అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ సవరణ బాగుంది. సంతోషం. ***** శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండు మధుసూదన్ గారూ, సమస్యను ప్రశ్నార్థకంగా మార్చిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. ***** పిరాట్ల వేంకట శివరామకృష్ణ ప్రసాద్ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటిపూరణలో ‘సాధకులిలలోన| నెల్ల యెడల చూడ నెక్కడైన’ అనండి. రెండవ పూరణలో ‘కలిని’ అనండి. ***** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. మూడవపాదంలో గణదోషం, యతిదోషం. సవరించండి.
ప్రజలకడకువచ్చి వాగ్దానములనిడి
రిప్లయితొలగించుపదవిలోకి వచ్చి ప్రజలమరచు
నీచులెల్ల మనకు నేతలవగ నేడు
మాటదప్పువారె మానధనులు
కలియు గంబు నందు కలుషిత మైనట్టి
రిప్లయితొలగించుజగతి నున్న జనులు జాగి లములు
నీటి మూట లిచ్చి నీతులే వల్లించి
మాటఁ దప్పు వారె మాన ధనులు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుసత్యమెప్పటికిని శాస్త్ర సంస్తుత్యము
రిప్లయితొలగించుసత్యవాక్యమధిక శక్తి యుతము
సత్య వాక్చరితుల సమర్థు లనియెడి
మాట దప్పు, వారె మానధనులు
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపాదంలో గణదోషం. ‘సత్యవాక్చరితుల సామర్థ్య మిది యను...’ అందామా?
గురువుగారు అన్యధా భావించకండి.
రిప్లయితొలగించుసామర్థ్యము తప్పు అనుఅర్థము వస్తుందేమోనని అనిపిస్తుంది.
వాక్చరితుల సంబద్ధు లనియెడి మాట తప్పు,
అంటే బాగుంటుందా
కోల దాల్చనంచు గోపాలుడునుతప్పె
రిప్లయితొలగించుతప్పె గురునికూల్చ ధర్మజుండు
మాటదప్పి సుంత మంచి సాధించుచో
మాట తప్పువారె మానధనులు
ఈ సమస్య లోగడ ఇచ్చినట్లు గుర్తు
నేటి నేతలంత నీతులఁ జెప్పుచు
రిప్లయితొలగించుప్రజలసేవ మాకు ప్రథమమంద్రు
పదవిచిక్కగానె ప్రజలకు చిక్కరు
మాటఁదప్పువారె మాన ధనులు
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమోవాకములతో...
రిప్లయితొలగించుఇలయు వ్రయ్యలైన, హిమశైలమదరిన,
సూర్యచంద్రులు రహి సోలి చనిన,
గాలి పెచ్చరిలిన, కడలియే యింకిన
మాటఁ దప్పువారె మానధనులు?
శ్రీ మధుసూధన్ గారూ
రిప్లయితొలగించుహిమశైలం కన్నా ముందుగా మీ పద్యం అదిరిందండీ
ఆ.వె. స్వార్ధ జనులె కార్య సాధకులిలలొన
రిప్లయితొలగించుయెల్ల యడల చూడ యెక్కడైన
మంచి మనగలేదు మాయలోకమునను
మాటఁ దప్పు, వారె మానధనులు.
ఆ.వె.ధర్మ పరులు కలిన ధర్మంబు విడురను
రిప్లయితొలగించుమాటఁ దప్పు, వారె మానధనులు
గాకదీక్ష విడువ, క్షామమే వేళ్ళూను
పాడి పంట లేక వాలు జనులు.
ధన్యవాదములు అశ్వత్థనారాయణమూర్తిగారూ!
రిప్లయితొలగించుఇడుము లెన్ని బడిన నిలలోన కొందరు
రిప్లయితొలగించుమాట తప్పు వారె ,? మానధనులు
జేయు చుందు రెపుడు సేవలు జగతికి
నేత లన్న వారె నిజము గాను !!!
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
రిప్లయితొలగించుమీ సవరణ బాగుంది. సంతోషం.
*****
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
సమస్యను ప్రశ్నార్థకంగా మార్చిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*****
పిరాట్ల వేంకట శివరామకృష్ణ ప్రసాద్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపూరణలో ‘సాధకులిలలోన| నెల్ల యెడల చూడ నెక్కడైన’ అనండి.
రెండవ పూరణలో ‘కలిని’ అనండి.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుమాటదప్పువాడు మాన్యుడు కాదండ్రు
రిప్లయితొలగించుమాట వల్ల సేమ మందవలయు
మాటవల్లకీడు మహినెందుకల్గకన్
మాటదప్పువారె మానధనులు
అనిన మాటలెల్ల నాచరణము నందు
చూపుచున్ననదియ సొంపునౌను
మాయమాటజెప్పి మహినెంతొ కావగా
మాటదప్పువారె మానధనులు
మానమెన్నగాను మహిలోన వర్తనన్
చెలగుగాని మాట చేతగాదు
జనుల హితము కొరకు సత్యమే కాకున్న
మాటదప్పువారె మానధనులు
ప్రాణ,విత్త,హాని పట్టున నెందైన
మాటదప్పుటదియ మాన్యనీతి
హింసతప్పగాను హితమసత్యంబు
మాటదప్పువారె మానధనులు
రిప్లయితొలగించుబలియు,శిబి,దధీచి పరమ మూర్ఖులనిన
మాట దప్పు,వారె మానధనులు
మాట నిలుపుకొనగ మయిని రాజ్యమ్మును
దానమిచ్చు ఘనులు ధన్యు లైరి
అలుసు కాక యుండ నాత్మాభి మానమ్ము,
రిప్లయితొలగించుప్రాణ సంకటంపు హాని యుండ,
ఆడు వారి పెళ్లి కవసరమైనట్టి
మాటఁ దప్పు వారె మాన ధనులు!
నీతినిలుపగలిగి జాతికిమేలెంచి
రిప్లయితొలగించురోత మాన్ప గలిగి మాతలాగ
భూతదయనుగలిగినట్టిభుద్ది,చేటు
మాటదప్పువారె”మాన ధనులు|
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించుమీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మూడవపాదంలో గణదోషం, యతిదోషం. సవరించండి.
అలాగే గురువుగారు
రిప్లయితొలగించు