31, మే 2015, ఆదివారం

సమస్యా పూరణము - 1689 (నిటలాక్షుఁడు శివునిఁ గాంచి నివ్వెఱబోయెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
నిటలాక్షుఁడు శివునిఁ గాంచి నివ్వెఱబోయెన్.
(‘తెలుగుకవిత్వము - సమస్యాపూరణము’ సమూహంనుండి కవిశ్రీ సత్తిబాబు గారికి ధన్యవాదలతో)

26 కామెంట్‌లు:

  1. ఎటు దిరిగి నెంచి జూడగ
    నటువైపే గాంచె నంట నటరాజ నగన్
    నటునిటు నెటువై పైనను
    నిటలాక్షుఁడు శివునిఁ గాంచి నివ్వెఱ బోయెన్

    రిప్లయితొలగించండి
  2. క్షమించాలి
    రెండవ పాదము చివర " నటరాజనగ "
    న్నటునిటు " అని ఉండాలనుకుంటాను

    రిప్లయితొలగించండి
  3. మిత్రులందఱకు నమస్సులతో...

    జటిలుండై దశకంఠుఁడు
    కుటిలతఁ బార్వతినిఁ గొనఁగఁ గోరి తపమ్మున్
    నిటలేక్షణుకై యిడి, త
    న్నిటలాక్షుఁడు శివునిఁ జూచి నివ్వెఱఁ బోయెన్!

    (తాననుకొన్న సమయమునకు ముందుగనే నిటలాక్షుఁడైన శివుఁడు ప్రత్యక్షముగా కాఁగా రావణుండు నివ్వెఱఁబోయెనని యెఱుంగునది)

    రిప్లయితొలగించండి
  4. శంకరయ్యగారూ!

    మూఁడవపాదమును...
    " నిటలేక్షణునకు నిడఁ, ద" గాఁ బఠించఁగలరు.

    రిప్లయితొలగించండి
  5. నిటలపు ట క్షుడు మామా !
    నిటలాక్షుడు, శివుని గాంచి నివ్వెఱ బోయెన్
    జటలును బూడిద గలుగుత
    నటవిని దిరుగాడు వనిత హాహా యనుచున్

    రిప్లయితొలగించండి
  6. చిటపటలకు స్వస్తిఁ బలికి
    నిటలమ్మున దృష్టనిలిపి నిర్వాణమునన్
    జటిలమ్మని దొల్తొలుతనె
    నిటలాక్షుఁడు శివునిఁ గాంచి నివ్వెఱఁ బోయెన్!

    రిప్లయితొలగించండి
  7. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    పటిమను యముడే భువిజని
    యట మార్కండేయు జంప యత్నించంగన్
    ఘటనా ఘటన సమర్ధుడు
    నిటలాక్షుఁడు శివునిఁ గాంచి నివ్వెఱబోయెన్.

    రిప్లయితొలగించండి
  8. చటులపు దీక్షాదక్షత
    పటుతరముగ పూజసల్ప భక్తుడు, దయతో
    నట దర్శనమిడ చెచ్చెర
    నిటలాక్షుఁడు, శివునిఁ గాంచి నివ్వెఱబోయెన్

    రిప్లయితొలగించండి

  9. పటము సగము మెయి పయిన ను
    దుట తిలకము దీర్చ సిగను దురిమిన పూలన్
    కటి మేఖల, ముకురములో,
    నిటలాక్షుడు ,శివుని గాంచి నివ్వెర పోయెన్

    రిప్లయితొలగించండి
  10. అటనిజ సతిభస్మము గని
    పటుతర భయద, విషాద, భంగిమ లడరన్
    స్ఫుటవీరభద్రకుడపర
    నిటలాక్షుడు, శివుని గాంచి నివ్వెర బోయెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సతీ భస్మము గాంచిన శవుడు, విషాద భయానక రసములు రెంటిని ప్రదర్శించగా, అపర శివావతారుడైన వీరభద్రుడు, ఆశ్చర్యంగా శివుని చూశాడు

      తొలగించండి
  11. ఘటికుడు దశాననుడు సం
    కటముల నెదిరించి చేసె కఠిన తపంబున్
    ఎదుటను వరమిడ నిలచిన
    నిటలాక్షుఁడు శివునిఁ గాంచి నివ్వెఱబోయెన్.

    రిప్లయితొలగించండి
  12. ఘటికుడు దశాననుడు సం
    కటముల నెదిరించి చేసె కఠిన తపంబున్
    అట వరమిడ నిలచిన యా
    నిటలాక్షుఁడు శివునిఁ గాంచి నివ్వెఱబోయెన్.

    రిప్లయితొలగించండి
  13. నిటలాక్షుగ నటసామ్రాట్
    నటరత్నను శివునిగాను నటియించ మనన్
    నట కౌశలులెదురు పడగ
    నిటలాక్షుఁడు శివునిఁ గాంచి నివ్వెఱ బోయెన్!

    రిప్లయితొలగించండి
  14. జటిలమె అందపు పోటి?జగదీశుని,గిరిజ మనసు
    కటకటగా జూసి విశ్వకర్మ అద్దమునిడగానె?
    నిటలాక్షుడు-శివుని గాంచి నివ్వెర బోయెన్ గనుగొని
    నట శివపార్వతులందు అందపు నానందములకు.
    -----------మధ్యాక్కర----------------------------

    రిప్లయితొలగించండి
  15. ఆ.వె: పటుతరమయిన మనంబున
    చటులోగ్రతపం బొనర్చు చలిమల సుతయున్
    వటురూపముతో వచ్చిన
    నిటలాక్షుని శివుని గాంచి నివ్వెర బోయెన్

    రిప్లయితొలగించండి
  16. మిత్రుల పూరణలు అలరించు చున్నవి. సమస్యపాదమును మార్చకుండ పూరించుట ముదావహం.

    రిప్లయితొలగించండి
  17. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఎటు తిరిగి యెంచి...’ అనండి.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవపాదంలో గణదోషం. ‘పటుతీవ్రభయద...’ అందామా?
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    ప్రాస సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. చటుల మహాన్యాస పఠన
    నటు నరుడే శివుడుకాక,నతనిని కొలువన్
    కటువగు కనుకను దానన్
    నిటలాక్షుడు శివునిగాంచి నివ్వెరబోయెన్

    (నారుద్రం రుద్రమర్చయేత్ అను మంత్రం ఆధారంగా)

    నిటలాక్షుని వేసమునను
    నటుడటు నటనను సలిపియు,నటరాజౌటన్
    పటునటనకు నబ్బురపడి
    నిటలాక్షుడు శివుని గాంచి నివ్వెరపోయెన్

    పటుతర క్రోడము కొరకై
    నటవిని పోరిన నరుడటు నటరాజు నెదిర్చెన్
    చటులాస్త్రము లేయగ గని,
    నిటలాక్షుడు శివునిగాంచి నివ్వెరపోయెన్

    పటుతర పాశుపతాస్త్రము
    నటు కృష్ణునిపైన తాను నాటగ జూచే
    దిటవగు నర్జునునటగని
    నిటలాక్షుడు శివునిగాంచి నివ్వెరపోయెన్

    రిప్లయితొలగించండి
  19. ఆ.వె: పటుతరమయిన మనంబున
    చటులోగ్రతపం బొనర్చు చలిమల సుతయున్
    వటురూపముతో వచ్చిన
    నిటలాక్షుడు శివుని గాంచి నివ్వెర బోయెన

    రిప్లయితొలగించండి
  20. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
    *****
    బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. చిటిపొటి గీతల తోడను
    పటుతరముగ శివుని చిత్రపటమును గీయ
    న్నటుగా చూడగ వచ్చిన
    నిటలాక్షుడు శివుని గాంచి నివ్వెరబోయెన్

    రిప్లయితొలగించండి
  22. జటనుండివచ్చి తనముం
    దట నిల్వగ జడలధారి దక్షుని కొఱకై ;
    పటుతర భద్రుడు శివుడవ,
    నిటలాక్షుడు, శివుని గాంచి నివ్వెర పోయెన్

    రిప్లయితొలగించండి
  23. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కవిశ్రీ సత్తిబాబు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. కటువుగ శివాలయమ్మున
    నెటుజూసిన గాంచలేక నెత్తిననున్నన్
    పటుతరపు జోడు దింపగ
    నిటలాక్షుఁడు శివునిఁ గాంచి నివ్వెఱబోయెన్

    జోడు = కళ్ళజోడు
    నిటలాక్షుడు = సులోచనమును ఫాలభాగమున ధరించిన వాడు

    రిప్లయితొలగించండి
  25. అట పార్వతి యద్దమునన్
    పటుతరమగు నాగుపాము పడుకొన మెడనున్
    తృటిలో తన బింబమునన్
    నిటలాక్షుఁడు శివునిఁ గాంచి నివ్వెఱబోయెన్

    రిప్లయితొలగించండి