జనకుని పుణ్యము, లోకపుజననియె తా నుద్భవించి జనకుని జేసెన్జనకునిగ తానె సుతయయి జనకల్యాణమ్ము కొరకు సరగున " భువిలో ".
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
పొలము దున్నుచు నుండగా హలము బట్టికనియె జనక మహారాజు తనివితోడపెట్టెలోనున్న చక్కని బొట్టె నచటపెంచె నా బిడ్డను కరము ప్రేమతోడ
దున్ను చుండగ భూమిని దొరకు కతన సంత సంబున జనకుడు సంతు కపుడు పేరు పెట్టెను సీతగా బ్రియము తోడ మాత భూసుత ,సీతమ్మ మాన్యు రాలు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.*****పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
జనకుడు భూమిదున్న?నొకచక్కటిబాలికపేటికందునన్మనసుకు నచ్చు నట్లు మహిమాన్విత జానకి కానుపించగాఘనముగ రాజసంబొసగ| గర్వము నందున పెంచ బూనె వేదనలను మాన్పు పుత్రికని ధర్మ పథంబునపుత్రికాయె గా|2.నాగేటి చాలు నందున దాగినసీతమ్మయుండి దర్శన మవగా?సాగించు జీవితంబుకుఆగని సంతోష మొసగె అది జనకునకే|
యాగము జేయగ జనకుడునాగలితో భూమి దున్న నాగేటి తెరన్భూగర్భములో దొరకెనుపైగప్పిన మన్ను దీయ బాలిక భళిరా! మన్నుచూలి గాంచి మాలిమితో రాజుచేరదీసి పెంచె సీత యనుచు శివుని విల్లు ద్రుంచి శ్రీరామ చంద్రుడుపెండ్లి యాడె నామె బ్రీతి తోడ.
జన్మ జన్మల పుణ్యంబు జాదుకొనగ జనకుడాయెను సీతకు జనకరాజుఆదిలక్ష్మిని తనయగా పొందినాడు ముదము తోడ తన దశకు మురిసినాడు
భూమిని దొరికిన బాలికధామము జేర్చియు జనకుడు తండ్రిగ తనయన్గోముగ బెంచుచు నామెనురామునకిడి పెండ్లిజేసె రమణీయముగా!
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.‘జీవితంబుకు’ అనరాదు. అక్కడ ‘జీవితమునకు’ అనండి.*****మిస్సన్న గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.*****పి.యస్.ఆర్. మూర్తి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.మూడవపాదంలో యతి తప్పింది. ‘ఆదిలక్ష్మిని తనయగా నందినాడు’ అనండి. *****బొడ్డు శంకరయ్య గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులతో...జనకుఁడే యాగముననుఁ గర్షకుఁడునై పొలమ్ము దున్నంగ సీత సంలబ్ధకాఁగఁగన్నబిడ్డవలెనుఁ బెంచి, గరళ కంఠుధనువుఁ దునిమిన మేటి రామునకొసంగె!!
గుండు మధుసూదన్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
నాగేటి చాలుఁ జిక్కెన్!సాగర పుత్రిక వరించ సద్గుణ రామున్వాగించగ నీశు ధనువు!పోగాలము దాపురించ పొలమేపరికిన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
జనకుని పుణ్యము, లోకపు
రిప్లయితొలగించండిజననియె తా నుద్భవించి జనకుని జేసెన్
జనకునిగ తానె సుతయయి
జనకల్యాణమ్ము కొరకు సరగున " భువిలో ".
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
పొలము దున్నుచు నుండగా హలము బట్టి
రిప్లయితొలగించండికనియె జనక మహారాజు తనివితోడ
పెట్టెలోనున్న చక్కని బొట్టె నచట
పెంచె నా బిడ్డను కరము ప్రేమతోడ
దున్ను చుండగ భూమిని దొరకు కతన
రిప్లయితొలగించండిసంత సంబున జనకుడు సంతు కపుడు
పేరు పెట్టెను సీతగా బ్రియము తోడ
మాత భూసుత ,సీతమ్మ మాన్యు రాలు
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
జనకుడు భూమిదున్న?నొకచక్కటిబాలికపేటికందునన్
రిప్లయితొలగించండిమనసుకు నచ్చు నట్లు మహిమాన్విత జానకి కానుపించగా
ఘనముగ రాజసంబొసగ| గర్వము నందున పెంచ బూనె వే
దనలను మాన్పు పుత్రికని ధర్మ పథంబునపుత్రికాయె గా|
2.నాగేటి చాలు నందున
దాగినసీతమ్మయుండి దర్శన మవగా?
సాగించు జీవితంబుకు
ఆగని సంతోష మొసగె అది జనకునకే|
రిప్లయితొలగించండియాగము జేయగ జనకుడు
నాగలితో భూమి దున్న నాగేటి తెరన్
భూగర్భములో దొరకెను
పైగప్పిన మన్ను దీయ బాలిక భళిరా!
మన్నుచూలి గాంచి మాలిమితో రాజు
చేరదీసి పెంచె సీత యనుచు
శివుని విల్లు ద్రుంచి శ్రీరామ చంద్రుడు
పెండ్లి యాడె నామె బ్రీతి తోడ.
జన్మ జన్మల పుణ్యంబు జాదుకొనగ
రిప్లయితొలగించండిజనకుడాయెను సీతకు జనకరాజు
ఆదిలక్ష్మిని తనయగా పొందినాడు
ముదము తోడ తన దశకు మురిసినాడు
భూమిని దొరికిన బాలిక
రిప్లయితొలగించండిధామము జేర్చియు జనకుడు తండ్రిగ తనయన్
గోముగ బెంచుచు నామెను
రామునకిడి పెండ్లిజేసె రమణీయముగా!
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘జీవితంబుకు’ అనరాదు. అక్కడ ‘జీవితమునకు’ అనండి.
*****
మిస్సన్న గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
పి.యస్.ఆర్. మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మూడవపాదంలో యతి తప్పింది. ‘ఆదిలక్ష్మిని తనయగా నందినాడు’ అనండి.
*****
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులతో...
రిప్లయితొలగించండిజనకుఁడే యాగముననుఁ గర్షకుఁడునై పొ
లమ్ము దున్నంగ సీత సంలబ్ధకాఁగఁ
గన్నబిడ్డవలెనుఁ బెంచి, గరళ కంఠు
ధనువుఁ దునిమిన మేటి రామునకొసంగె!!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
నాగేటి చాలుఁ జిక్కెన్!
రిప్లయితొలగించండిసాగర పుత్రిక వరించ సద్గుణ రామున్
వాగించగ నీశు ధనువు!
పోగాలము దాపురించ పొలమేపరికిన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.