26, మే 2015, మంగళవారం

పద్య రచన - 917

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

 1. ఎనిమిది కర్జలు చాలవు
  ఘనముగ మనమంత కలసి కయ్యము సేయన్
  కనులతో త్రాగుట కంటెను
  తినగోర గవలద టంచు తీర్పును జరిపెన్

  రిప్లయితొలగించండి
 2. వినుమిది యగణిత భక్ష్యము
  లనులీలగదినగలిగిన లంబోదరుకున్
  కనులకు గనిపించెడి యీ
  యెనిమిది భక్ష్యం బులన్న నేమది లెక్కా!

  రిప్లయితొలగించండి
 3. కజ్జికాయలనిన బొజ్జదేవరయిన
  లొట్ట లేసి దినును బిట్టు గాను
  కమ్మ దనముతోడ కంటికింపుగనుండు
  కజ్జ దినని వారు కలిని గలరె ?!!!!

  రిప్లయితొలగించండి
 4. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 5. ఆ.వె:కొబ్బరి పుడి తోడ గుడమును చేర్చుచు
  గోధుమరవ లోన కూర్చి వండ
  కంటి కింపు కలుగు కజ్జికాయలగును
  తినగ తినగ వీటి తీపి హెచ్చు.

  రిప్లయితొలగించండి
 6. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. కజ్జి కాయలు జూడుము కమల ! నీవు
  ఎంత చక్కగ నుండెనో నంత రుచిని
  నిచ్చు ననుటలో సందియ మించు కైన
  వలదు ,నేర్వుము నీవును వాటి జేయ

  రిప్లయితొలగించండి
 8. కజ్జికాయలందు కలదు కొబ్బరి పొడి
  కొంచెముండు నందు గుడము కూడ
  గోదుమరవతోడ కొద్ది మిశ్రమమును
  వేసి నూనెలోన వేచి తింద్రు!

  రిప్లయితొలగించండి
 9. బేడలు బెల్లమున్ గలసి భేదములేకనునొక్క పాత్రలో
  మాడక మంచిగా నుడక?మాకడ రోటినజేర్చి రుబ్బగా?
  దాడికి పూర్ణ మవ్వగనె? దానియునుండలు రవ్వరేకులో
  పూడిచి |బాణినూనెతలబోసిన వేడికి కజ్జకాయలై|
  రుచికరమైన వంటగను ?రూపసి ఓజడ నల్లి నట్లుగా
  తూచిన తూకమందు తులదూగెడి వంటల పంట లట్లుగా?
  వేచియు చూచు చున్న?మన వేదన నింపేడి ఆకలంతటిన్
  దోచెడి దొంగ లాగెనిమి దుండెను|చూడగ కజ్జకాయలే|

  రిప్లయితొలగించండి
 10. బాపురె! కర్జము లల్లిరి
  ప్రాపకమున్ బొందఁ గృష్ణపరమాత్ము కడన్
  గోపాలకృష్ణుని సతులు
  నే పత్ని కరమ్ము దేదొ యేర్పడ జెప్పన్

  రిప్లయితొలగించండి
 11. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. మనసుపరవశించె మన భక్ష్యమైనట్టి
  కజ్జ కాయ లచట కాంచ గానె
  అమ్మవండి పెట్టు యద్భుత పాకపు
  తలపు హృదయమందు తళుకు మనెను

  రిప్లయితొలగించండి
 13. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. కుడుములు యిడుములు బడయుచు
  వడివడిగా నూనెయందు వంతుగగాల్చన్?
  తడబడె నోటియు నాలుక|
  కడుపన్నది కన్ను సైగ కారణ మెరిగే|

  రిప్లయితొలగించండి
 15. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘కుడుములు+ఇడుములు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కుడుములు నిడుములు’ అనండి.

  రిప్లయితొలగించండి