గలదు?
రావణుని ప్రక్క నున్నట్టి రమణిని కుజ
యని తలచి యొనరించి నా నఘముననుచు
పరితపించెను మారుతి పురము నందు
నంగుళమునైన విడువక యరయ జనెను.
కామ మోహితలై తేలి కామకేళి
నసుర రాజుతో సుఖియించి యలసిపోయి
వస్త్రభూషలు వ్యస్తమై బడలిక గొని
నిదుర వోయిన స్త్రీల ననిలజుడు గనె.
ఇట్టి దృశ్యములను జూచి నట్టి నేను
పాపకార్యము చేసిన ఫలము నొందు
వాడనగుదునా యేమి? నే వాంఛతోడ
కాన లేదివి లేదే వికార మెడద.
అనుచు తలపోసి వెడలి నాడచటినుండి
సీత జాడను గనలేని చింత తోడ
రామ మూర్తిని స్మరియించి రమ్యమైన
వనము నొక్కటి జూచెనా వానరుండు.
వె: జానకి మాతను వెదకగ
రిప్లయితొలగించండిబూనిన మారుతి దశాస్యు పురినంతః పురిలోన్
దానవ వనితలు వ్యస్తము
గా నిద్రించుట గనుచు మొగంబటు ద్రిప్పెన్.
ధన్యవాదాలండి శంకరయ్యగారూ.మార్చి వ్రాశాను.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండినా సూచన ననుసరించి అదనంగా చక్కని పద్యాలను చేర్చారు. సంతోషం, అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
నేను ‘పురి నంతిపురిన్’ అని సూచిస్తే మీరు ‘పురి నంతఃపురిలోన్’ అన్నారు. దానితో గణభంగం.
రావణాసుర ప్రక్క నున్నది రామ సీతగఁ దల్చితిన్!
రిప్లయితొలగించండిచావ కుండగ జీవ నాడులు సాగుతున్నవి యేలనో?
కావు కావివి చూడఁ దగ్గవి కావు కావని మారుతే
దోవ మార్చెను కళ్లు మూసుకు తొల్లి కార్యము చూడగన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘రావణాసురు ప్రక్క’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురుదేవులకు ధన్యవాదములు. టైపాటు సవరణతో :
రిప్లయితొలగించండిరావణాసురు ప్రక్క నున్నది రామ సీతగఁ దల్చితిన్!
చావ కుండగ జీవ నాడులు సాగుతున్నవి యేలనో?
కావు కావివి చూడఁ దగ్గవి కావు కావని మారుతే
దోవ మార్చెను కళ్లు మూసుకు తొల్లి కార్యము చూడగన్!