కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘ముదిత లిద్దరు నాడుచు’ అనండి. ‘ఇద్దరు+ఆడుచు’ అన్నప్పుడు యడాగమం రాదు. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, సవరించిన మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘దృంచు’ సవరించలేదు!
రవ్వల వంటి రమణులు
రిప్లయితొలగించండిగవ్వలతో నాడు చండె గారడి జేయన్
రువ్వగ గాలిని దిరుగుచు
సవ్వడి చేయంగ మదికి సంతస మొందన్
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. ‘రవ్వలను బోలు రమణులు’ అనండి.
పల్లెలలో సరదాగా
రిప్లయితొలగించండినిల్లాండ్రే యాడుకొందు రిటు నీరాళ్ళన్
గిల్లాలాటందురులే
పిల్లలుతామిష్ట బడుచు ప్రియముగ నాడున్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ప్రొద్దు పుచ్చుకొరకు పుడమిపై పడతులు
రిప్లయితొలగించండిగలగల మను రవళి గవ్వలాడ
పాతకాలపాట పరవశమొనరింప
కన్నులార గనుడు కాంతలార.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘పాతకాలము+ఆట= పాతకాలపుటాట’ అవుతుంది. అక్కడ ‘పాతకాలమందు పరవశ మిడు నాట’ అనండి.
పువ్వారుబోడులచటన్
రిప్లయితొలగించండిగవ్వలతో నాడుచుండె గనరే! వారిన్!
రివ్వున గవ్వయె నెగయగ
నవ్వులు చిందించుచుండె నవలామణులే!!!
పంటలన్ని మంచి ఫలసాయ మివ్వగా
రిప్లయితొలగించండికర్షక గృహములకు కాంతి వచ్చె
గవ్వ లాట తోడ కమలాయతాక్షులు
సేద తీరుచుండ్రి సెలవులందు
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గవ్వ లా టను జూడుము జవ్వ నులట
రిప్లయితొలగించండివంట వార్పులు పూర్తియై జంట గాను
నాడు చుండిరి చక్కని యాట వారు
హాయి గలిగించు నాయాట యాడు కొలది
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
అతివ లచ్చన గాయల యాట జూసి
రిప్లయితొలగించండిమనసుకానంద మాయెను మరల మరల
సెల్లు, టీవీల, గేములు చేతికందె
పాత బడిపోయె సంస్కృతి బాధె మిగిలె!
టేకుమళ్ల వెంకటప్పయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅచ్చనకాయ లాడుతూ ఇద్దరుపల్లె పడచుల సంభాషణ :
రిప్లయితొలగించండిచక్క నైన వాడు! చదువున్న వాడని! !
చూడరమ్మనిరట చుక్క నిన్ను?
పట్నవాస మంట! కట్నకానుకలంట! !
యంద గలమె? వారి నాశపడిన? !!
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘సంస్కృతి+ఇంట’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
‘వారి యరుగులందు’ అనండి.
‘పరిఢవించు’ సరియైన రూపం.
టైపాటు... చింత దృంచు - చింత ద్రుంచు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండికన్నెలాడెడి యచ్చనకాయలాట
ముదితలిద్దరు యాడుచు మురిసినారు
చింత లెరుగని వారల చిన్నతనపు
రోజులన్నియు తలపున రూపుదొడగ
అచ్చెన గాయల నాడుచు
రిప్లయితొలగించండినచ్చెలువలు నుల్లసంబు లాడుచు వేడ్కన్
హెచ్చిన యాటలతమి తో
విచ్చిన గాయల నపేక్షఁ వీక్షించిరటన్
విడ్చిన: విచ్చిన
ఆట పాటలందు ఆనందమేబుట్టి
రిప్లయితొలగించండి| హాయి నెగడజేసి?మాయనట్టి సంఘసంస్కృతియటసాగెడి మార్గమై
చిన్న రాళ్ళ ఆట చింత దృంచు
2.కలిమి బలిమి కంటె కలతలులేనట్టి
ఇరుగుపొరుగు వారి యరుగు లందు
రాళ్ళ,రప్పలాట రసరమ్య భావాలు పాటపల్లవులుగపరిడ వించు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ముదిత లిద్దరు నాడుచు’ అనండి. ‘ఇద్దరు+ఆడుచు’ అన్నప్పుడు యడాగమం రాదు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
సవరించిన మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘దృంచు’ సవరించలేదు!