10, మే 2015, ఆదివారం

పద్య రచన - 901

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(వ్యంగ్య చిత్రకారిణి ‘శాంత’ గారికి ధన్యవాదాలతో)
నా పద్యము...
పనులలోన మున్గి వ్యస్తురాలైన యి
ల్లాలిని విసిగించ మేలు గాదు,
కంద పేరు ప్రాస కందగ నీబొంద
యనిన పతికి గాయ మాయె నహహ!

26 కామెంట్‌లు:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సరస మాడితి సతితోన సాహ సించి
కంద కూరేమి టంచునీ బొంద యంటి
ప్రాస సరిపోయి నందున పరవ సించి
చెంగు మనిలేచి దరిజేరి చేయి విరిచె

వసంత కిశోర్ చెప్పారు...

అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

ఒక భార్యా బాధితుడు - తన స్నేహితునితో :

01)
_________________________________

కంద కూర నీదు - బొందకూరనినంత
వేగ మాడు పగిలె - విరిగె చేయి
ప్రాస కుదిరి నంత - పరిహాస మది తప్పు
భార్య తోడ నైన - భర్త కెపుడు !
_________________________________

A.Satyanarayana Reddy చెప్పారు...

సతులు పనిలోన యలసిన సమయమందు
ప్రాసకుదిరెననుచునిజ పతులు కూడ
వ్యంగ కవితల నల్లిన వ్యదలు గల్గు
సరసమాడదగును సరి సమయమందు

కంది శంకరయ్య చెప్పారు...

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘పనిలోన నలసిన’ అనండి.

sailaja చెప్పారు...

కూర యేమి టంచు కులసతిని యడుగ
కంద యనగ నామె బొంద యనెను
ప్రాస గుదిరె ననుచు పడతిని విసిగించ
తలకు బొప్పి గాక తప్పు నయ్య !!!


గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కంద కూరనంగ బొంద నీదనుచు నే
ప్రాసఁ గూర్చితినని పరవశించ!
కంగుమనియె శిరము!!టింగుమనియె కరము!!
నట్లకాడ ప్రాస నాలి గూర్చె!!!

కంది శంకరయ్య చెప్పారు...

నాగరాజు రవీందర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘కులసతిని+అడుగ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కులసతిన్ ప్రశ్నింప’ అనండి.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

చంద్రమౌళి సూర్యనారాయణ చెప్పారు...

కూర యేమిటనుచు కోమలాంగినడుగ
కందయనుచుతెలిపె నందముగను
నీదు బొంద యంటి నే ప్రాస బాగుండ
దేహశుద్ధి జరిగె దివ్యముగను

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

గురుదేవులకు ధన్యవాదములు.
మూడవపామూడవ పాద సవసవరతో:

కంద కూరనంగ బొంద నీదనుచు నే
ప్రాసఁ గూర్చితినని పరవశించ!
కంగుమనియె శిరము!!టింగుమనెఁ గరము!!
నట్లకాడ ప్రాస నాలి గూర్చె!!!

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

విసుగుచెందకుండ వేగిరపాటుతో
వండి వార్చు చుండ వాయి దెరచిి
కంద బొంద యనుచు కఠినంగ మాట్లాడ
సతియు వేసె నపుడె పతికి శిక్ష.

Unknown చెప్పారు...


పద్యరచన...ప్రాస కోసమేడ్చి కూసుముండ యనగ
గరిటె తీసిగొట్టె తిరుగ వైచి
కంద వండితి నన బొంద యన్నానని
నెత్తిపగుల గొట్టె సుత్తి నెత్తి

కంది శంకరయ్య చెప్పారు...

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
subbarao చెప్పారు...

భార్య నడుగగ గూరను భర్త య పుడు
వండు చుంటిని గందను వంట కముగ
ప్రాస కొరకునై బొందని పలుక భర్త
విరుగ గొట్టెను జేతిని పరుష మునన

కంది శంకరయ్య చెప్పారు...

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘రోజులలొ, కందచె’ అని ప్రత్యయాలను హ్రస్వాలుగా ప్రయోగించారు. ‘కోపమున నొక్కటి’ అనండి.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘పరుషమున’ అంటే చాలు. అదనంగా ‘న’ ఎందుకు? అక్కడ ‘కరుణలేక’ అనండి.

palla narendra చెప్పారు...

ప్రాసే ప్రాధాన్యమ్ముగ
కూసే కవికిక దురదలు కూడ పలుకులన్
వేసే ఒక వ్యంగ్యాస్త్రము
తీసేసెను గాలినంత తీపులు తెచ్చెన్

Unknown చెప్పారు...

ఏమిది మిత్ర కట్టుయన?”ఏమనిజెప్పుదు-కందవండనా?
నీమది నచ్చునాయనగ?నేనొక –ప్రాసగబొందయన్న|తా
సోమరిగాక భార్య మనసొప్పక కర్రను గొట్ట తిట్లచే?
భీమునివంటి నాబలము భీతి వహించెను కట్టుబాట్లతో|

కంది శంకరయ్య చెప్పారు...

పల్లా నరేంద్ర గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
వ్యావహారిక పదాలున్నాయి. మీ పద్యాన్ని ఇలా వ్రాస్తే బాగుంటుంది.
ప్రాసయె ప్రాధాన్యమ్ముగ
కూసెడి కవికిక దురదలు కూడ పలుకులన్
వేసెడి యొక వ్యంగ్యాస్త్రము
తీసెనుగా గాలినంత(?) తీపులు తెచ్చెన్.

కంది శంకరయ్య చెప్పారు...

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

Unknown చెప్పారు...

అందముచిందు రోజులట అందిన భార్యను కందనీయకే
పొందిక చేత నుండ?యిక పూర్తిగ మారె|వయస్సుమార్పుతో
కందను దెచ్చినా?కొడుకు కందయు నాడగ నుండజుచి |నీ
బొంద యనంగ?కోపమున వొక్కటి నివ్వగ కంద?కట్టిదే|
2.కందజేయ నెంచ?కవిగారి భార్య నీ
బొంద యనెడి మాట పూర్తి వినగ?
భర్త ఫైన దాడి పలుమార్లు జరుపగ?
కట్టుబట్టుకొనెను|కనిక రాన|

కంది శంకరయ్య చెప్పారు...

కె. ఈశ్వరప్ప గారూ,
మీ తాజా పద్యాలు బాగున్నవి. అభినందనలు.

యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తి చెప్పారు...

అందచందములు బలుకు మతివచెంత
కందబొందల ప్రాసల కలుప బోకు
అటుల గాదంచు ప్రాసల యతుల జెప్ప
కాలుసేతులు తమతమ గతులు దప్పు

కంది శంకరయ్య చెప్పారు...

అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

కవిమిత్రులందఱకు నమస్సులు...

"విందున వండిన దే కూ
రుం"దని నే నడిగినంత, నువిద బదులిటుల్
"కంద"యనఁగఁ, బ్రాసకు "నీ
బొంద"యనియు, దాని బదులుఁ బొందితి నిటులన్!

కంది శంకరయ్య చెప్పారు...

గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.