25, మే 2015, సోమవారం

న్యస్తాక్షరి - 30

అంశం- గ్రీష్మతాపము.
ఛందస్సు- ఆటవెలది.
నాలుగు పాదాల చివరి అక్షరాలు వరుసగా 
‘వ - డ - గా - లి’ ఉండాలి.

21 కామెంట్‌లు:

  1. వసుధ లోన జనుల భయపెట్టు నట్టి బె
    డదయె వేసవన దడదడ లాడు
    గా ప్రజలకు గుండెకాయ మరి వడగా
    లి దలపంగ మనషులెల్ల దడుసు

    రిప్లయితొలగించండి
  2. గ్రీష్మ తాప మనగ గేలిచేసె కలువ
    మలయ జంపు సౌరు మనము నిండ
    వెన్నె లందు తనరి విరహమ్ము మరువగా
    మెల్ల గాను వీచె చల్ల గాలి

    రిప్లయితొలగించండి
  3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది కాని న్యస్తాక్షరాలు పాదాంతంలో ఉంచాలి.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. చండ్ర నిప్పులు వెద జల్లుచు నా దేవ
    మణియె జంపు చుండె మండు టెండ
    తోడ మహిని వేడి గాడుపు వీయగా
    సెగల పొగల జిక్కి రగిలె మౌలి !!!

    రిప్లయితొలగించండి
  5. అక్కయ్య గారి పూరణ, వేసవి నిశిలో మల్లెగుబాళింపు తెమ్మెర లాగా హాయిగా ఉంది.

    రిప్లయితొలగించండి
  6. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు సుమనఃసునమస్సులతో...

    ఎండకాయుచుండె నింత వేఁడిమిని
    హించి సూర్యుఁ డిట్లు హింసల నిడఁ
    బగటిపూట జనులు బయటకురారుగా
    యింటనుండునట్టి యిచ్చఁ దేలి!!

    రిప్లయితొలగించండి
  7. ఎండకాలమందు నెంత గల్గిన చేవ
    మంచిగ మన నీదు మండుటెండ
    తట్టు కొనగ లేరు తాపమెక్కువవగా
    చల్లదనము నొసగు పిల్ల గాలి.

    రిప్లయితొలగించండి
  8. ఎండ వేడిమి భరియింప జాలనిదవ
    దయను మాలి మారుతము లిరుగెడ
    లందునగ్ని కీలలను దహియి౦చగా
    ఖరకరు౦డ లేద కరుణ జాలి

    రిప్లయితొలగించండి
  9. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. శ్రీనివాస్ గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. లంకా గిరిధర్ గారి పూరణ....

    మాడుచున్న మాడుమంటల దిగద్రావ
    చేత సురటి తలకు జెట్టునీడ
    వేసవి జనులకును వెఱ్ఱు లెత్తింపగా
    చల్ల గావలయును చల్లగాలి.

    రిప్లయితొలగించండి
  11. లంకా గిరిధర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. వసుధ –గ్రీష్మ తాప వన్నెచే మెఱియగ?
    డక్కు వేడిగాలి చిక్కులుంచు|
    గాబరాలు చాటు గారాభమందున
    లిపికరుడు “రవి”కిది లీల జూడ|
    2.వట్టివేర్ల నీరు,వడబోయ మజ్జిగ
    డప్పికందగానె డాగులేక
    గాబరాను వీడి గబగబ త్రాగంగ?
    లిబ్బిరాయుడికిని నబ్బు సుఖము

    రిప్లయితొలగించండి
  13. వేస వివిడి దులను వెదుకుచు సరివోవ
    కానిపించె పెద్ద గాలి మేడ
    పోయి చూడ యుండె పూర్వీకు లయది గా
    సంధ్య వేళ వీచె చల్ల గాలి

    రిప్లయితొలగించండి
  14. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నా, న్యస్తాక్షరాలు పాదాంతంలో ఉండాలన్న విషయాన్ని గమనించినట్టు లేదు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    పక్షులట్లు గూలి పలువురు పడిపోవ
    వంద వంద జనులు మ్రంద జూడ
    మానవాళి పైన మార్తాండ శక్తిగా
    విసురు చుండె నాంధ్ర వేడి గాలి

    నిన్నటి నా పద్యం మూడవ పాదంలోని పదం ''చేదుర్''నకు నా వివరణ :-
    చేయుదురు అను పదమునకు చేదురు గ్రామ్యమును వాడితిని . ఆపదం ఆమోద
    యోగ్యం కానిచో పద్యం లోని రెండవ పాదం క్రింది విధంగా మార్పు చేయ వచ్చును
    '' చెంతన్ జేరిన వారి ప్రొద్బలమదే చేదున్ గొనన్ జూడమే '
    చేఁదు :- ఆకర్షించు
    ఆధారం :- శబ్దరత్నాకరము

    రిప్లయితొలగించండి
  16. ఎండ తీవ్ర మయ్యె నెటుల వెళ్ళవలె వ
    యసుడిగిన ముసలిని యనుచును నడ
    క అతి కష్ట మైన గమనము చేయగా
    మెల్ల గాను వీచె చల్ల గాలి.

    రిప్లయితొలగించండి
  17. చెట్టు చేమ నీవు కొట్టి మరచిపోవ !
    సరియె నీడ కొరకు తిరిగి చూడ ?
    కరుణ జూప మనుచు కిరణుని వేడగా!
    ధరణి నెటుల జూపు తాను జాలి ?

    రిప్లయితొలగించండి
  18. నిన్నటి దత్తపది పద్యం:

    సొంతను మమకారము నిడి
    పంతముచే దురితములగు పనులను సలుపన్
    కుంతీ పుత్రులు కౌరవ
    సంతతి పులుపును చెరచిరి సంయోధమునన్!

    రిప్లయితొలగించండి
  19. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    నిన్నటి పూరణకు మీ సవరణ బాగుంది. సంతోషం!
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ముసలిని+అనుచును’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ముదుసలి ననుచును’ అనండి.
    నిన్నటి దత్తపదికి మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి