23, మే 2015, శనివారం

పద్య రచన - 914

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. ఉత్సవమ్మునందు నుత్సాహమొందుచు
    బాలు రచట నిలిచె ప్రాజ్ఞుల వలె
    కోమ లంత వెనుక కోలాట మాడగ
    చూడ వేడుకయ్యె సుజనులకును!!!

    రిప్లయితొలగించండి
  2. ఆట పాట లందు నష్ట దిగ్గజములు
    దాని వెనుక నేమొ దాండియాలు
    భారతగణతంత్ర పర్వమ్ము ఘనముగ
    జరగు చుండె నచట సంతసముగ

    రిప్లయితొలగించండి
  3. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘బాలురు’ బహువచనం, ‘నిలిచె’ ఏకవచనం. ‘బాలురు నిలిచి రట...’ అనండి.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. నిన్నటి పద్య రచన :
    తగలేసి పీల్చు ధూమము
    నెగరేసుకుపోవు ప్రాణమెగయుచు పైకిన్!
    సిగరెట్టు కాలు చుండగ
    పొగ పైకెగసెడు విధంపు పోలిక సుమతీ!
    నేటి పద్యరచన :
    గొప్ప వార లెవరొ గుర్తించగా నెంచి
    వేషమందు వారు వెలసి నారు
    అనుసరించఁ జదువ నాత్మకథలమీరు
    జీవన గతిఁ దెల్పు దీవెన లవె!

    రిప్లయితొలగించండి
  5. జరుగు చుండగ గణతంత్ర సంబరములు
    బాలు రందఱు నిలబడి వంద నములు
    చేయు చుండిరి జెండాకు జిత్త మలర
    చూడ ముచ్చట గానుండె జూడు డా ర్య !

    రిప్లయితొలగించండి
  6. అష్టదిగ్గజముల ఆహార్యములతోడ
    వేషధారులైన పిల్లవాండ్రు,
    వెనుక కోలలాడు వెలదులు నాట్యము
    వేడ్క జేయుచుండె విపులముగను!

    రిప్లయితొలగించండి
  7. భూసుర బృందము,భజనలు
    ఆసమయాన గన”దేవి”నాశీస్సులకై
    మైసూరు దసర వేడుక
    దాసులుగాబాల,భక్త దండుండినదై.
    2}చదువుని వీడి బాలురును సంస్కరణంబున దైవభక్తిచే
    కదలిరి పాండు రంగడిని గాంచగ నెంచిన భక్త బృందమే|
    వదలక భక్తి పాటలను—వారధిదాటుచు శక్తి యుక్తిచే
    మదియను మందిరాన మహిమాన్విత భావన లంట?వెంటనే|

    రిప్లయితొలగించండి
  8. ఆట పాటలందు నలుపు సొలుపు లేక
    స్త్రీ పురుషులెల్ల శీఘ్రముగను
    ముందు వెనుకలుండి ముచ్చట లాడంగ
    సాగె ముందు భారత శకట మపుడు.

    రిప్లయితొలగించండి
  9. నిన్నటి వర్ణన
    తగని సిగరెట్టు తలబట్టి తగల బెట్ట
    నదియు పగబట్టి పొగబెట్టు నందరకును
    మరియు కసిబట్టి క్షయనెట్టి మరణ మిచ్చు
    కనుక సిగరెట్టు వదిలేట్టు కట్టు బెట్టు
    తలబట్టి : పైన ఉండు పీక
    క్షయనెట్టి : క్షయ వ్యాధి కలిగించి (lungs కు T B)
    కట్టు బెట్టు : 1.నియమం పెట్టుకపెట్టుకో 2. ( బెట్) పందెము కట్టుకో

    రిప్లయితొలగించండి
  10. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘భజనల| నాసమయాన...’ అనండి.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ వృత్త్యనుప్రాసతో కూడిన నిన్నటి శీర్షికాపద్యం బాగున్నది. అభినందనలు.
    ‘వదిలేట్టు’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

    రిప్లయితొలగించండి