15, మే 2015, శుక్రవారం

పద్య రచన - 906

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

22 కామెంట్‌లు:

 1. సగమైనదాని కోసము
  పొగిలెడు సుగ్రీవు, వాలి పోరున గాచెన్!
  నిగమార్థ వర్ణితుఁడతడు
  యుగ యుగమున ధర్మరక్షణోత్తమమెంచున్!

  రిప్లయితొలగించండి
 2. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. వాలియు సుగ్రీవుడునున్
  పోలిక భేదమ్ము లేక పోరుసలుపగా
  నేలీల సంహరింతును
  వాలిని గుర్తించనే యుపాయము లేదే

  రిప్లయితొలగించండి
 4. వాలి సుగ్రీవుల యనిలో వాలిఁదునిమి
  భాను సుతుని కాపాడగ ప్రతినఁజేసి
  పోలికలఁ బట్టి వారలన్ పోల్చలేక
  నేలపట్టి పెనిమిటి తా నిలచిపోయె

  రిప్లయితొలగించండి
 5. ధర్మపరిరక్షణ కొఱకు
  నిర్మలుడా రాముడితడు నిలిచెన్ ధరపై,
  కర్మరహితుడునయి సమర
  మర్మములెఱిగిన నిపుణుడు, మానవ జన్మన్.

  సోదరు పత్నిని కుటిలపు
  యాదరమునుఁ జూచు వాలి యన్యాయమునౌ
  వాదన ఖండనఁ జేయగ
  తా దిక్కై నిలిచి జేరె తమ్ముని తోడన్.

  వాలిని యోడింప రణముఁ
  దాలిమి వహియించి పోరు తరుణమునందున్
  కూలగ పాతకుడప్పుడు
  మేలుగ సుగ్రీవు కొఱకు మృగమును వలెనే

  వేటగఁ జంపెను రాముఁడు;
  చాటున నిలిచిన వివరము సరియగు కతమున్
  దేటగ దెలిపెను వాలికి
  సాటియె లేనట్టి ముక్తి సంపద నొసగెన్.

  రిప్లయితొలగించండి
 6. రవిజు భయము నుడిపి రామచంద్రునితోడ
  మైత్రి జేసె గాదె మరుతసుతుడు
  వాలి నొక్క కోల వధియించె రాముండు
  హరుష మొంది రెల్ల హరులు గూడి.

  రిప్లయితొలగించండి
 7. రవిజు భయము నుడిపి రామచంద్రునితోడ
  మైత్రి జేసె గాదె మరుతసుతుడు
  వాలి నొక్క కోల వధియించె రాముండు
  హరుష మొంది రెల్ల హరులు గూడి.

  రిప్లయితొలగించండి
 8. చెలిమి నిద్దరు సోదరుల్ చెంతనుండ
  బలిమి సోదర ద్వయంబు బట్టుదలగ
  రణవిదారణ క్రియలను రక్తి గొనిరి
  విధి విలాసము లత్యంత వింత గాదె

  రిప్లయితొలగించండి
 9. వాలిని గూల్చగ రఘుపతి
  బోలిక లొక్కటిగ యుండ పోల్చగ లేకన్
  మాల ధరించసు గ్రీవుడు
  వాలిని తాసంహరింప వలనని దలచెన్!!!

  రిప్లయితొలగించండి
 10. వాలి సుగ్రీవు లిరువురు పగను నొంది
  యొకరు పైనొకరు దలబడి నొండొరు లట
  గుద్దు పోటుల యుధ్ధాన గుంజి కొనగ
  కలుగు చుండెను భయములు కంటె మీరు ?

  రిప్లయితొలగించండి

 11. పద్యరచన..వాలి సుగ్రీవు లిరువురి పోలికలొక
  తీరునుండంగ దాశరథివిశిఖమును
  విడువడయ్యెను సంశయాత్ముడగుచుపొర
  పొచ్చమున తన మిత్రుండు చచ్చుననుచు

  రిప్లయితొలగించండి
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 13. వాలి,సుగ్రీవులిద్దరు-నేల ఫైన
  అన్నదమ్ములు యుద్దాన ఆరితేర|
  చెట్టు చాటున రాముడు చేటుగూర్చె
  చేతి సంజ్ఞయెవాలికిచెడుపుదెచ్చె

  రిప్లయితొలగించండి
 14. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  లక్ష్మీ దేవి గారూ,
  మీ ఖండకృతి బాగున్నది. అభినందనలు.
  ‘కుటిలపు|టాదరమును...’ అనండి.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  మరుతసుతుడు అన్నచోట ‘మారుతియును’ అనండి.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  సుగ్రీవుడు అన్నచోట గణదోషం. అక్కడ ‘మాల ధరించగ రవిజుడు’ అనండి.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు వందనములతో...

  (గతమున నేను దీనిని సమస్యాపూరణ శీర్షికనఁ బూరించితిని. అదియే యీ చిత్రమునకు సరిపోవుచున్నందున నిట మఱల నిడుచుంటిని.)


  దాశరథి, శివేష్వాసభి, ద్దానవరణ
  భీముఁ డింద్రకుమారుఁ జంపెను; రణమున
  సూర్యపుత్రుఁ డక్కజముగఁ జూచుచుండఁ,
  జెట్టు చాటున డాఁగియు శీఘ్రముగను!

  రిప్లయితొలగించండి
 16. గుండు మధుసూదన్ గారూ,
  మీ పద్యం మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. గురువుగారు, ధన్యవాదాలు.
  ఛందస్సు గుంపులో పండితులొకరు నా తప్పును సూచించారు. కానీ నాదరమున అని సవరణ సూచించారు.
  యా/నా రెండూ సరి అనిపించలేదు.
  మీరు చెప్పిన సవరణ సరిగ్గా సరిపోయింది. మీకు అనేక ధన్యవాదాలు ఎంతో ఓపిగ్గా సవరిస్తున్నందుకు.

  ధర్మపరిరక్షణ కొఱకు
  నిర్మలుడా రాముడితడు నిలిచెన్ ధరపై,
  కర్మరహితుడునయి సమర
  మర్మములెఱిగిన నిపుణుడు, మానవ జన్మన్.

  సోదరు పత్నిని కుటిలపు
  టాదరమునుఁ జూచు వాలి యన్యాయమునౌ
  వాదన ఖండనఁ జేయగ
  తా దిక్కై నిలిచి జేరె తమ్ముని తోడన్.

  వాలిని యోడింప రణముఁ
  దాలిమి వహియించి పోరు తరుణమునందున్
  కూలగ పాతకుడప్పుడు
  మేలుగ సుగ్రీవు కొఱకు మృగమును వలెనే

  వేటగఁ జంపెను రాముఁడు;
  చాటున నిలిచిన వివరము సరియగు కతమున్
  దేటగ దెలిపెను వాలికి
  సాటియె లేనట్టి ముక్తి సంపద నొసగెన్.

  రిప్లయితొలగించండి
 18. మానిని.
  వాలిని మార్కొనె భానుజు డత్తరి బాహుబ లోధృత భాసురతన్
  వాలియు భీకర వహ్నిిశి ఖామయ భండన భర్గని భాస్యుని గా
  వాలము లాడ్చుచు బాహువు లూపుచు భద్రగ జమ్ముల భండన క
  ల్లోల మహౌద్ధతి లోనగుచున్ బటులోహిత లోచనులుద్భటులై

  తే గీ చెలగి నొకర నొకరు నర చేత బట్టి
  బిగిచి వ్రచ్చుచు దట్టించి బిట్టురుకుచు
  పుచ్ఛముల బట్టి బంధించి బొరలజేసి
  మల్ల యుద్ధంపు క్రీడల మగ్నులైరి

  తే.గీ అదను జూచిన రాఘవు డమ్ము తోడ
  వాలి గుర్తించి ప్రాణముల్ పరిహరించె
  రఘుపతిని జేరి ప్రణమిల్లె రవిసుతుండు
  మునులు ఋషులును సురులెల్ల ముదము నంద

  రిప్లయితొలగించండి
 19. లక్ష్మీదేవి గారూ,
  సంతోషం!
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీకు మా నాన్న తెలుసా? ఇప్పుడే హిందూపూర్ అని చూసాను. మా నాన్న గారి పేరు, చలపతి రావు, జువాలజి లెక్చరర్. మాది హిందూపూర్. మా తాత గారి వూరు రాజంపేట (కడప) దగ్గర, కరణం గా పనిచేసారు. కాని మా నాన్న 45 సంవత్సరాలు గా హిందూపూర్ లోనే వుంటారు. ఆప్పుడప్పుడు గత 10 సం|| గా బెంగళూరు లో వుంటారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుమలత గారూ మీ నాన్నగారు తెలుసు. ఆయన కాలంలోనే నేను B.Sc., MPC student ని. మీ నాన్న గారు పాటలు బాగా పాడపాడే వారు. ఆయన నాకు గురు తుల్యులఆరోగ్యంగా ఉన్నారాండీ

   తొలగించండి