8, మే 2015, శుక్రవారం

సమస్యా పూరణము - 1669 (సీతను రాముండె దాచి చిరయశ మందెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
సీతను రాముండె దాచి చిరయశ  మందెన్.
ఈ సమస్యను పంపిన రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి ధన్యవాదాలు.
నా పూరణ....
హేతిన్ ఖరదూషణ వి
ఖ్యాతాసురులను వధించు కదనముఁ జూడన్
భీతిల్లు ననుచు గుహలో
సీతను రాముండు దాచి చిరయశ మందెన్.

25 కామెంట్‌లు:

 1. సీత పతిని కనుల నిలిపె
  లేత ధనువిదియని తనను లేపిన వేళన్
  ప్రీతిగ తన హృదయంబున
  సీతను రాముండె దాచి చిరయశ మందెన్||

  రిప్లయితొలగించండి

 2. మాతగ శాసించె యనలుడు
  జోతలు బెట్టిరి దివిజులు శుభము లటంచున్
  ప్రీతిగ తనదరి జేరిన
  సీతను రాముండె దాచి చిరయశ మందెన్

  రిప్లయితొలగించండి
 3. హేతిధరుని చెంతను తన
  సీతను నియమించి చాయ సీతను గొనియెన్
  ప్రీతిని వనవాసమ్మున
  సీతను రాముండె దాచి చిరయశ మందెన్.

  రిప్లయితొలగించండి
 4. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

  కంది శంకరయ్యగారూ, మీ పూరణ మందఱకును మార్గదర్శకమై భాసించుచున్నది. అభినందనలు.

  నా పూరణము:

  (హనుమంతుని కోరిక మేరకు శ్రీరాముఁడు సీతతోఁ బాటుగ నతని హృదయమందు వసించెనను సందర్భము)

  "తాతా! భక్త జన మనో
  నేతా! వసియింపు మెదను నిత్య
  " మనంగన్,
  వాతాత్మజు నెదఁ దననున్
  సీతను రాముండు దాచి, చిరయశ మందెన్!

  రిప్లయితొలగించండి
 5. ఖ్యాతిని సంపాదింపగ
  మాతగ పలువురి సేవలు మన్ననలందన్
  ఔ,తన హృదయంబందున
  సీతను రాముండెదాచి చిరయశమందెన్

  రిప్లయితొలగించండి
 6. ఆతపసి వాటి విడిచి భూ
  మాతను గూడి జను సీత వంక గనుచు దాఁ
  చేతస్సున హృత్పీఠా
  సీతను రాముండు దాచి చిరయశమందెన్

  రిప్లయితొలగించండి
 7. సమస్య స్వీకరించినందులకు శంకరయ్య గారికి కృతజ్ఞతలు. ఇక రాజేశ్వరి అక్కయ్య గారి పూరణం లో మొదటి పాదంలో ఒక అక్షరం అధికమయినట్లుంది

  రిప్లయితొలగించండి
 8. మిత్రులు మిస్సన్నగారి పూరణము బాగుగ నున్నది. అభినందనలు.

  వారుఁ జూపిన బాటలోననే నేనును...

  నా రెండవ పూరణము:

  (ఆధ్యాత్మ రామాయణమందలి గాథను నాధారము సేసికొని చేసిన పూరణము)

  దైతేయు రావణు రచిత
  సీతాపహరణము నెఱిఁగి, స్థిరుఁడై, మాయా
  సీతనుఁ గుటినిడి, శిఖికడ
  సీతను రాముండె దాచి, చిరయశ మందెన్!

  రిప్లయితొలగించండి
 9. కవిమిత్రులకు నమస్కృతులు.
  నిన్న సాయంత్రం నుండి మూత్రపిండంలో రాయి వల్ల విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. ‘కెట్రాల్’ ఇంజక్షన్ తీసుకున్నా తగ్గలేదు.
  పైగా ఈరోజు మా మనుమరాలు (దౌహిత్రి) మొదటి పుట్టినరోజు వేడుకలకు వెళ్తున్నాము.
  మీ పూరణను, పద్యాలను సాయంత్రం సమీక్షిస్తాను.

  రిప్లయితొలగించండి
 10. ౧.అవిశ(అగశ్త్య) రెండు చెంచాల ఆకురసాన్ని ఉదయం సాయంత్రం వారం రోజుల పాటు తీసు కుంటే మూత్రపిండమలలోని, పిత్తాశయం లోని రాళ్ళు కరగి పోతాయి.
  ౨.ఉలవల పొడిని చంచాడు తేనెలో ఉదయం సాయంత్రం వారం రోజుల పాటు తీసుకుంటే మూత్రపిండమలలోని, పిత్తాశయం లోని రాళ్ళు కరగి పోతాయి.
  ౩. చిలక తోట కూర వేరు ముద్దగాజేసి వడపోసిన రసాన్ని మూడురోజుల పాటు తీసుకుంటే మూత్రపిండాలలోని రాళ్ళు కరిగిపోతాయి.
  ౪. పిండి కూర లేక కొండ పిండి ఆకు మొక్కని నీడలో ఆరబెట్టి ఐదు గ్రాముల పొడిని గగ్లాసుడు బార్లీ నీళ్ళతో తీసుకుంటే పదిరోజులపాటు అన్నిరకముల రాళ్ళు కరగిపోతాయి. పురణాలలో దీనిని పాషాణ భేది అని పిలుస్తారు.
  ౫. వాము ఆకు రసాన్ని వడపోసి రెండు చెంచాల వంతున పదిహేను రోజులు తీసుకుంటే అన్నిరకాల రాళ్ళూ కరగిపోతాయి.

  రిప్లయితొలగించండి
 11. సీతతొ రాముండనియెన్
  ఖ్యాతిన్ బొందెద దనుజుల ఖండించి యిలన్
  భీతిన్ జెందకు మనుచా
  సీతను రాముండు దాచి చిరయశమందెన

  రిప్లయితొలగించండి
 12. సీతాహరణము జేసిన
  పాతకు రావణుని జంపి వాసి గణించెన్
  'జేతగ'.'దబ్పర పల్కులు'
  'సీతను రాముండె దాచి, చిరయశ మందెన్!'

  రిప్లయితొలగించండి
 13. భాగవతుల కృష్ణా రావు గారి పూరణ

  పాతకుడగు రావణుడే
  సీతను గొంపోవు ననుచు క్షితినొక ఛాయా
  సీతను కానల నిలిపెను
  సీతను రాముండె దాచి చిరయశ మందెన్.

  రిప్లయితొలగించండి
 14. ప్రీతిగతనచిత్తంబున
  సీతను రాముండె దాచి చిరయశ మందెన్
  వాతాత్మ జుండె భక్తిన
  సీతారాములను హృదయ సీమన నిలిపెన్ !!!

  రిప్లయితొలగించండి
 15. మాతగు సీతను రావణు
  డే త ఱి నిం గొంచు ననుచు నిమ్ముగ దలచిన్
  బోతగ మలచిన క తనన
  సీతను రాముం డె దాచి చిర యశ మొందె న్

  రిప్లయితొలగించండి
 16. నీతియు నిలుపగ?నిందలు
  జాతికికనుపించ నట్లు జానకినంపెన్
  నేతగ నడవికితానే
  సీతను రాముండి దాచి చిరయశ మందెన్|

  రిప్లయితొలగించండి
 17. పూతము రామావతరణ
  మాతత మా లక్ష్మినటుల నవనిని నిడియా
  పూతచరిత్రను జానకి
  "సీత"ను రాముండె దాచి చిరయశమందెన్

  "సీత"ను పుట్టిన జానకి
  వే తన హృదయమున నిలిపె విష్ణుండగుటన్,
  నాతన్వి పదిలమౌ గతి
  సీతను రాముండె దాచి చిరయశమందెన్

  పూతపు విల్లును విరిచియు
  చేతము నందున ప్రియముగ సీతను నిలిపెన్
  వే తను రావణు నుండియు,
  సీతను రాముండె దాచి చిరయశమందెన్

  కూతలు కూయరె "కొని యా
  సీతను రావణుడటు వని చెలువున దాచన్
  వే తను కూలెను"యని,హృది
  సీతను రాముండెదాచి చిరయశమందెన్

  సీతారాముల కెనయౌ
  పూతపు దంపతు లెవరిల?పోడిమి వారే
  చేతము నందున నొకటే
  సీతను రాముండె దాచి చిరయశమందెన్

  రిప్లయితొలగించండి
 18. డా రెడ్డి గారూ, అలాగే అతి పైత్యం, బీ.పీ., షుగర్ వ్యాధులను కంట్రోల్ లో ఉంచే ప్రకృతి చిట్కాలు చెప్పండి. లేదా అవి రాకుండా కాపాడుకొనే చిట్కాలు. నాచిన్నప్పుడు నేలవేము పొడి నీళ్ళల్లో వేసుకొని త్రాగితే షుగర్ రాదనే వారు. ఇలా చాలా చదివే వాళ్ళం. మీకు తెలిసినవి వ్రాయగలరు.

  రిప్లయితొలగించండి
 19. జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటిపాదంలో గణదోషం. ‘మాతగ శాశించె శిఖియె’ అనండి.
  *****
  మిస్సన్న గారూ,
  ఛాయాసీత ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  ధన్యవాదాలు.
  మీ రెండు పూరణలు వైవిధ్యంగా మనోరంజకంగా ఉన్నవి. అభినందనలు.
  *****
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ఔ’ ద్రుతాంతం. ‘ఔఁ దన హృదయంబున’ అనవలసి ఉంటుంది. అక్కడ ‘మన్ననలను నౌ|రా తన...’ అందామా?
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటిపాదంలో గణదోశం. ‘ఆ తపసివాటి విడి భూ...’ అనండి.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  ధన్యవాదాలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘సీతతొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. అక్కడ ‘సీతను గని రాముఁ డనియె’ అనండి.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘భక్తిని’ అనండి.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మాత+అగు’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అలాగే ‘..దలచిన్’ అనడమూ దోషమే.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  నాల్గవ పూరణలో ‘కూలెను+అని’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘వే తాను కూలె నని హృది’ అనండి.

  రిప్లయితొలగించండి
 20. శంకరయ్య గారూ
  మీ నొప్పి ఎలా ఉందండీ ? ఆరోగ్యం బాగుంది కదా?
  జాగ్రత్తగా చూసుకోండి.మరోలా అనుకోకండి, మొదట్లో నే జాగ్రత్త పడితే మంచిది

  రిప్లయితొలగించండి
 21. గురుదేవులకు త్వరగా స్వస్థత చేకూరాలని శ్రీరామచంద్రుని ప్రార్థిస్తూ....

  అశ్వమేధయాగం చేసే రాముడు జంటగా కూర్చోవడానికి బంగరు బొమ్మగా సీతను చేయించిన భావంతో...


  పోతగ బంగారమ్మును
  సీతగఁ జేయంగ యాగ సిద్ధినిబొందన్
  ప్రీతిగఁ జేర్చగ, ప్రతిమన్
  సీతను రాముండె దాచి చిరయశ మందెన్!

  రిప్లయితొలగించండి
 22. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  నొప్పి కొద్దిగా తగ్గింది. ధన్యవాదాలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  ధన్యవాదాలు.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. సీతను హృదయంలో దాచడం హృద్యంగా ఉంది. కవిగారికి అభినందనలు.

  నా పూరణ.

  భూతలమందాదృతితో
  సీతారాములను పేరు స్థిరముగ నిలువం
  గా తనదగు నామమునన్
  సీతను రాముండె దాచి చిరయశమందెన్.

  రిప్లయితొలగించండి
 24. కోతులతో లంక వెడలి
  రీతిగ రావణును గెల్చి లెమ్మిక ననుచున్
  ప్రీతిని తన హృదయమ్మున
  సీతను రాముండె దాచి చిరయశ మందెన్

  రిప్లయితొలగించండి