18, మే 2015, సోమవారం

పద్య రచన - 909

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

  1. గగన భాగము దిరుగుచు నగము దెచ్చి
    ప్రాణ రక్షణ సంజీవి ప్రాక టమ్ము
    సంత సంబుగ సౌమిత్రి చింత వలదు
    హనుమ భక్తికి సురలెల్ల హర్ష మొందె

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    కొద్దిగా అన్వయలోపం ఉంది.

    రిప్లయితొలగించండి
  3. పావన మూలిక వెదకక
    పావని తా సత్వరమ్ము పర్వతమందున్
    గావగ లక్ష్మణు దెచ్చెను
    చేవగ, సంజీవి నొక్క చేతనె భళిరా !

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. మేఘనాథుని భాణము మేను సోకి
    పోరులోనను సుమిత్రి మూర్చ పోవ
    వేగ సంజీవిగిరిఁదెచ్చె వినుమనుమడు
    మూర్చతేఱెను సౌమిత్రి ముదముతోడ

    రిప్లయితొలగించండి
  7. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. చిత్ర మందున గనిపించె చిత్ర మదియ
    యాం జ నేయుడు గొనివచ్చె నద్భుతముగ
    మూలి కగలయా నగమును మూర్ఛ దొలగ
    దనర లక్ష్మణు నకచట తలిరు బోడి !

    రిప్లయితొలగించండి
  9. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. రాముని యాజ్ఞ నంది జన రంజక దివ్య మహౌషధీ వన
    స్తోమము జేరి యంచిత విశుద్ధ గుణంబుల మూలికాళికై
    వేమఱు జూచి గానక సవిస్తర పర్వతమున్ పెకల్చి సం
    క్షేమము గూర్చె మారుతి యశేష పరాక్రమ లక్ష్మణార్యుకున్.

    రిప్లయితొలగించండి
  11. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. రామ మూర్తియె యానతీయగ లక్ష్మణార్యుడు మేల్కొనన్
    వ్యోమగామిగ నాంజనేయుడు నోషధమ్ముల కొండనే!
    భూమిఁ దించగ స్వస్థతందగ పోరు గెల్వగ శీఘ్రమే!!
    స్వామి కార్యముఁ దీర్చు వానికి వందనమ్ములు జేసెదన్!!!

    రిప్లయితొలగించండి
  13. లంకజేరిన లక్ష్మణున్గని లౌఖ్య మందున బాణముల్
    జంక కేయగ మేఘనాథుడు?చావుదగ్గరజేరగా|
    సంకటంబును మాన్ప జేయగ సత్వరంబున హన్మయే
    గొంకబోకను “నౌషదంబగు కొండ దెచ్చెనునేరుగా

    రిప్లయితొలగించండి
  14. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి