గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘వ్యధలు గలుగ తా| నమ్మహనీయుని...’ అనండి. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుండు మధుసూదన్ గారూ, చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ వైరాగ్యబోధకమైన పద్యం బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. కొన్ని టైపాట్లున్నాయి. ***** మిస్సన్న గారూ, మీ ‘కుబ్జావిలాసము’ ఖండిక చాలా బాగున్నది. అభినందనలు.
మెల్లగ గడ్డము బట్టుక
రిప్లయితొలగించండిచల్లని తన చేత లేపె చప్పున కుబ్జన్
అల్లన మనసున దల్చిన
నల్లని వాడప్పుడిచ్చె నాణెపు రూపున్
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కమ్మని రాగము పల్కదె?
రిప్లయితొలగించండియమ్మోవిన్ దాకి వెదురు వ్యధముల్ గలుగ!
న్నమ్మహనీయుని విమల క
రమ్మది సోకగఁ గురూపి రమ్యత నొందున్!
కుబ్జ యొకతె భిక్ష కొఱ కుగా నిలబడ
రిప్లయితొలగించండిప్రేమ మీర బిలిచి వేసె భిక్ష
కృష్ణు డచట చూడు కృష్ణయ్య ! మఱి నీవు
దీన జనుల బ్రోవు దినము దినము
కంసునకుఁ గలపముఁ ద్రివక్రయను కుబ్జ
రిప్లయితొలగించండితెచ్చు! నొకనాఁడు మధురలోఁ ద్రిమ్మరఁగనుఁ
గృష్ణుఁ డా లేపమున నలంకృత తనుఁడయి
కుబ్జ దేహత్రివక్రతన్ గూలఁద్రోచె!!
బాల్య యవ్వన వృద్ద –వంతుల మార్పులు
రిప్లయితొలగించండి----------కారణంబులు లేక కలతజెంది
ముదుసలి మురిపాలు మూడుకాళ్ళంటగ?
----------మానవ తేడాలు మలచు టేల?
పుట్టుక లెందుకు? గిట్టుట కొరకేన?
----------కట్టుబాట్లందున కలత లేల?
రాజసౌధము నందు రాజసమెందుకు?
----------లోకతిరును జూడ సోకమాయె|
అనుభ వాలనువినియున్న-నదురుటేల?
కాలగతులెల్ల మారెడి కారణాలు
తెలుప మనిగోర కృష్ణుని తేటబరచె
“కోర్కె దుఃఖాన్ని గలిగించుకూడికనెను
వక్రత దీర్చుచు కుబ్జకు
రిప్లయితొలగించండిసక్రమమగు రూపు నొసగి సంతస మిడుచున్
చక్రము నుబట్టి కంసుని
విక్రమముగ జంపినట్టి వెన్నుడ జేజే!!!
చక్కని కృష్ణుని జూచుచు
రిప్లయితొలగించండిమక్కువతోగంధమలది మాధవు బిలిచెన్
మ్రొక్కెదనంచా కుబుజన
ఫక్కున నవ్వుచు మురారి భామను గాంచెన
రామకృష్ణులు మధురలో రమ్యమైన
రిప్లయితొలగించండిపురపు టందాల నరయుచు బోవు వేళ
వీపుపై పెద్ద గూనితో వెడలుచున్న
కుబ్జ కనుపించె సిగ్గుతో కుందుచుండి.
కృష్ణు డామెను సుందరీ కేల నున్న
పాత్రలో నేమి గలదని పలుకరించ
సుందరీ యందువా నన్ను జూచి నీవు
వక్రనౌ నన్ను గేలించ వలదు కృష్ణ!
పాడు బ్రతుకిది మాధవా పాపి నగుట
యిట్టి దురవస్థ లిఖియించె నేమొ నొసట
దైవ మేమందు నందించ బోవుచుంటి
మంచి గంధమ్ము రాజుకు మధుర ననియె.
కుబ్జ మాటల కనియెను గోపకుండు
చంద నమునిమ్ము సుందరీ చల్లగాను
మేన నలదుక మురిసెద మేమియనుదు
వన్న నాపెయు పరమాత్మ కందజేసె.
చందనము గొని శ్రీశుడు సంతసించి
నీవు కుబ్జవా రమ్మిటు నిజముగాను
సుందరివి యని స్పృశియించ చోద్యముగను
కుబ్జ సుందరి యాయెను గూని పోయె.
మాధవా యేమి కృప నీది మాల్మి నన్ను
సుందరిగ తీర్చి దిద్దిన సుందరేశ
భక్తవత్సల పరమాత్మ పాపనాశ
యని నుతించెను సుందరి యవని నాథు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘వ్యధలు గలుగ తా| నమ్మహనీయుని...’ అనండి.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ వైరాగ్యబోధకమైన పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కొన్ని టైపాట్లున్నాయి.
*****
మిస్సన్న గారూ,
మీ ‘కుబ్జావిలాసము’ ఖండిక చాలా బాగున్నది. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదములు. వ్యధములు = గాయములు అనే భావంతో వ్రాశానండీ అన్వయం సరిపోదంటారా?
రిప్లయితొలగించండిGuruvugaariki dhanyavaadamulu.
రిప్లయితొలగించండి