రాజేశ్వరి అక్కయ్యా, సాహసం చేశారు. పద్యం బాగున్నది. అభినందనలు. కాని భావం అవగతం కాలేదు. కొద్దిగా వివరిస్తే బాగుంటుందేమో? ***** నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మూడవపాదంలో గణదోషం. ‘చక్కగ దింటిని వచ్చు నంతలో/దారిలో’ అనండి. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండు మధుసూదన్ గారూ, మీ ఉత్పలమాలికా పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
గురువులకు ధన్య వాదములు వ్రేలిమీద గోరుమొలిచింది కదా అని మొగుణ్ణి వేరే ఉండమనడం ఎంత అసహజమో , ముల్లును తీయడానికి గొడ్డలి కావాలను కోవడం కుడా అంతే అసహజం కదా , ఇలాంటి అసహజమైనవి చెప్పి మభ్య పెట్టడం కంటే నాకో నీలపు రాయి ముక్కెర ఇస్తే అన్నిటికీ దిగదుడుపుగా చాలా సంతోషిస్తాను " అని నాభవం " ఇంతకీ నామనసులో భావం అందరికీ అర్ధమౌతుందని నే ననుకోవడం కుడా అంతే అసహజం ........ఔనా ?
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, విష్ణుగుప్తుని ప్రతికారప్రస్తావనతో మీ మొదటి పూరణ బాగున్నది. అభినందనలు. ‘విష్ణుగుప్తుకున్’ అనరాదు. ‘విష్ణుగుప్తునకున్’ సరియైన ప్రయోగం. పరిహాసాత్మకమైన మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, పరమానందయ్య శిష్యుల ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘ఆలస మేల యంచు’ అనండి. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ****** పిరాట్ల ప్రసాద్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** అక్కయ్యా, మీ వివరణతో మీ భావం అవగతమైంది. సంతోషం! ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వ్రేలిని గోరుమొ ల్చినది వేరుగ నుండర వెఱ్ఱి గేస్తుడా
రిప్లయితొలగించండికాలికి ముల్లు గ్రుచ్చినది కావలె గొడ్డలి దానిఁ దీయఁగన్
నీలపు రాయి ముక్కెరను నేరుగ దెచ్చిన సంతసిం తునే
చాలిక నీదుసా హసపు జాలిని గొల్పెడి మాటలే టికిన్
మేలుగ పూలమొక్కలను మెచ్చగ బెంచితి నింటి తోటలో
రిప్లయితొలగించండిమూలలు మూలలున్ దిరిగి మొక్కల నీటిని పోయగా నటన్
కాలునివోలె మొల్చినది కాండము లావయె తుమ్మ మొక్కయే
కాలికి ముల్లు గ్రుచ్చినది, కావలె గొడ్డలి దానిఁ దీయఁగన్.
కృష్ణ పరమాత్మ, సంధికోరి సుయోధనునితో
రిప్లయితొలగించండిచాలిక నీ విరుద్ధ, విషసామ్య విచారపు దుర్విచేష్టలున్
కాలికి ముల్లు గ్రుచ్చినది కావలె గొడ్డలి దానిదీయగన్
లీలగ యందురే, వినుము, లేదనబోకు సుయోధనా, గడున్
మేలగు సంధికార్యములు, మీవగు నైదుపురంబులిచ్చినన్
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్కారములతో...
రిప్లయితొలగించండి(మయసభయందు సుయోధనుండు భంగపడి, యోచించిన సందర్భము)
ఉత్పలమాలిక:
“ఏలిక కిద్ది వింతె, భళి! యిట్టి సరోజము చిత్రమే సుమా!
చాల కుతూహలమ్ము మన సంతయుఁ గ్రమ్మె” నటంచు శీఘ్రమే
కాలిని నేలపై నిడియుఁ, గ్రక్కునఁ గూపమునందుఁ గూలఁగన్,
దాలిమి లేని చేటి కని, దబ్బున నవ్వె! సుయోధనుండు “నే
నేలకొ యా సభన్ గనఁగ నేగితి? నేగితిపో సరోజ మే
నేలఁ బరీక్ష సేయవలె? నేలొకొ కూపమునందుఁ గూలితిన్?
గూలితి పొమ్ము, ద్రోవదియె గొబ్బున నవ్వె సహింపఁజాల! నే
నేల సహింపఁగావలెను? నిశ్చయ మిద్దియె, చచ్చె దే నిఁకన్!
జాలు! మనంగ నున్నఁ దగు చర్యను దానిఁ బరాభవింతు! నా
కాలికి ముల్లు గ్రుచ్చినది! కావలె గొడ్డలి దానిఁ దీయఁగన్!!”
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిసాహసం చేశారు. పద్యం బాగున్నది. అభినందనలు.
కాని భావం అవగతం కాలేదు. కొద్దిగా వివరిస్తే బాగుంటుందేమో?
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపాదంలో గణదోషం. ‘చక్కగ దింటిని వచ్చు నంతలో/దారిలో’ అనండి.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ ఉత్పలమాలికా పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
మాలిమి మాని నందు లవమానము జేసిన విష్ణుగుప్తుకున్
రిప్లయితొలగించండికాలికి ముల్లు గుచ్చినది.కావలె గొడ్డలి దాని దీయగన్
జాలము లేక కంటక కుజమ్ముల గూల్చెనుకాల్చెవంశమున్
మూలము నాశమున్ జరిపి భూపతి జేసెను మౌర్యగుప్తునిన్
కాలికి ముల్లు గుచ్చినది కావలె గొడ్డలి దాని దీయగన్
రిప్లయితొలగించండిబాలక! గోరుచాలునుగ బట్టుట నెందుకు గొడ్డలిచ్చటన్
జాలము చేయుటెందులకు చక్కగ దానిని దీసివేయుమా
వ్రేలున గోరుచుట్టునకు వేయరె రోకలి పోటునెవ్వరున్?
శైలజ గారూ
తొలగించండిమీ పూరణ బాగుందండీ
కె యస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండికాలికి ముల్లు గుచ్చినది కావలె గొడ్డలి దాని దీయగన్
కాలము చేయునో గురువు గారిక ముల్లును దీయకున్నచో
ఆలస మేల నంచు చని రార్ద్రత గొడ్డలి తెచ్చు కోసమే
నాలుగు వైపులన్ పరమ నందయ శిష్యులు బుద్ది శీలురై
బాలిక పోవు చుండ గను బారము వెంబడి యంత లో పలన్
రిప్లయితొలగించండికాలికి ముల్లు గ్రుచ్చినది, కావలె గొడ్డలి దాని తీ యగన్
కాలము దీరి నట్టి పెద కావలి చెట్టది నేలకూ లగా
మూలము లోనికిన్దనర మోడును బూ ర్తిగ గాల్చగా మఱిన్
ఉ.నీలిగనేకరీతులుగనెయ్యముచేసెదమింకరమ్ముమా
రిప్లయితొలగించండిగోలలనాపివేతుమనికూయుచుసైన్యముమోహరించిమా
నేలను కొల్లగొట్టగనునీచపుకార్యములెన్నొ సైపమా
కాలికి ముల్లు గ్రుచ్చినది, కావలె గొడ్డలి దానిఁ దీయఁగన్.
(పాకిస్తాన్ తొ మైత్రి మనకు కాలికి ముల్లు లాంటిదని దీనిని పెకిలించాలంటే యుద్దమే శరణ్యం అన్న భావనతో )
రిప్లయితొలగించండిబాలను, అత్త., కాకరపు పందిరి క్రిందను నిల్చి యుండగా
పూలవి రాలి పాదమున ముల్లుగ గ్రుచ్చిన నీ సుతుండు'నీ
కాలికిముల్లు గుచ్చినది కావలె గొడ్డలి దాని దీయగన్'
హేళన జేసినాడు గద యింతటి కొంటెతనమ్ము పాడియే
1.కాలియు వెలికిన్ నిచటగన్పడు శూలము వంటి దానినే
రిప్లయితొలగించండిజాలియులేక గ్రుచ్చినను జంకడు|నిద్రిడు కుంభకర్ణుడే|
తేలికగాదు లేపుటకు ధీరుడు,శూరుడుగాన?సైనికా
కాలికిముల్లుగుచ్చినది కావలె గొడ్డలి దాని దీయగన్.
2.ఓలఘు చిత్ర మందు గురు ఒక్కనిబిల్చియు సూది దెమ్మనన్
మూలము మొద్దుకున్నిడుచు ముఖ్యపు శిష్యలు మోయుచుండగా?
కాలికి ముల్లు గుచ్చినది కావలె గొడ్డలి దానిదీయగన్
మేలగునన్నమాటవిని మిక్కిలి సంతస మందె మూర్ఖుడై|
గురువులకు ధన్య వాదములు
రిప్లయితొలగించండివ్రేలిమీద గోరుమొలిచింది కదా అని మొగుణ్ణి వేరే ఉండమనడం ఎంత అసహజమో , ముల్లును తీయడానికి గొడ్డలి కావాలను కోవడం కుడా అంతే అసహజం కదా , ఇలాంటి అసహజమైనవి చెప్పి మభ్య పెట్టడం కంటే నాకో నీలపు రాయి ముక్కెర ఇస్తే అన్నిటికీ దిగదుడుపుగా చాలా సంతోషిస్తాను " అని నాభవం " ఇంతకీ నామనసులో భావం అందరికీ అర్ధమౌతుందని నే ననుకోవడం కుడా అంతే అసహజం ........ఔనా ?
పూలను బెంచగన్ బెరట మొద్దొకటడ్డము! గొడ్డలున్నచో
రిప్లయితొలగించండితేలికగా పనౌననుచుఁ దెమ్మని జెప్పిన జ్ఞప్తి లేదనన్!
మేలని గోపగించి గృహమేధిని నాకది గుర్తుజేయగన్
గాలికి ముల్లుగుచ్చినది, కావలె గొడ్డలి దానిఁ దీయఁగన్!
కాలికి ముల్లుగుచ్చినది కావలె గొడ్డలి దానిఁదీయగన్
రిప్లయితొలగించండిచాలును వ్యర్థపల్కులిక చాతురి ఉన్నను సూది చాలదే?
బాలల నివ్విధిన్ భయపు పాల్పడ చేయుకు మిట్టియుక్తితో
వ్రేలుకు గాయమైన తఱి వెంటనె దానిని కత్తిరింతురే?
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండివిష్ణుగుప్తుని ప్రతికారప్రస్తావనతో మీ మొదటి పూరణ బాగున్నది. అభినందనలు.
‘విష్ణుగుప్తుకున్’ అనరాదు. ‘విష్ణుగుప్తునకున్’ సరియైన ప్రయోగం.
పరిహాసాత్మకమైన మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
పరమానందయ్య శిష్యుల ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఆలస మేల యంచు’ అనండి.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
******
పిరాట్ల ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
అక్కయ్యా,
మీ వివరణతో మీ భావం అవగతమైంది. సంతోషం!
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిబాల యొకర్తె యేగె తన బందుగు లూరను మందిరాన చి
త్రాలను గాంచ;దుర్గ యొక దానవునిన్ కడ దేర్చ బూనుచున్
శూలము గ్రుచ్చు మూర్తులను సూటిగ జూచుచు బల్కె ''వాని మో
కాలికి ముల్లు గ్రుచ్చినది కావలె గొడ్డలి దానిఁ దీయఁగన్ ''
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
గోరుతో పోయేదానికి గొడ్డలెందుకు ?
01)
______________________________________
ఆలికి నచ్చలేదనుచు - నమ్మను దూరము పొమ్మనందుమా ?
చూలున నాడ బిడ్డ యని - శోధన దేలిన జంపు కొందుమా ?
వీలున మంత్రి కాదలచి - వేగమె దేశము జీల్చు కొందుమా ?
మేలగు తీరులందలచి - మేలిమి యెల్లరు బొంద జూడమే !
కాలికి ముల్లు గ్రుచ్చినది - కావలె గొడ్డలి ? దాని దీయగన్ ?
______________________________________
చూలు = గర్భము
శోధన = scaning
మేలిమి = శుభము
రాహుల్ గాంధీ మమతమ్మతో:
రిప్లయితొలగించండి"నాలుగు వత్సరమ్ములుగ నాపగ బోతిని మోడిగాడిదన్
నాలుక మండుచున్నదిర నావల గాదుర మిత్రులయ్యరో
చాలిక నోర్వలేను సఖి చప్పున వీనిని పీకుమమ్మ నా
కాలికి ముల్లు గ్రుచ్చినది కావలె గొడ్డలి దానిఁ దీయఁగన్"
పాలను కూరలన్ విడిచి పండుగ జేయుచు రోజురోజునన్
రిప్లయితొలగించండివేలుగ లడ్డులన్ తినగ పిచ్చిగ మిత్రుడు యౌవనమ్మునన్
మేలుగ హెచ్చగా సుగరు మేలగు వైద్యుడు చూచి యిట్లనెన్:
"కాలికి ముల్లు గ్రుచ్చినది కావలె గొడ్డలి దానిఁ దీయఁగన్" :)