శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘సందేహిస్తూ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘సందియపడుచున్’ అనండి. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటిపూరణలోని చివరి రెండు పాదాలు అర్థం కాలేదు.
శ్రీ శంకరయ్య గారికి అబినందనలకు కృతజ్ఞతలు రామాయణములు విమర్శించే వారు వ్రాసిన భారత రామాయణములు కుక్కల అరుపులు, అవి ఇసుక రేణువు లైతే ఇవి నక్షత్రాలు అనీ నా భావన.
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ భావం ఉదాత్తంగా ఉంది. ‘భౌరవము’ అన్న పదం లేదు, ‘ఇసుకణ’మని అనరాదు కదా. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ సవరణ, వివరణ బాగుంది. సంతోషం. ***** మంద పీతాంబర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** భాగవతుల కృష్ణారావు గారూ, మీ రెండు పూరణలు చాలా బాగున్నవి. అభినందనలు. ***** నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘బొంకు+అనుచును’ అన్నప్పుడు యడాగమం రాదు. సంధి నిత్యం. ‘బొంకటంచును’ అనండి. ***** రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, బహుకాల దర్శనం... సంతోషం! మీ పూరణ బాగుంది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బొడ్డు శంకరయ్య గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ, మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
నాగరాజు రవీందర్ గారూ, మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు. ***** కందుల వరప్రసాద్ గారూ, బహుకాల దర్శనం... సంతోషం. మీ పూరణ బాగున్నది. అభినందనలు. (నిజానికి ఈ రోజు మధ్యాహ్నమే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. ‘పద్యపాన’ నుండి సేకరించిన కొన్ని కన్నడ సమస్యలను మీకు మెయిల్ పెడుతున్నాడు వాటి భావాన్ని తెలియజేయమని.)
కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** నేను మా మేనల్లుడి కూతురు పెళ్ళికి వెళ్తున్నాను. మూడు నాలుగు రోజులు బ్లాగుకు అందుబాటులో ఉండను. ఐదురోజుల సమస్యలను షెడ్యూల్ చేశాను. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనండి.
తీరిక లేదట జనులకు
రిప్లయితొలగించండిభారత రామాయణములు వ్యర్ధములు గదా
యేరీతీగ నుపయుక్తము
కోరిన ధనమీయ లేదు కూటికి కొఱతౌ
కౄరులకును మూర్ఖులకున్
రిప్లయితొలగించండిసారా మత్తందునున్న చవటాయిలకే
తీరుగ వినిపించగలము
భారత రామాయణములు? వ్యర్థములు గదా!
మష్టారూ! మంచి మీపూరణతో ఆరంభించారు
రిప్లయితొలగించండిఆరసి బురదను పొర్లెడి
రిప్లయితొలగించండివారాహము మెచ్చుకొనునె పన్నీ రెన్నన్?
క్రూరులకును తుచ్చులకును
భారతరామాయణములు వ్యర్థములు గదా.
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
ధన్యవాదాలు.
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భారూపము లేదనుచును
రిప్లయితొలగించండిసారంబగు గ్రంధములను సందేహిస్తూ!
దూరుచు దిరిగెడు వారికి
భారత రామాయణములు వ్యర్ధములు గదా!!!
భారత జనభా స్వరములు
రిప్లయితొలగించండిభారత రామాయణములు, వ్యర్థములు గదా
నూరక మొరిగెడి భైరవ
భౌరవముల్, యిసుకణంబు భంబుకు దగునే
నీరస బుద్ధులు నుడివిన
రిప్లయితొలగించండిభారత రామాయణములు వ్యర్థములు, గదా
శారద యక్షియుగములవి
భారత రామాయణములు 'వా' ద్వయ కృతముల్
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సందేహిస్తూ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘సందియపడుచున్’ అనండి.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపూరణలోని చివరి రెండు పాదాలు అర్థం కాలేదు.
శ్రీ శంకరయ్య గారికి
రిప్లయితొలగించండిఅబినందనలకు కృతజ్ఞతలు
రామాయణములు విమర్శించే వారు వ్రాసిన భారత రామాయణములు కుక్కల అరుపులు, అవి ఇసుక రేణువు లైతే
ఇవి నక్షత్రాలు అనీ నా భావన.
మాస్టరుగారూ ! చక్కని పూరణనందించారు....మిత్రుల పూరణలు అలరించుచున్నవి...
రిప్లయితొలగించండిచేరుచు పిడివాదముతో
మీరుచు దోషములనెన్ని మిడికెడు వానిన్
మారుచు కొరకై చదువగ
భారత రామాయణములు, వ్యర్థములు గదా !
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ భావం ఉదాత్తంగా ఉంది. ‘భౌరవము’ అన్న పదం లేదు, ‘ఇసుకణ’మని అనరాదు కదా.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిగురువుగారు
ఈవిధంగా మార్చాను. గమనించ ప్రార్థన
భౌరవమితరము, లిసుంబు భంబుకు దగునే
'భౌ' రవమితరములు+ఇసుము
రిప్లయితొలగించండిఅని మార్చవచ్చా అండీ
శ్రీ రామునికథ విషముగ,
రిప్లయితొలగించండిభారత రామాయణములు వ్యర్థములుగ, దా
నేరీతితలచినను, సీ
తారాములకావ్య పఠనె తామసమణచున్ !!!
భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండి1) క్రూరులు ,జారులు ,చోరులు
ధారుణి నాస్తికు లధర్మ తత్పరులు వినన్
గొరరు సత్కధ ,లనెదరు
భారత రామాయణములు వ్యర్థములు గదా!
2) సారము గల సత్కధలవి .
భారత రామాయణములు ;వ్యర్థములు గదా
కోరికలే పర మావధి
గా రిత్త కధలు చదువుచు,ఘనమని మెచ్చన్
రిప్లయితొలగించండి'భారతము బొంకు' యనుచును
'శ్రీ రామాయణము రంకు ఛీ' యని చెడుగుల్
సారా మత్తున పల్కిరి
భారత రామాయణములు ; వ్యర్థములు గదా !
ఆరయ దేశపు గతి గన
రిప్లయితొలగించండిభారత రామాయణములు వ్యర్ధములుగదా!
యౌరా!యనిపించు నకట!
నీరీతి జనుల నడవడి నెన్నడు గనమే?
ఆరయ పవిత్ర ములుగద
రిప్లయితొలగించండిభారత రామాయణములు ,వ్యర్ధములు గదా
పారాయణ జేయకునికి
వారల జీవితములు ధర వారిజ నాభా !
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ సవరణ, వివరణ బాగుంది. సంతోషం.
*****
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు చాలా బాగున్నవి. అభినందనలు.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘బొంకు+అనుచును’ అన్నప్పుడు యడాగమం రాదు. సంధి నిత్యం. ‘బొంకటంచును’ అనండి.
*****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
బహుకాల దర్శనం... సంతోషం!
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మారెను జీవన పద్ధతి
రిప్లయితొలగించండిభారత రామాయణములు పఠియింపంగన్
తీరిక లేని మనుజులకు
భారత రామాయణములు వ్యర్థములు గదా!
భూరిగ వేదముల వలెను
రిప్లయితొలగించండిభారత రామాయణములు పారణచేయన్,
నేరక పరమార్ధంబును
భారత రామాయణములు వ్యర్ధములుగదా!
ఊరక పురాణగాధలు
నేరిచి,మేమే ఘనులమని యనుచు నెంచన్
తోరపు ఫలమబ్బదు గద!
భారత రామాయణములు వ్యర్ధములుగదా!
నేరిచి నవీన శాస్త్రాల్
"భారత రామాయణములు వ్యర్ధములు గదా!
నూరక మూఢులునౌ"చన
భారతసంస్కృతి జనముల పాయదె జగతిన్
భూరిగ విజ్ఞానము నిడు
"భారత రామాయణములు వ్యర్ధములు గదా!
ధారుణి"ననునీ యువకుల
ధోరణి,నైతిక విలువలు దూరంబగుటౌ
సారాయిత్రాగి సతతము
రిప్లయితొలగించండిఘోరాలను చేయు చున్నకూళుల కెపుడున్
దూరదు పఠనము చెవిలో
భారత రామాయణములు వ్యర్థములు గదా!
తాజా పూరణ:
రిప్లయితొలగించండిపారణ చేయగ వలయును
భారత రామాయణములు;వ్యర్ధములు గదా!
తీరిక వేళల నవలలు,
ధారావాహికలు జూడ తప్పును బుద్ధుల్.
ధారావాహికలు=సీరియళ్ళు;
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రెండుచింతల రామకృష్ణమూర్తి గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిగురువుగారు మంచి మీపూరణతో ప్రారంభించారు.....
అందరికీ అభివందనములు ...పెద్దల పూరణలు అలరించుచున్నవి...
============*=============
భారము మన సంసృతి యని
దారులు వెదకు నర రూప దనుజ తతులకున్,
నేరము నీరమని బలుకి,
భారత రామాయణములు వ్యర్థములు గదా !
(నేరము నీరమని బలుకి,భారము మన సంసృతి యని దారులు వెదకు నర రూప దనుజ తతులకున్)
తీరిక లేకను కొందరు
రిప్లయితొలగించండిచేరిక లేనట్టి –నీతి జేరగ భయమే|
మారెడి మమతలకాలము
భారత రామాయణములు వ్యర్థములు గదా|
2]మధ్యాక్కర
భారత,రామాయణములు వ్యర్థము లుగదా?యనుటకు
భారత సంస్కృతి వినక భావితరాలకు రాక
కోరికలందవి నీతి కూర్పుల నేర్పులు సాక
నేరపు నేర్పరి తనము నీలో మనసున జేరుటయె|
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కందుల వరప్రసాద్ గారూ,
బహుకాల దర్శనం... సంతోషం.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
(నిజానికి ఈ రోజు మధ్యాహ్నమే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. ‘పద్యపాన’ నుండి సేకరించిన కొన్ని కన్నడ సమస్యలను మీకు మెయిల్ పెడుతున్నాడు వాటి భావాన్ని తెలియజేయమని.)
భారత మాతకు భూషలు
రిప్లయితొలగించండిభారత రామాయణములు భాసుర మొప్పన్ ,
మారిన విలువల మహిలో
భారత రామాయణములు వ్యర్ధములు గదా!
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
చోరుని గీత వినుటకా?
రిప్లయితొలగించండివీరుని తరు చాటు నుండి వ్రేయ వినుటకా?
పోరాదా! యను వారికి
భారత రామాయణములు వ్యర్థములు గదా?
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
నేను మా మేనల్లుడి కూతురు పెళ్ళికి వెళ్తున్నాను. మూడు నాలుగు రోజులు బ్లాగుకు అందుబాటులో ఉండను. ఐదురోజుల సమస్యలను షెడ్యూల్ చేశాను. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనండి.
రాజేశ్వరమ్మ గారు మీ పద్యము లో మూడవ పాదం చివర గణభంగం అయ్యింది.అక్కడ ఒక మాత్ర కుడా ఎక్కువస్తున్నది దయచేసి సరిచేయ గలరు.
రిప్లయితొలగించండిపిరాట్ల ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిఅక్కడ టైపాటు. ‘యేరీతిగ’ అన్నది ‘యేరీతీగ’ ఆని టైపయింది.
భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిఖగము పై నెక్కి జీవుల గావ నెంచి
నాగశయనుడు విహరించు;నంది నెక్కి
గరళ కంఠుడు తిరుగాడు గంగ తోడ
ప్రియము మీరగ,నభిషేక ప్రీతి తోడ
భీరువులకు నాస్తికులకు
రిప్లయితొలగించండినారుల వలనను కలిగిన నానా బాధల్
పోరులతో గూడిన నా
భారత రామాయణములు వ్యర్థములు గదా!
రిప్లయితొలగించండిపారుడ! చదివిన వాటిని
జోరుగ నాచరణలోన జొప్పించక నీ
వీ రీతి బెకబెక యనగ
భారత రామాయణములు వ్యర్థములు గదా!
జిలేబి
ఏ రాజకీయములయో!
రిప్లయితొలగించండితీరుగ నెన్నికలలోన తిండియు రూకల్
బీరులు పంచగ జాలని
భారత రామాయణములు వ్యర్థములు గదా!